Heart Disease: మహిళల కంటే 7 ఏళ్లే ముందే పురుషులకు గుండె జబ్బులు.. కారణాలు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Disease: కొత్త అధ్యయనం ప్రకారం, మహిళలతో పోలిస్తే పురుషులకు సగటున 7 సంవత్సరాల ముందే గుండె సంబంధిత వ్యాధులు (CVD) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటూ ఓ షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది.. ఈ అధ్యయనంలో, పురుషుల్లో హృదయ సంబంధ వ్యాధులు 5 శాతానికి చేరుకునే వయస్సు 50.5 సంవత్సరాలుగా తేలగా, మహిళలు అదే స్థాయికి చేరుకోవడానికి 57.5 సంవత్సరాలు పడుతోందని ఈ అధ్యయనం తేల్చింది.. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి కార్డియోవాస్కులర్ వ్యాధులు 2022లో ప్రపంచవ్యాప్తంగా 19.8 మిలియన్ల మరణాలకు కారణమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఈ మరణాల్లో సుమారు 85 శాతం గుండెపోటు మరియు స్ట్రోక్ కారణంగా తేల్చారు.
CARDIA అధ్యయనం ఏమి చెబుతోంది?
ఈ పరిశోధనకు ఆధారంగా CARDIA (Coronary Artery Risk Development in Young Adults) అధ్యయన డేటాను ఉపయోగించారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల 5,112 మంది పాల్గొనేవారిని ఎంపిక చేసి, వారిని 30 సంవత్సరాల పాటు పరిశీలించారు. ఈ అధ్యయన ఫలితాలు Journal of the American Heart Association లో ప్రచురితమయ్యాయి.
Also Read
- International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
- Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
- TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
- Women's Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
పరిశోధనలో ముఖ్యంగా గమనించిన అంశాలు:
* పురుషుల్లో కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD) అత్యంత సాధారణంగా కనిపించింది
* మహిళలతో పోలిస్తే పురుషులు సుమారు 10 సంవత్సరాల ముందే CHD బారిన పడుతున్నారు
* స్ట్రోక్, గుండె వైఫల్యం విషయంలో పురుషులు–మహిళల మధ్య పెద్ద తేడా లేదని గుర్తించారు
* 35 ఏళ్ల వయస్సు నుంచే లింగ ఆధారిత ప్రమాద వ్యత్యాసం మొదలవుతుందని తేలింది
* పరిశోధకుల మాటల్లో, మహిళల్లో ఉండే స్త్రీ హార్మోన్ల రక్షణ లక్షణాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, పురుషుల్లో గుండె జబ్బుల ప్రమాదం ముందుగానే ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది.
పురుషులకు ప్రమాదం ఎందుకు ఎక్కువ?
శాస్త్రవేత్తలు తెలిపిన ప్రధాన కారణాలు:
* జీవనశైలి అలవాట్లు
* అధిక ధూమపానం, మద్యపానం
* శారీరక చురుకుదనం లోపం
* ఒత్తిడి, నిద్రలేమి
* అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్
ఈ కారణాల వల్ల పురుషుల్లో గుండె సంబంధిత వ్యాధుల “సంచిత సంభవం” మహిళల కంటే ఎక్కువగా ఉందని అధ్యయనం స్పష్టం చేసింది.
మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు
* ధూమపానం మానేయండి: పొగాకు ఉత్పత్తులు రక్తనాళాలను దెబ్బతీస్తాయి. ధూమపానం మానేసిన వెంటనే గుండె జబ్బుల ప్రమాదం తగ్గడం మొదలవుతుంది.
* హృదయానికి మేలు చేసే ఆహారం తీసుకోండి: తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, లీన్ ప్రోటీన్లు, ఒమేగా-3 ఉన్న చేపలను ఆహారంలో చేర్చాలి. ఉప్పు, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం: రోజుకు కనీసం 30–60 నిమిషాలు నడక, యోగా, సైక్లింగ్ వంటి మితమైన వ్యాయామం చేయాలి.
* ఒత్తిడి & నిద్ర నియంత్రణ: ధ్యానం, లోతైన శ్వాస, యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రతిరోజూ 7–9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం.
* ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి: రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవాలి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
Nepal Helicopter Collision: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రెండు హెలికాప్టర్లు ఢీకొని భారతీయుడు దుర్మరణం!
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలంలో పాకిస్థాన్ ఆటగాడు..? డిసెంబర్ 16న మినీ వేలం..
-
Homemade Malai: పాల మీగడ మందంగా రావట్లేదా? ఈ 4 సింపుల్ టిప్స్ పాటిస్తే గిన్నె నిండా మీగడ పక్కా!
-
India First Bullet Train: గంటకు 280 కి.మీ వేగం.. వై-ఫై నుంచి లగ్జరీ సీట్ల వరకు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ విశేషాలు
ట్రెండింగ్
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?