YS Jagan: ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? తగలబెడతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి.. దాడి జరిగిన ఆ ఇంటిని పరిశీలించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆ కుటుంబాన్ని పరామర్శించారు.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. తగలబెడతారా..? అంటూ ఫైర్ అయ్యారు.. జోగి రమేష్ ఇల్లు మొత్తం చిన్నాభిన్నం అయ్యింది.. పక్కనే ఉన్న కరెంట్ ప్లగ్స్ అంటుకుని ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు.. బీసీ నాయకుడి వాయిస్ అణగదొక్కాలని ఇలా చేయటం న్యాయమా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. రమేష్ ఇంటిపై 5 గంటలకు దాడి జరిగితే పోలీసులు, టీడీపీ నేతలు పథక రచన చేశారు.. పోలీసులు, టీడీపీ నేతలతో కలసి ప్లాన్ చేసి దాడి చేశారని విమర్శించారు.. టీడీపీ నేతలు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి దాడి చేసిన వీడియో ఫుటేజ్ లు కూడా ఉన్నాయన్న ఆయన.. పోలీసుల సమక్షంలోనే నిప్పు పెట్టారు.. దాడి చేసిన టీడీపీ నేతలు మొత్తం చంద్రబాబు, లోకేష్ కి అత్యంత సన్నిహితులే అని తెలిపారు..
Also Read
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్‌లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా..? జంగిల్ రాజ్ లో ఉన్నామా..? అనటానికి ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు వైఎస్ జగన్.. జోగి రమేష్ ఆయన మీద పెట్టిన అక్రమ కేసులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో దాడి చేశారు.. లోకల్ పోలీసులతో పాటు సీపీ ఫోన్ కూడా ఎత్తలేదు.. అంబటి రాంబాబు ఇంటి దగ్గర దహనకాండ సమయంలో కూడా పోలీసులు ఇలాగే చేశారు.. పోలీసుల సమక్షంలోనే అక్కడ కూడా దాడి జరిగిందన్నారు.. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు.. గుంటూరులో అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డారు.. విధ్వంసం సృష్టించారు. అంబటి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారు. అంబటి ఆఫీస్‌ను కూడా తగలబెట్టారు. అంబటి ఇంట్లో, ఆఫీస్‌లో జరిగిన జంగిల్ రాజ్‌ను.. జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!