Naveen Polishetty : మైత్రీ బ్యానర్‌లో నవీన్ నెక్స్ట్ మూవీ.. అంచనాలు మామూలుగా లేవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ నవీన్ పొలిశెట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి, నవీన్ కెరీర్‌లోనే మొట్టమొదటి రూ. 100 కోట్ల మైలురాయిని అందుకుంది. ఎటువంటి భారీ హంగులు లేకుండా, కేవలం కంటెంట్.. తనదైన నటనను నమ్ముకుని ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుత విజయం నవీన్‌ను టాలీవుడ్ టాప్ లీగ్ హీరోల సరసన నిలబెట్టడమే కాకుండా, ఆయన స్టార్ పవర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
Also Read : Jayaram : ‘అల వైకుంఠపురములో’ షూటింగ్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ బయటపెట్టిన జయరామ్
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
నవీన్ పొలిశెట్టి సాధించిన ఈ భారీ విజయానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. అంతటితో ఆగకుండా, తమ తదుపరి ప్రతిష్టాత్మక చిత్రంలో నవీన్ పొలిశెట్టి నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చింది. ‘ఈ ప్రాజెక్ట్ కోసం మేం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ మైత్రీ మేకర్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మైత్రీ బ్యానర్.. ఎనర్జిటిక్ స్టార్ నవీన్ కాంబో అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా కచ్చితంగా ఒక వెరైటీ సబ్జెక్టుతో కూడిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నవీన్, ఈ భారీ నిర్మాణ సంస్థతో కలిసి మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!