Anthropic CEO: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఊస్ట్.. ఆంథ్రోపిక్ సీఈవో హెచ్చరిక..
- ఏఐతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో వణుకు..
- మరికొన్ని నెలల్లో టెక్కీలను రిప్లేస్ చేసే ఏఐ మోడల్స్..
- ఆంథ్రోపిక్ సీఈవో హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anthropic CEO: టెక్ రంగంలో సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆంథ్రోపిక్ సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ షేర్ల పడిపోయేలా చేసింది. దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు కుదేలయ్యాయి. భారీ సంపద ఆవిరై పోయింది. ఆంథ్రోపిక్ కంపెనీ తీసుకువచ్చిన క్లాడ్ కోవర్క్ అనే ఏఐ టూర్ టెక్ రంగంలో దుమారాన్ని రేపింది. ఈ ఏఐ మన సిస్టమ్ లోని ఫైళ్లు, పోల్డర్లను యాక్సెస్ చేసి, మనం ఇచ్చే పనుల్ని చక్కపెట్టేస్తోంది. జీతాల లెక్కలు, డేటా అనాలిసిస్, స్టాక్ మార్కెట్ రిపోర్టు , న్యాయపరమైన అంశాలతో కూడిన నివేదిక కావచ్చు, ఏ పనినైనా క్లాడ్ కోవర్క్ ఈజీగా చేయగలదని కంపెనీ చెబుతోంది.
Read Also: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు Rinku Singhకు షాక్.. సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
ఇదిలా ఉంటే, ఇప్పటికే అనేక ఏఐ టూల్స్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆంథ్రోపిక్ రాకతో ఈ భయాలు మరింత పెరిగాయి. తాజాగా, ఆంథ్రోపిక్ సీఈవో దారియో అమోడీ చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. వచ్చే 5 ఏళ్లలో 50 శాతం ఎంట్ర లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయని చెప్పారు. ఇదే కాకుండా వచ్చే 6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను పూర్తిగా రీప్లేస్ చేసే ఏఐ మోడల్స్ రావచ్చని హెచ్చరించారు. . ఆయన హెచ్చరికల తర్వాత వచ్చిన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ కూడా ఇదే తరహా డేటాను చూపిస్తోంది. డిసెంబర్ 2025లో ఉద్యోగావకాశాలు 6.54 మిలియన్లకు పడిపోయాయని చెప్పింది. సెప్టెంబర్ 2020 తర్వాత ఇదే అత్యల్పం అని నివేదిక చెబుతోంది.
టెక్ రంగంలో ఏఐ పురోగతి అనుకున్న దానికన్నా చాలా వేగంగా పెరుగుతోందని దామోడీ వెల్లడించారు. ఇది మనుషులు చేసే పనికి సామాన్య ప్రత్యామ్నాయం అవుతోందని అన్నారు. లా, ఫైనాన్స్, కన్సల్టింగ్ రంగాల్లో దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసిపారేస్తున్నాయి. అమెజాన్ ఇటీవల భారీ లేఆఫ్స్ ప్రకటించింది. రానున్న రోజుల్లో టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తీసివేత కార్యక్రమాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టెక్కీల్లో భయాలు పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!