T20 World Cup 2026: భారత్ మ్యాచ్ ఆడకపోతే పాక్‌కు ‘డూ ఆర్ డై’ తప్పదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: నేటి నుంచి టీ 20 వరల్డ్ కప్ షురూ అవుతుంది. ఇప్పటికీ పాకిస్థాన్ విషయంలో పరిస్థితి గందరగోళంగా ఉంది. గ్రూప్-ఏలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను నిజంగా బహిష్కరిస్తే.. ఇక మిగిలిన ప్రతి మ్యాచ్ వారికి ఫైనల్‌లా మారనుంది. నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా జట్లతో ఆడే మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిందే. ఒక్క ఓటమి వచ్చినా, తదుపరి దశకు వెళ్లడం కష్టమే. ఈ కీలక సమయంలో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు ఏ కాంబినేషన్ బాగుంటుందో ఎంచుకుంటామని స్పష్టంగా చెప్పాడు. అవసరం అయితే అనుభవం ఉన్న ప్లేయర్లను పక్కన పెట్టడానికి సిద్ధమేనని చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు కూడా జట్టు కాంబినేషన్‌కు సరిపోకపోతే ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు ఉండదని ఆఘా తేల్చి చెప్పాడు.
READ MORE: Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారం.. ముగ్గురు మంత్రులతో కమిటీ..!
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
అయితే దీనికి వెంటనే ఓ స్పష్టత సైతం ఇచ్చాడు. తాను బాబర్, ఫఖర్ పేర్లు ఉదాహరణగా మాత్రమే చెప్పానన్నాడు. ఫఖర్ గత దశాబ్దకాలంగా పాకిస్థాన్‌కు ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడని, అలాగే బాబర్ సైతం ఎన్నో సార్లు జట్టును గెలిపించాడని గుర్తు చేశాడు. వాళ్లిద్దరికీ తన పూర్తి మద్దతు ఉంటుంది. కానీ చివరికి జట్టుకు ఏది మంచిదో, అదే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. మరోవైపు తన పాత్ర గురించి సల్మాన్ అలీ ఆఘా స్పష్టత ఇచ్చాడు. టీ20 వరల్డ్‌కప్ ఆరంభంలో తాను నంబర్-3 స్థానంలోనే బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. “పవర్‌ప్లేలో ప్రత్యర్థి జట్లు ఎక్కువగా స్పిన్నర్లకు అవకాశం ఇస్తారు. స్పిన్‌ను నేను బాగా ఎదుర్కొనగలను, వేగంగా పరుగులు తీయగలను. అందుకే నేను నంబర్-3 లో బ్యాటింగ్ చేయాలని చెప్పారు. ఇక అదే స్థానంలో కొనసాగుతాను” అని ఆఘా అన్నాడు. మొత్తానికి పాకిస్థాన్ జట్టు బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. చివరకి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!