Trump: ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరిస్తూ ట్రంప్ వీడియో పోస్ట్.. డెమోక్రాట్లు మండిపాటు
- ట్రంప్ అనుచిత ప్రవర్తన
- ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరిస్తూ వీడియో పోస్ట్
- అధ్యక్షుడుపై మండిపడ్డ డెమోక్రాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బరాక్ ఒబామా.. రెండు పర్యాయలు అగ్ర రాజ్యం అమెరికాను పరిపాలించిన అధ్యక్షుడు. ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అలాంటి నేతపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుచిత చర్యకు పాల్పడ్డారు. బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరించి ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోలో ‘‘ది లయన్ స్లిప్స్ టునైట్’’ పాట ప్లే అవుతుండగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ముఖాలు కోతి రూపాల్లో ఒక క్షణం పాటు కనిపించాయి. అంతేకాకుండా 2020 ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు.
Also Read
ఇది కూడా చదవండి: Trump-Modi: భారత్‌కు ట్రంప్ గుడ్‌న్యూస్.. జరిమానా సుంకం ఎత్తివేత
ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇది చాలా అసహ్యకరమైన ప్రవర్తన అంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పేర్కొన్నారు. ‘‘అధ్యక్షుడి అసహ్యకరమైన ప్రవర్తన. ప్రతి ఒక్కరు రిపబ్లికన్ నేత తీరును ఖండించాలి.’’ అని న్యూసమ్ ఎక్స్‌లో రాశారు. చరిత్రలో ట్రంప్ ఒక మచ్చ అని.. ‘‘జాత్యహంకరం’’ అని మాజీ జాతీయ భద్రతా సలహాదారు, ఒబామా సన్నిహితుడు బెన్ రోడ్స్ అభివర్ణించారు. ఇక డెమోక్రాట్ల విమర్శలను ‘‘నకిలీ ఆగ్రహం’’గా వైట్‌హౌస్ కొట్టిపారేసింది.
ఇది కూడా చదవండి: Parenting Tips 2026: మీ పిల్లలు చదివింది మర్చిపోతున్నారా? ఈ 5 చిట్కాలతో వారి జ్ఞాపకశక్తిని పెంచండి.!
ట్రంప్ గతంలో కూడా ప్రపంచ నాయకులను ఏఐ సాయంతో ఎగతాళి చేశారు. గత సంవత్సరం ఓవల్ కార్యాలయంలో ఒబామాను అరెస్ట్ చేసినట్లుగా.. నారింజ రంగు జంప్‌సూట్‌లో కటకటాల వెనుక ఉన్నట్లుగా రూపొందించిన వీడియోను ట్రంప్ పోస్ట్ చేశారు. దీనిపై కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి.
U.S. President Donald Trump posted this on Truth Social, which featured the Obamas as monkeys. pic.twitter.com/f0ovYjPnDy
— Open Source Intel (@Osint613) February 6, 2026
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..