Vaibhav Suryavanshi: “వీడు మామూలోడు కాదు భయ్యా”.. 14 ఏళ్లకే కోహ్లీ రికార్డులను చెరిపేస్తున్న వైభవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. దీనికి కారణం విధ్వంసకర బ్యాటింగ్. భారత క్రికెట్‌లో ఒక చిన్న వయసు ఆటగాడు అసాధారణంగా రాణించడం చాలా అరుదు. ఇలా ఓ యువ ప్లేయర్ రెచ్చిపోతే వెంటనే గత దిగ్గజాలతో పోలికలు మొదలవుతాయి. వైభవ్ సూర్యవంశీ విషయంలోనూ అదే జరిగింది. కానీ ఈసారి పోలిక కేవలం హైప్ కోసం కాదు. ఓ గ్రేట్ ప్లేయర్‌కి సంబంధించిన ముద్రలను చెరిపేస్తూ పోతున్నాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం వైభవ్ కోహ్లీ చిన్ననాటి రికార్డులను ఒక్కొక్కటిగా చెరిపేస్తూ ముందుకు వెళ్తున్నాడు. సచిన్ టెండూల్కర్‌ది సైతం గొప్ప ప్రమాణమే అయినా.. అండర్-19 స్థాయిలో చూస్తే వైభవ్‌కు విరాట్ కోహ్లీతోనే దగ్గరైన పోలిక ఉంది.
READ MORE: Jayaram : ‘అల వైకుంఠపురములో’ షూటింగ్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ బయటపెట్టిన జయరామ్
Also Read
- Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
- CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
విరాట్ కోహ్లీ 2006 నుంచి 2008 మధ్య అండర్-19 క్రికెట్ ఆడాడు. అప్పటికి అతని వయసు దాదాపు 17. 19 ఏళ్లకే జట్టును నడిపించే స్థాయికి చేరాడు. కానీ వైభవ్ సూర్యవంశీ అదే స్థాయి ప్రదర్శనను కబరుస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే కొన్ని చోట్ల ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం యూత్ క్రికెట్ పూర్తిగా మారిపోయింది. టీవీలు, సోషల్ మీడియా, ఐపీఎల్ చర్చలు అన్నీ చిన్న వయసులోనే ఆటగాళ్లపై ఫోకస్ పెడుతున్నాయి. ఒకప్పుడు యూత్ క్రికెట్ అంటే ప్రశాంతంగా ఎదిగే దశ. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తాజా ట్రెండింగ్‌కి అనుగుణంగా వైభవ్ బెదరకుండా ఆడుతున్నాడు. వన్డే ఫార్మాట్‌లో చూస్తే, వైభవ్ ఇప్పటికే విరాట్‌ను దాటేశాడు. 2026 నాటికి వైభవ్ కేవలం 20 ఇన్నింగ్స్‌లలోనే 1047 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీకి అదే స్థాయి పరుగులు చేయడానికి 24–25 ఇన్నింగ్స్‌లు పట్టాయి. వైభవ్ స్ట్రైక్‌రేట్ 156కు పైగా ఉంది. విరాట్ యూత్ క్రికెట్‌లో స్ట్రైక్‌రేట్ 85.56 మత్రమే ఉండేది. ఇది ఎవరు గొప్ప అన్నదానికంటే.. ఇద్దరి ఆటశైలిలో ఉన్న తేడాను గమనించాలి. విరాట్ అప్పట్లో ఓపికగా ఆడేవాడు. సింగిల్స్ తీస్తూ, బౌలర్లను అలసిపోయేలా చేసేవాడు. వైభవ్ మాత్రం మొదటి ఓవర్ నుంచే దాడి చేస్తాడు. బౌండరీలతో మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకుంటాడు. అందుకే వైభవ్‌కు “బౌండరీ కింగ్” అనే పేరు వచ్చింది. అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలోనే అతి చిన్న వయసులో ఫిఫ్టీ, సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2026 అండర్-19 వరల్డ్‌కప్ వైభవ్ జీవితంలో ఓ మైలురాయిగా నిలిచింది. విరాట్‌కు 2008 వరల్డ్‌కప్ అంటే ఎలా గుర్తుంటుందో, వైభవ్‌కు ఈ టోర్నీ అలాగే గుర్తుండిపోతుంది. కానీ ఇక్కడ తేడా ఏంటంటే.. విరాట్ కెప్టెన్‌గా జట్టును గెలిపించాడు. వైభవ్ మాత్రం తన బ్యాట్‌తోనే మ్యాచ్‌లను తారుమారు చేశాడు.
READ MORE: T20 World Cup Record: ప్రమాదంలో కోహ్లీ T20 ప్రపంచ కప్ రికార్డు.. జోస్ బట్లర్ బ్రేక్ చేసేనా..?
తాజాగా ఇంగ్లాండ్‌తో ఫైనల్‌లో వైభవ్ ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్ అసాధారణం. కేవలం 80 బంతుల్లో ఈ స్కోరు. 14 ఏళ్ల వయసులో అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన అతి చిన్న ఆటగాడు అతనే. 55 బంతుల్లో సెంచరీ, 71 బంతుల్లో 150 పరుగులు చేయడం యూత్ క్రికెట్‌లోనే వేగవంతమైన రికార్డులు. ఒక్క ఇన్నింగ్స్‌లో 15 సిక్సులు కొట్టి ప్రపంచ రికార్డు సైతం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 411 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుష్ మత్రేతో కలిసి కేవలం 19 ఓవర్లలోనే 142 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తం టోర్నీలో వైభవ్ 22 సిక్సులు కొట్టాడు. ఇప్పటివరకు ఉన్న వరల్డ్‌కప్ రికార్డు 18ను కూడా దాటేశాడు. బంగ్లాదేశ్‌పై చేసిన 72 పరుగుల ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీని దాటి భారత్ తరఫున అత్యధిక యూత్ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
READ MORE: Trump: ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరిస్తూ ట్రంప్ వీడియో పోస్ట్.. డెమోక్రాట్లు మండిపాటు
అయితే టెస్ట్ తరహా క్రికెట్ విషయానికి వస్తే.. వైభవ్ కంటే చిన్ననాటి విరాట్ కోహ్లీ ముందే ఉన్నాడు. యూత్ టెస్టుల్లో విరాట్ 932 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లలో ఆడగల ఆటగాడిగా అప్పుడే సంకేతాలు ఇచ్చాడు. వైభవ్ మాత్రం ఇక్కడ ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉన్నాడు. అతని సగటు 28గా ఉంది. ఆట ఇంకా పూర్తిగా మలచుకోవాల్సి ఉంది. అయినా వైభవ్ ప్రత్యేకత ఇక్కడ కూడా కనిపిస్తుంది. యూత్ టెస్టుల్లో భారత ఆటగాడు చేసిన వేగవంతమైన సెంచరీ రికార్డు అతనిదే. కేవలం 58 బంతుల్లోనే వంద పరుగులు. అంటే ఫార్మాట్ ఏదైనా, దూకుడే అతని సహజ స్వభావం. కేవలం సంఖ్యలకే కాదు, ఆటగాడి మనస్తత్వానికీ ఈ పోలిక వెళ్తుంది. విరాట్ చిన్నప్పటి నుంచే బలంగా, పరిస్థితులకు తగ్గట్లు మారే తెలివి చూపించాడు. వైభవ్ ఇంకా ఆ దశలోనే ఉన్నాడు. కొన్ని సార్లు ఎక్కువ రిస్క్ తీసుకోవడం, షాట్ సెలక్షన్ లోపాలు కనిపిస్తున్నాయి. ఒత్తిడిలో ఓపికగా ఆడటం ఇంకా నేర్చుకోవాలి. మొత్తానికి వైభవ్ సూర్యవంశీ – విరాట్ కోహ్లీ పోలికకు ఒకే తీర్పు ఇవ్వడం కష్టం. వైభవ్ వేగం, దూకుడు, చిన్న వయసులో చేసిన రికార్డుల విషయంలో ముందున్నాడు. విరాట్ మాత్రం ఓపిక, స్థిరత్వం, టెస్ట్ క్రికెట్‌లో మేటి ప్రమాణంగా నిలిచాడు.
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..