OTR: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై BJP హైకమాండ్ ఫుల్ ఫోకస్
- తెలంగాణ బీజేపీలో విచిత్రమైన వాతావరణం
- కొన్నిచోట్ల పోటాపోటీ, మరికొన్ని చోట్ల అభ్యర్థులు కరవు
- మొత్తం 123 మున్సిపాలిటీలు, 2 వేల 996 వార్డులు
- బీజేపీ తరపున 5 వేల 457 నామినేషన్స్ దాఖలు
- ఉత్తర తెలంగాణలో బీజేపీకి అతివృష్టి
- కరీంనగర్‌లో 66 డివిజన్స్‌కు బీజేపీ తరఫున 375 నామినేషన్లు
- నిజామాబాద్‌లో 60 డివిజన్స్‌కు 253 నామినేషన్స్
- ఆదిలాబాద్‌లోని 49 డివిజన్స్‌కు 124 నామినేషన్లు
- కొన్ని మున్సిపాలిటీల్లో కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితి
- అశ్వారావుపేటలో 22 వార్డులకు 15 నామినేషన్సే
- ఉమ్మడి ఖమ్మం, వరంగల్ , నల్గొండ జిల్లాల్లో తీసికట్టు వ్యవహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్స్ ఘట్టం ముగిసింది. అన్ని పార్టీల తరపున అభ్యర్థులు పోటాపోటీగా దాఖలు చేశారు. ఒకే పార్టీ నుండి ఒకే వార్డ్‌లో ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్స్ కూడా వేశారు. అయితే ఈ విషయంలో బీజేపీ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోందట. ఆ పార్టీ పరిస్థితి అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి అన్నట్టుగా మారిపోయిందని అంటున్నారు. సాధారణంగా ఒక వార్డ్‌లో ఒక పార్టీ తరపున ఒకరికే బీ ఫామ్ ఇస్తారు. కానీ…బీజేపీలో కొన్ని చోట్ల పోటాపోటీగా నామినేషన్స్ వేస్తే… మరికొన్ని చోట్ల అభ్యర్థులు కరవయ్యారట. మొత్తం 123 మున్సిపాలిటీల్లోని 2 వేల 996 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం బీజేపీ తరపున 5 వేల 457 నామినేషన్స్ దాఖలయ్యాయి. చూడ్డానికి ఈ సంఖ్య బాగానే ఉన్నా… లెక్క ఇక్కడే తేడా కొడుతోందని అంటున్నాయి పార్టీ వర్గాలు.
READ ALSO: T20 World Cup 2026: సంజూ శాంసన్‌కు షాక్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్!
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
తన సంప్రదాయ కంచు కోటల్లో, పట్టణ కేంద్రాల్లో తిరుగులేని ఉత్సాహాన్ని ప్రదర్శించింది బీజేపీ కేడర్. అక్కడ నామినేషన్ల సంఖ్య వార్డుల కంటే ఐదారు రెట్లు ఎక్కువగా ఉంది. ఉత్తర తెలంగాణలోని ఎక్కువ మున్సిపాల్టీల్లో పార్టీ పరిస్థితి అతివృష్టి అన్నట్టుగా ఉంది. అక్కడ రెబెల్స్ బెడద కూడా పెరిగిపోయింది. ఉప సంహరణ గడువు ముగిసే లోపు ఎంతమంది తప్పుకుంటారన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్స్ ఉంటే.. బీజేపీ తరఫున 375 నామినేషన్లు పడ్డాయి. అంటే ప్రతి వార్డులో సగటున ఐదుగురు అభ్యర్థులు కమలం గుర్తు కోసం పోటీ పడుతున్నారు. ఇక నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 డివిజన్స్‌కుగాను 253 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్‌లోని 49 డివిజన్స్‌కు 124 నామినేషన్లు వేశారు. దీన్ని బట్టి చూస్తుంటే…. ఉత్తర తెలంగాణలో పార్టీ ఎంత బలోపేతం అవుతోందో, పార్టీ టిక్కెట్ కోసం పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని సంబరపడుతున్నారు తెలంగాణ కాషాయ పెద్దలు. కానీ….. అదే సమయంలో ఇంకోవైపు మాత్రం లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అక్కడ అభ్యర్థుల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతోంది. అన్ని వార్డుల్లో నామినేషన్స్ వేయడానికి కూడా అభ్యర్థులు కనిపించడం లేదు. ఉదాహరణకు అశ్వారావుపేట మునిసిపాలిటీనే తీసుకుంటే…. ఇక్కడ 22 వార్డులు ఉంటే బీజేపీ తరఫున 15 నామినేషన్లే పడ్డాయి. అంటే సుమారు 30% వార్డుల్లో పార్టీ పోటీ పెట్టలేకపోయింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ , నల్గొండ జిల్లాల్లో బీజేపీ పరిస్థితి ఇలాగే ఉందని అంటున్నారు. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మంచిగానే నామినేషన్ లు దాఖలైనా… ఇంకొన్ని చోట్ల కనీస అభ్యర్థులు కూడా లేకపోవడం లోటేనంటున్నారు పరిశీలకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణ గద్దెనెక్కాలని కలలుగంటున్న పార్టీ ఇలా ఉంటే ఎలాగన్నది పరిశీలకుల ప్రశ్న. ప్రస్తుతానికైతే….పార్టీ అభ్యర్థులు లేని చోట ఇండిపెండెంట్స్‌కు మద్దతిచ్చి రేపు గెలిస్తే… వాళ్ళు మా వాళ్ళేనని చెప్పుకోవాలన్న ఆలోచనలో తెలంగాణ బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.
READ ALSO: Loan App Blackmail Case: ప్రాణం తీసిన ఇన్‌స్టంట్ లోన్.. బ్లాక్ మెయిల్ తట్టుకోలేక సూసైడ్
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!