Team India: టీ20 వరల్డ్‌కప్ ముందు భారత జట్టులో భారీ మార్పులు.. డీఎప్సీ ఎంట్రీకి లైన్ క్లియర్
- నేటి నుంచి స్టార్ట్ కానున్న టీ20 వరల్డ్ కప్..
- వరల్డ్‌కప్ కి ముందు భారత జట్టులో భారీ మార్పులు..
- హర్షిత్ రాణా స్థానంలో తుది జట్టులోకి మియాభాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీ20 వరల్డ్‌కప్ 2026 ఈరోజు ( ఫిబ్రవరి 7న) ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. యువ పేసర్ హర్షిత్ రాణా టీం నుంచి తప్పుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వార్మ్- అప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో మోకాలికి గాయం అయినట్లు బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. నవీ ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో హర్షిత్ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. గాయానికి సంబంధించిన స్కాన్లు, స్పెషలిస్ట్ డాక్టర్ల సలహా తర్వాత హర్షిత్ టోర్నీలో పాల్గొనటం లేదని బీసీసీఐ వైద్య బృందం తేల్చి చెప్పింది. అతని స్థానంలో డిఎస్పీ మహమ్మద్ సిరాజ్ ని తుది భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
Read Also: T20 World Cup: నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ స్టార్ట్.. స్పెషల్ అట్రాక్షన్ గా ఆ మాజీ కెప్టెన్!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
వాషింగ్టన్ సుందర్‌పై రాకపై నో అప్‌డేట్:
ఇక, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంపై ఇంకా స్పష్టత రాలేదు అని బీసీసీఐ చెప్పుకొచ్చింది. సైడ్ స్ట్రెయిన్ కారణంగా అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్ ముందు జరిగిన ఐసీసీ అధికారిక ఫోటోషూట్‌కు కూడా సుందర్ హాజరుకాలేదు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్ పూర్తిగా ఫిట్ అయిన తర్వాతే తుది జట్టులో చేరతాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినప్పటికీ, బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక అప్‌డేట్ రావాల్సి ఉందన్నాడు.
Read Also: Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారం.. ముగ్గురు మంత్రులతో కమిటీ..!
ఓపెనింగ్ జోడీ ఫిక్స్:
టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ- ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతారని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంజు శాంసన్ బెంచ్‌కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. అమెరికాతో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు సంజు శాంసన్ నెట్స్‌లో కూడా బ్యాటింగ్ చేయలేదని తెలుస్తుంది.
టీమిండియా స్క్వాడ్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..