Expensive Taxi Ride: గంట టాక్సీ రైడ్ కోసం రూ. 30,000 బిల్లు.. షాకైన నటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Expensive Taxi Ride: స్విట్జర్లాండ్ పర్యటనలో అమెరికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ గినా డార్లింగ్ ఊహించని షాక్ తగిలింది.. కేవలం గంటపాటు టాక్సీ ప్రయాణానికి ఆమెకు దాదాపు $338 అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.30,500 బిల్లు రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది… వీడియోలో ప్రయాణం కొనసాగుతుండగానే టాక్సీ మీటర్ మొత్తం 225.70 స్విస్ ఫ్రాంక్కు చేరిన దృశ్యాలు కనిపిస్తాయి. వెనుక సీటులో కూర్చున్న గినా.. ఆ మొత్తాన్ని చూసి ఆశ్చర్యంతో స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారిపోయింది..
Read Also: Kotha Malupu: సింగర్ సునీత కొడుకు రెండో సినిమా వచ్చేస్తోంది!
Also Read
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
- Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
- Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
సాధారణంగా చాలా దేశాల్లో టాక్సీ ప్రయాణం అందుబాటులో ఉండే రవాణా మార్గంగా భావిస్తారు. అయితే, స్విట్జర్లాండ్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఈ ఘటన స్పష్టంచేసింది. అక్కడి అధిక వేతనాలు, జీవన వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల టాక్సీ ఛార్జీలు ఇతర దేశాల కంటే చాలా అధికంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ వీడియోకు గినా డార్లింగ్ ఇచ్చిన క్యాప్షన్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చివరికి బిల్లు $338 అయ్యింది. రైళ్లు, ఉబర్ ఉన్నాయని నాకు తెలుసు. కానీ, చాలా బరువున్న లగేజీ ఉండడంతో తొందరపడి టాక్సీ తీసుకోవాల్సి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేసింది.. అయితే, ఇక్కడ కుళాయి నీరు మాత్రం అద్భుతంగా ఉంది అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వీడియో ఇప్పటికే 4.4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా, వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. స్విట్జర్లాండ్‌లో జీవన వ్యయం ఎంత ఎక్కువగా ఉంటుందో వివరిస్తూ పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. ఒక నెటిజన్, అమెరికా వెలుపల గంటసేపు క్యాబ్ ప్రయాణం చాలా అరుదు. యూరప్‌లో రైళ్లే బెస్ట్, అవి అయితే చాలా తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి అని వ్యాఖ్యానించగా, మరో వ్యక్తి జ్యూరిచ్‌లో ఓ బార్‌లో ఒక్క కాక్‌టెయిల్‌కే $22 చెల్లించాల్సి వచ్చింది అంటూ స్పందించారు. ఇంకొకరు, స్విట్జర్లాండ్‌లో ధర అడగకుండా ఏ వస్తువూ కొనొద్దు అని హెచ్చరించగా, భారతదేశానికి చెందిన ఓ యూజర్ ఇక్కడ గంటన్నర క్యాబ్ ప్రయాణానికి గరిష్టంగా $12–13 మాత్రమే ఖర్చవుతుంది. అక్కడ క్యాబ్‌కు $300 అంటే నిజంగా షాకింగ్ అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!