Ragi Upma Recipe: ఉప్మా అంటే చిరాకా? తాతల ఆరోగ్య రహస్యం.. సూపర్ హెల్తీ రాగి ఉప్మా ట్రై చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Upma Recipe: జీవన శైలి మారుతోంది. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. “మా తాత వందేళ్లకు పైగా బతికిండు” అనే మాటలు పల్లేళ్లో తరచూ వింటుంటాం. వాళ్లు అన్నేళ్లు ఆరోగ్యంగా ఉండటానికి అసలు కారణం నాటి ఆహారపు అలవాట్లు. అప్పట్లో అన్నం కంటే రాగులు, సజ్జలు, మినుములు, కొర్రలు, జొన్నలు తినేవాళ్లు. అందుకే అంత గట్టిగా ఉండేవాళ్లు. నాటి ఆహారపు అలవాట్లు గుర్తు చేసేలా రాగులతో ఓ మంచి రెసిపీ చేసుకుందాం.. వాస్తవానికి కొందరికి ఉప్మా అంటే చెడ్డ చిరాకు. ఇంట్లో ఉప్మా చేస్తే తినకుండా అయినా ఉంటారు కానీ.. ఉప్మా మాత్రం తినను అని మారాం చేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం రాగులతో టేస్టీ ఉప్మా చేద్దాం.. ఇటీవల చాలా మంది మైదా, సుజీ లాంటి పదార్థాల్ని తగ్గించి, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. అలా ఆలోచించే వాళ్లకు ఈ రాగి రవ్వ ఉప్మా ఒక మంచి ఎంపిక. రాగి ఉప్మా చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు. ఒకటి రాగి రవ్వతో చేయడం. రెండోది రాగి పిండి, సేమియాను సమానంగా కలిపి చేయడం. కానీ రెండో పద్ధతిలో చేస్తే అది గ్లూటెన్ ఫ్రీ కాదు. అందుకే మనం రాగి రవ్వతో చేసే ఆరోగ్యకరమైన పద్ధతిలో ఉప్మా తయారు చేద్దాం.
READ MORE: Naveen Polishetty : మైత్రీ బ్యానర్‌లో నవీన్ నెక్స్ట్ మూవీ.. అంచనాలు మామూలుగా లేవు!
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
మార్కెట్లో రాగి రవ్వ దొరుకుతుంది. దాన్ని తెచ్చుకోండి. వంట మొదలు పెట్టే ముందు రాగి రవ్వను కడిగి అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత నీళ్లు పూర్తిగా వడగట్టి, చేత్తో ఒత్తి మిగిలిన నీరు తీసేయాలి. ఇలా చేస్తే ఉప్మా మృదువుగా ఉడుకుతుంది. తర్వాత బాణలిలో నూనె లేదా నెయ్యి వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, ఉద్దిపప్పు, జీడిపప్పులు వేయాలి. ఇవన్నీ బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మెత్తగా మారేవరకు వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన రాగి రవ్వను వేసి కొద్దిసేపు కలుపుతూ వేయించాలి. మూడు నుంచి నాలుగు నిమిషాల్లో రాగి నుంచి మంచి వాసన వస్తుంది. దాన్ని తీసి పక్కనే మరో పాత్రలో నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. ఆ నీరు కొంచెం ఉప్పగా ఉండాలి. మరిగిన నీటిని మెల్లగా రాగి రవ్వలో పోస్తూ మరో చేత్తో కలుపుతూ ఉండాలి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీరు చిమ్మే అవకాశం ఉంటుంది. అన్ని కలిపిన తర్వాత మూత పెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూడాలి. నీరు పూర్తిగా ఆవిరై, రాగి రవ్వ బాగా ఉడికితే చాలు. ఇంకా గట్టిగా అనిపిస్తే కొంచెం మరిగిన నీరు పోయొచ్చు. ఉడికిన తర్వాత మంట ఆపి పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. చివరగా నిమ్మరసం పిండుకుని, కొత్తిమీర చల్లి వేడివేడిగా లాగించాలి. కొన్ని సార్లు మార్కెట్‌లో దొరికే రాగి రవ్వ చాలా మోటుగా ఉంటుంది. అలా ఉంటే ఉడికినా కొంచెం గట్టిగా అనిపించొచ్చు. అలాంటి సమయంలో ఉప్మాను ఒక గిన్నెలో వేసి ప్రెజర్ కుక్కర్‌లో ఒక విజిల్ లేదా ఇన్‌స్టంట్ పాట్‌లో ఆరు నిమిషాలు ఉడికిస్తే సరిగ్గా మెత్తబడుతుంది. మామూలు రవ్వతో చేసిన ఉప్మా కంటే ఈ రాగి రవ్వ ఉప్మా తప్పకుండా నచ్చుతుంది!
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!