Smart Projector: లక్షల విలువైన టీవీలకు చెక్.. రూ.6 వేలకే భారీ స్క్రీన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Projector: ప్రస్తుత కాలంలో ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కానీ 100 లేదా 200 అంగుళాల స్మార్ట్ టీవీ కొనాలంటే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ కేవలం రూ.6 వేల లోపు ఉండి, బిగ్ స్క్రీన్ లగ్జరీని అనుభవించాలనుకుంటే, మీకు ఒక అద్భుతమైన ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే XElectron Techno Smart Projector. గత కొన్ని రోజులుగా అందుబాటులో ఉన్న ఈ ప్రొజెక్టర్ పనితీరు ఎలా ఉంది? ఇది టీవీకి సరైన ప్రత్యామ్నాయమా? పూర్తి వివరాలను ఈ స్టోరీలో పరిశీలిద్దాం.
READ ALSO: Indian Cricket Golden Era: వరల్డ్ క్రికెట్‌లో భారత్ సువర్ణాధ్యాయం.. రెండేళ్లలో ఐదు ఐసీసీ ట్రోఫీలు!
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
కాంపాక్ట్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ..
XElectron Techno ప్రొజెక్టర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. దీనికి తిప్పగలిగే (Rotatable) స్టాండ్ కూడా ఉంది. దీనిని మీరు టేబుల్‌పై పెట్టుకోవచ్చు లేదా నేరుగా సీలింగ్‌కు కూడా అమర్చుకోవచ్చు. నిజంగా ఇది బ్యాచిలర్స్, అద్దె గదుల్లో ఉండేవారు లేదా టీవీ కోసం ప్రత్యేకంగా స్థలం లేని వారికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా పని చేస్తుంది. ఇందులో ఇన్-బిల్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ ధర తక్కువైనా, ఫీచర్లు మాత్రం అదరహో అనిపిస్తాయి.
రిజల్యూషన్: ఇది 720p నేటివ్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అయితే 1080p, 4K కంటెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
స్క్రీన్ సైజ్: మీ గది పరిమాణాన్ని బట్టి దీనిని 200 అంగుళాల భారీ స్క్రీన్ వరకు విస్తరించుకోవచ్చు.
బెస్ట్ వ్యూయింగ్: చీకటి గదిలో, తెల్లటి గోడపై దీని ప్రొజెక్షన్ అద్భుతంగా ఉంటుంది. రంగులు సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. సినిమా ప్రియులకు ఇది ఒక విజువల్ ఫీస్ట్.
సాధారణ ప్రొజెక్టర్లలో ఫోకస్ సెట్ చేయడం కష్టం. కానీ ఇందులో రిమోట్ ఫోకస్ ఆప్షన్ ఉంది. అంటే మీరు ఉన్న చోటు నుంచే రిమోట్ ద్వారా మీ స్క్రీన్ క్లారిటీని సెట్ చేయవచ్చు. అలాగే ఇది కేవలం ప్రొజెక్టర్ మాత్రమే కాదు, ఒక మినీ కంప్యూటర్ లాంటిది కూడా. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై నడుస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్ ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. ఇందులో Wi-Fi 6, బ్లూటూత్, HDMI, USB పోర్ట్‌లు ఉన్నాయి. వైర్లెస్ సెటప్‌తో ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఇందులో అంతర్నిర్మిత స్పీకర్లు ఉన్నాయి. చిన్న గదికి ఇవి సరిపోతాయి. కానీ థియేటర్ లాంటి బేస్, సౌండ్ కావాలనుకుంటే ఒక మంచి సౌండ్‌బార్ లేదా బ్లూటూత్ స్పీకర్‌ను కనెక్ట్ చేసుకోవడం ఉత్తమం. మొదటిసారి ప్రొజెక్టర్ కొనాలనుకునే వారికి, పిల్లల కోసం హోమ్ థియేటర్ సెట్ చేయాలనుకునే వారికి XElectron Techno Smart Projector ఒక వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. తక్కువ ఖర్చులో బిగ్ స్క్రీన్ లగ్జరీ కావాలనుకుంటే దీనిని కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు.
READ ALSO: Under 19 World Cup: సాహో భారత్.. విశ్వవిజేత అయినా ప్రైజ్ మనీ ఇవ్వని ఐసీసీ! కారణం ఇదే
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు