రివ్యూ : శ్రీ చిదంబరం గారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట, గోపీనాథ్, శివకుమార్ మట్ట తులసి తదితరులు
- DIRECTOR: వినయ్ రత్నం
- MUSIC: చందు రవి
- PRODUCER: చింత వినీషా రెడ్డి, చింత గోపాల కృష్ణ రెడ్డి
గత ఏడాది ‘క’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ (Sri Chidambaram Garu). కొత్త నటీనటులతో, డెబ్యూ డైరెక్టర్ వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పల్లెటూరి నేపథ్యంతో, ఆత్మవిశ్వాసం–సెల్ఫ్ లవ్ వంటి అంశాలను స్పృశిస్తూ రూపొందిన ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కథ : రాజమండ్రి సమీపంలోని ఓ గ్రామంలో సోలమన్ అలియాస్ చిదంబరం (వంశీ తుమ్మల) తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న చిదంబరానికి మెల్ల కన్ను ఉండటంతో చిన్నప్పటి నుంచే అవమానాలు ఎదుర్కొంటుంటాడు. తన లోపాన్ని దాచుకోవడానికి నల్ల కళ్లద్దాలు ధరించి, లోలోపల కుంగిపోతూ జీవిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన లీలా (సంధ్య వశిష్ట) చిదంబరం మంచి మనసును చూసి ఇష్టపడుతుంది. అయితే, ఒక సంఘటన కారణంగా తనను లీలా తిరస్కరించిందని చిదంబరం భావిస్తాడు. ఈ క్రమంలో తను తీసుకున్న తప్పు నిర్ణయాలు ఏంటి? తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా తిరిగి పొందాడు? చివరకు తన ప్రేమను గెలుచుకున్నాడా? అన్నదే సినిమా కథ.
Also Read
విశ్లేషణ : ‘శ్రీ చిదంబరం గారు’ పూర్తిగా క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, చాలా రూటెడ్‌గా కథను నడిపించిన తీరు ప్రత్యేకంగా నిలుస్తుంది. పల్లెటూరి వాతావరణం, అక్కడి చిన్న చిన్న ఎమోషన్స్‌ను చాలా సహజంగా చూపించారు. దర్శకుడు వినయ్ రత్నం ఎంచుకున్న కోర్ పాయింట్ బాగున్నప్పటికీ, కథనం మాత్రం స్లోగా సాగుతుంది. ఎమోషనల్ సీన్స్‌ను బలంగా పండించాలన్న ప్రయత్నంలో కొన్ని చోట్ల సాగదీత అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో మరింత ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా ఎంగేజింగ్‌గా ఉండేది. అయినప్పటికీ, ‘నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే, ఇంకెవరు ప్రేమిస్తారు?’ అనే సందేశం బాగా కనెక్ట్ అవుతుంది.
నటీనటులు : చిదంబరం పాత్రలో వంశీ తుమ్మల అద్భుతంగా నటించాడు. ఒక శారీరక లోపం ఉన్న వ్యక్తి ఎదుర్కొనే మానసిక సంఘర్షణను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించాడు. ఇది అతని మొదటి సినిమా అయినప్పటికీ, నటనలో ఎక్కడా కొత్తవాడిలా అనిపించలేదు. లీలా పాత్రలో సంధ్య వశిష్ట నేచురల్‌గా నటించింది. ఆమె గోదావరి యాస, ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అయ్యింది. చిదంబరం తల్లిగా కల్పలత తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు.
ఫైనల్ గా : మొత్తంగా చూస్తే ‘శ్రీ చిదంబరం గారు’ ఒక స్వచ్ఛమైన పల్లె ప్రేమకథ. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ లవ్ వంటి అంశాలను నిజాయితీగా చూపించిన సినిమా ఇది. నటీనటుల నటన, విజువల్స్, మంచి సందేశం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. అయితే, స్లో నేరేషన్ మరియు చాలా సింపుల్ కథనం కొందరు ప్రేక్షకులను నిరాశపరచవచ్చు. ఎమోషనల్ లవ్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!