AI: దిగ్గజ కంపెనీల AI పెట్టుబడులు.. ఏకంగా భారత్ బడ్జెట్‌కు సమానం..
- ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న టెక్ కంపెనీలు..
- అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ పెట్టుబడులు $650 బిలియన్లు..
- భారత బడ్జెట్ కు సమానంగా ఏఐ పెట్టుబడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI: ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ఉద్యోగుల్ని తీసేసి, ఏఐపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఏకంగా భారత బడ్జెట్‌కు దాదాపుగా సమానమైన పెట్టుబడుల్ని కేవలం నాలుగు కంపెనీలే పెడుతున్నాయంటే ఏ రేంజ్‌లో ఏఐ బూమ్ ఉందో తెలుస్తోంది. ఏఐ, దాని అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ ఏకంగా 650 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెడుతున్నాయి. ఇటీవల, మన కేంద్ర బడ్జెట్ సుమారుగా 670 బిలియన్ డాలర్లు.
AIపై భారీ పెట్టుబడులు:
Also Read
- Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
అయితే, టెక్ కంపెనీలు చెబుతున్న ఈ లెక్క కేవలం అంచనా మాత్రమే. దీని కన్నా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే భారత్ బడ్జెట్ కేటాయింపుల కన్నా ఏఐపై దిగ్గజ కంపెనీలు పెడుతున్న పెట్టుబడులు అధికం. అమెజాన్ $200 బిలియన్, గూగుల్ $175–185 బిలియన్లు, మెటా $115–135 బిలియన్లు, మైక్రోసాఫ్ట్ $115–135 బిలియన్లు ఖర్చు చేస్తామని ప్రకటించాయి. ఈ మొత్తం ఖర్చు ప్రధానంగా డేటా సెంటర్లు, సూపర్‌కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, AI చిప్‌లు, సర్వర్లు, క్లౌడ్ టెక్నాలజీల కోసం వినియోగించుతామని చెబుతున్నాయి.
ఏఐ రంగంలో గెలిచిన వారికే టెక్ రంగంలో ఆధిపత్యం. దీంతోనే అనేక కంపెనీలు ఏఐపై దృష్టిపెట్టాయి, భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. ప్రతీ కస్టమర్ అనుభవం ఏఐతో ముడిపడి ఉందని, అందు కోసమే తాము అగ్రెసివ్‌గా పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు.
ఉద్యోగాలను తినేస్తున్న AI:
ఇదిలా ఉంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ఉద్యోగాలను తినేస్తోంది. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన ఆంథ్రోపిక్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లలో గుబులు పెంచుతున్నాయి. వచ్చే కొన్ని రోజుల్లో టెక్కీలను రీప్లేస్ చేసే ఏఐ మోడల్స్ వస్తాయని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకు అమెజాన్ 30,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. మైక్రోసాఫ్ట్ 9000 మందిని, మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో 10 శాతం సిబ్బందిని తగ్గించింది. ఏఐ వల్ల రాబోయే కాలంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?