Easy & Healthy Paneer Tikka Chapati: పిల్లలకి చపాతీ రోల్ ఇలా చేసి పెట్టారంటే రోజూ ఇదే కావాలంటారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Easy & Healthy Paneer Tikka Chapati: వంట గది నుంచి వచ్చే ఆ ఘుమఘుమలు ఊరిస్తుంటే.. ఆకలి దానంతట అదే పెరుగుతుంది. ముఖ్యంగా స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు ఏదైనా కొత్తగా, రుచిగా చేసి పెట్టాలనుకునే తల్లులకు ‘పన్నీర్ టిక్కా రోల్’ ఒక అద్భుతమైన ఎంపిక. బయట దొరికే ఫ్రాంకీల కంటే మిన్నగా, పూర్తి ఆరోగ్యకరంగా ఇంట్లోనే దీనిని ఎలా సిద్ధం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: MSVP OTT Release: జీ5లోకి మెగా విక్టరీ.. మెగాస్టార్ ‘ఓటీటీ’ ఊచకోతకు డేట్ లాక్ చేసుకోండి!
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
‘పన్నీర్ టిక్కా రోల్’కి కావలసిన పదార్థాలు..
గోధుమపిండి (1 కప్పు), పెరుగు (పావు కప్పు), ఉప్పు, నూనె, పన్నీర్ (200 గ్రా.), పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, వెన్న (బటర్), క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, మయోన్నైస్, టమాటా కెచప్.
తయారీ విధానం..
ముందుగా ఒక బౌల్‌లో గోధుమపిండి తీసుకుని అందులో ఉప్పు, కొద్దిగా నూనె, పావు కప్పు పెరుగు వేయాలి. పెరుగు వేయడం వల్ల చపాతీలు ఎంతో మెత్తగా వస్తాయి. కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకుని, 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అనంతరం చపాతీల్లా ఒత్తుకుని, పెనంపై నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి హాట్ బాక్స్‌లో ఉంచుకోవాలి. అనంతరం పన్నీర్ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి, కొంచెం కార్న్ ఫ్లోర్ పట్టించి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో పెరుగు తీసుకుని అందులో కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పంచదార, నెయ్యి వేసి బాగా కలపాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, క్యాప్సికం ముక్కలను హై ఫ్లేమ్‌లో లైట్‌గా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో వెన్న వేసి పన్నీర్ ముక్కలను దోరగా వేయించాలి. ఆపై మసాలా కలిపిన పెరుగు మిశ్రమాన్ని వేసి నూనె తేలే వరకు ఉడికించాలి. తర్వాత ఇందులో టమాటా ముక్కలు, వేయించిన పన్నీర్ వేసి కలపాలి.
రెస్టారెంట్ రుచి రావాలంటే.. కాల్చిన బొగ్గును ఒక చిన్న గిన్నెలో ఉంచి, ఆ గిన్నెను పన్నీర్ మిశ్రమం మధ్యలో పెట్టాలి. బొగ్గుపై కొంచెం నూనె లేదా వెన్న వేసి వెంటనే మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత ఆ పొగ వాసన పన్నీర్‌కు పట్టి అద్భుతమైన రుచినిస్తుంది. కాల్చిన చపాతీపై అప్పుడే తయారు చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఉంచి, దానిపై పచ్చి ఉల్లిపాయలు, మయోన్నైస్, టమాటా కెచప్, కొంచెం నిమ్మరసం చల్లి రోల్ చేయాలి. అంతే! వేడివేడి పన్నీర్ టిక్కా రోల్ సిద్ధం అవుతుంది. మైదా వాడకుండా కేవలం గోధుమపిండితో చేయడం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి.
READ ALSO: Tragic Incident: అన్నం పెట్టే చెట్టుపైనే.. కల్లు గీయడానికి వెళ్లి గీత కార్మికుడు మృతి..
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!