Sundar Pichai: డోంట్ వర్నీ.. కొత్త ఏఐపై గూగుల్ సీఈఓ క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundar Picha: టెక్ ప్రపంచం ఒక్కసారిగా కుదేలైంది. ఒక్క ఏఐ టూల్‌లో టెక్కీలు భయాందోళనకు గురయ్యారు. టెక్నాలజీ ప్రపంచంలో గత కొన్ని రోజులుగా ఒక్కసారిగా భయం చుట్టుముట్టింది. ఆంత్రోపిక్ అనే ఏఐ కంపెనీ విడుదల చేసిన కొత్త ప్లగిన్లతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. వీటితో సాఫ్ట్‌వేర్ కంపెనీల రోజులకు రోజులు దగ్గర పడ్డాయనే వాదనలు జోరుగా వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ షేర్లు భారీగా పడిపోయాయి. ఒకే రోజులో దాదాపు 285 బిలియన్ డాలర్లు పతనమయ్యాయి. దీనికి కొంతమంది ‘సాస్‌పోకలిప్స్’ అనే పేరు కూడా పెట్టేశారు. ఈ అంశంపై తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఏఐ అనేది ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధం కాదని.. ఇది మనం చేసే పనికి సహాయం చేసే ఒక సాధనం మాత్రమే అని స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ఏఐ వల్లే మరింత మెరుగయ్యాయని తెలిపారు. కంపెనీలకు ఇదే మంచి సమయమని వెల్లడించారు. మార్కెట్‌లో వచ్చిన ఈ గందరగోళం అంతా అతిశయోక్తే అని అభిప్రాయపడ్డారు.
READ MORE: Ramayana : యష్ వర్సెస్ విజయ్ సేతుపతి.. నితేష్ తివారీ రామాయణంలో అదిరిపోయే ట్విస్ట్!
Also Read
- Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
- OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
ఈ మాటలకు ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ సైతం మద్దతిచ్చారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ షేర్ల పతనం తనకు అయితే ప్రపంచంలోనే అతి అవివేకమైన విషయం అనిపిస్తోందని వ్యాగ్యంగా అన్నారు. “ఒక స్క్రూ తిప్పడానికి కొత్త సాధనం తయారు చేస్తామా? లేక ఉన్న స్క్రూడ్రైవర్‌నే వాడతామా? ఏఐ కూడా అంతే. ఇది ఉన్న సాఫ్ట్‌వేర్‌ను వాడుతుంది. కానీ వాటిని పూర్తిగా తీసేయదు” అని తెలిపారు. ఎన్విడియాలోనూ ఇలాంటి ఏఐ టూల్స్‌ని వాడటం వల్ల ఉద్యోగులు చిన్న పనుల నుంచి విముక్తి పొందారని, అసలు ముఖ్యమైన చిప్స్ డిజైన్ చేసే పనిపై దృష్టి పెట్టగలుగుతున్నారని చెప్పారు. అయితే ఈ భయానికి అసలు కారణం ఆంత్రోపిక్ ‘క్లాడ్ కోవర్క్’ అనే ఏఐకి చెందిన 11 ఓపెన్ సోర్స్ ప్లగిన్లు. ఇవి సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, కస్టమర్ సపోర్ట్ లాంటి సాధారణ కార్యాలయ పనులు చేస్తాయి. కానీ అసలు గుబులు తెచ్చింది లీగల్ ప్లగిన్. ఇది ఒప్పందాలు చెక్ చేయడం, ఎన్‌డీఏలు చూసుకోవడం, నిబంధనల పరిశీలన, లీగల్ రిపోర్టులు తయారు చేయడం లాంటి పనులన్నీ ఆటోమేటిక్‌గా చేస్తుంది. దీంతో పెద్ద లీగల్ కంపెనీల భవిష్యత్తు మీద అనుమానాలు మొదలయ్యాయి. దీని ఎఫెక్ట్‌తో థామ్సన్ రాయిటర్స్, రిలెక్స్ లాంటి సంస్థల షేర్లు దాదాపు 15 శాతం పడిపోయాయి. లీగల్‌జూమ్ అయితే 20 శాతం కుప్పకూలింది. భారత్‌లోనూ ప్రభావం కనిపించింది. ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఐటీ కంపెనీల షేర్లు తగ్గాయి.
READ MORE: మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్, 10,000mAh బ్యాటరీతో Portronics Moji 10 స్పెసిఫికేషన్లు
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!