Sumathi Sathakam Review : ‘సుమతీ శతకం’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Amardeep Chowdhury, Shaili Chowdhury, JDV Prasad, Tasty Teja, Karan Vijay,
- DIRECTOR: M.M. Naidu
- MUSIC: Subhash Anand
- PRODUCER: Kommalapati Sai Sudhakar
Sumathi Sathakam Review in Telugu : అమర్ దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన సినిమా ‘సుమతీ శతకం’. టేస్టీ తేజ, మహేష్ విట్టా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ఎలా ఉంది?,ఒక్క ఛాన్స్ అని అడిగిన అమర్ దీప్ కి విజయం అందించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
కృష్ణ (అమర్ దీప్)కి చిన్నతనం నుండి పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం.కానీ అతను పెళ్లి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతుంటాయి. అందుకు కారణం తూర్పు గోదావరి జిల్లాలోని తన సొంతూరు వైకుంఠపురంలో కిరాణా కొట్టు నడుపుతూ ఉండటం కూడా కారణం. ఆ అబ్బాయికి తమ ఊరికి దగ్గరలోని మరొక ఊరిలో అంగన్ వాడి టీచర్ సుమతి (శైలి చౌదరి) నచ్చుతుంది. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తాడు. నో చెప్పదు కానీ కృష్ణ ధైర్యానికి పరీక్ష పెడుతుంది.
Also Read
కృష్ణకు సుమతి పెట్టిన పరీక్ష ఏమిటి? సుమతి గ్రామస్తులతో కృష్ణకు ఏర్పడిన గొడవ ఏమిటి? సొంతూరిలోని గుడిలో జాతరకు పెళ్లి చేసుకోవాలని కృష్ణ అనుకోవడానికి కారణం ఏమిటి? సుమతి ఊరి గుడిలో ఏం జరిగింది? చివరకు వాళ్ళ పెళ్లి జరిగిందా? లేదా? అనేది సినిమా.
ఎలా ఉందంటే :
పల్లెటూరి కథకు భక్తి, సందేశాత్మక అంశాలు మేళవించి కమర్షియల్ పంథాలో మాస్ సినిమా తీశారు ‘సుమతీ శతకం’ దర్శకుడు ఎంఎం నాయుడు. కథలో అసలు పాయింట్ దగ్గరకు చేరుకోవడానికి బాగా సమయం తీసుకున్నారు.ఆ అసలు పాయింట్ కమ్ ట్విస్ట్ సుమతి శతకం సినిమాని మిగతా సినిమాలకు భిన్నంగా నిలిపింది.మెయిన్ ట్విస్ట్ కొత్తగా ఉండడం సినిమాకి ప్రధాన బలం.కానీ దాని చుట్టూ రాసుకున్న సీన్స్ మాత్రం ఊహాజనితంగా ఉన్నాయి.ఫస్ట్ హాఫ్ అంతా కూడా రొటీన్ పంథాలో సాగినా కూడా పల్లెటూరి వాతావరణం,అక్కడ జరిగే కొన్ని సిట్యుయేషన్స్ నవ్విస్తాయి.హీరో- హీరోయిన్ లవ్ ట్రాక్ రొటీన్ గానే అనిపించినా అతిగా లేకుండా డీసెంట్ గా ఉంది.మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక మలుపులు పెద్దగా లేకపోవడం,ఊహాజనిత కథనం కొంత మైనస్ అని చెప్పొచ్చు. కానీ ఆ లోపాలను కవర్ చేసేలా రాసుకున్న ఎమోషనల్ సీన్స్ కొంతవరకు వర్క్ అవుట్ అయ్యాయి. విజువల్స్ బాగున్నాయి.
నటీనటులు :
అమర్ దీప్ చౌదరి కొంత విరామం తర్వాత హీరోగా నటించిన చిత్రమిది. వెండితెర మీద తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. కిరాణా కొట్టు కృష్ణగా ఒదిగిన తీరు ప్రశంసనీయం. పల్లెటూరి యువకుడిగా తూర్పుగోదావరి యాస పలికించడం, భావోద్వేగభరిత సన్నివేశాల్లో పరిణితి చూపించాడు. అవకాశం రావడంతో రెండు మూడు యాక్షన్ సన్నివేశాల్లో తనలో మాస్ హీరో కటౌట్ ఉందని నిరూపించుకున్నాడు.అతని స్క్రీన్ ప్రెజెన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.
అతని తర్వాత కథలో కీలకమైన నాయిక పాత్ర పోషించిన శైలి చౌదరిది. అందంగా కనిపించింది.పాత్ర పరిధిమేర నటించింది.కథ పరంగా ఆమె గ్లామర్ ని ఇంకా ఎక్కువగా ఎలివేట్ చేసే అవకాశం లేకపోవడంతో దొరికిన స్క్రీన్ ప్రెజెన్స్ ని బాగానే వాడుకుంది.టేస్టీ తేజ, మహేష్ విట్టా తమదైన రీతిలో వినోదం అందించారు. హీరోతో ఒకరు, ఊరి సర్పంచ్ పాత్రలో రీల్స్ పిచ్చి ఉన్న సోషల్ మీడియా సెలబ్రిటీగా మరొకరు నవ్వించారు.మిర్చి కిరణ్ ని ఇంకా బాగా వాడుకుని ఉండాల్సింది అనిపించింది.అంగన్వాడీ ఆయా పాత్రలో కనిపించిన నటి కాస్త లౌడ్ గా అనిపించినా చాలా నేచురల్ గా చేసింది.
టెక్నీషియన్స్ :
ఈ పల్లెటూరి ప్రేమకథని తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ ఎస్ హాలేష్ మంచి పనితనం కనబరిచాడు.రురల్ బ్యాక్ డ్రాప్ ని బాగా క్యాప్చర్ చేశారు. సుభాష్ ఆనంద్ ఇచ్చిన పాటల్లో పల్లెటూరి ఫీల్ వచ్చింది.ఆర్ ఆర్ కూడా సినిమాలోని సీన్స్ ని,ఫీల్ ని ఎలివేట్ చేసింది.
ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది.దర్శకుడికి మొదటి సినిమా కావడంతో అక్కడక్కడా ఆ తడబాటు కనిపించింది.స్క్రీన్ ప్లే పై ఇంకాస్త వర్క్ చేసి ఉండాల్సింది.నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి ప్రోడక్ట్ పై నమ్మకంతో ఖర్చుకు వెనకాడలేదు.అందుకే ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.
ఓవరాల్‌గా చెప్పాలంటే..
గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మక కథలు ఇష్టపడే ప్రేక్షకులను ‘సుమతీ శతకం’ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ థ్రిల్ ఇస్తే మిగతా సినిమా కామెడీ ప్రధానంగా సాగుతుంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!