TGBIE Affiliation 2026-27: ఇంటర్ కళాశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం..
- ఫిబ్రవరి 12 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు
- మార్చి 13 వరకు ఫీజు లేకుండా అవకాశం
- సేఫ్టీ సర్టిఫికేట్లు తప్పనిసరి నిబంధనలు
- ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల నిర్వహణ , అఫిలియేషన్ ప్రక్రియలో ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక మార్పులను ప్రవేశపెట్టింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ కళాశాలల అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 12, 2026 నుండి ఆన్లైన్ వేదికగా ప్రారంభం కానుంది. విద్యా సంస్థలు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 13, 2026 వరకు గడువు ఇచ్చారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేయని పక్షంలో, గరిష్టంగా ₹20,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 17, 2026 వరకు అవకాశం కల్పించారు. ఈసారి దరఖాస్తులు , ఫీజు చెల్లింపుల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసిన బోర్డు, ఆఫ్‌లైన్ ద్వారా వచ్చే డిమాండ్ డ్రాఫ్ట్ (DD)లు లేదా చలాన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
- Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
- HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
- Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
కళాశాలల నాణ్యత , భద్రత విషయంలో బోర్డు ఈసారి అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. దరఖాస్తు చేసే సమయంలో కళాశాల యాజమాన్యాలు తమ వద్ద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ రశీదు (FDR), భవనానికి సంబంధించిన రిజిస్టర్డ్ లీజు పత్రం, , అత్యంత కీలకమైన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్‌తో పాటు శానిటరీ, బిల్డింగ్ సౌండ్‌నెస్ సర్టిఫికేట్లు చట్టబద్ధంగా అమలులో ఉండాలని సూచించింది. వీటితో పాటు బోధనా సిబ్బంది వివరాలు , వారి విద్యార్హత పత్రాలను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. ముఖ్యంగా, అదనపు వసతులు కల్పించకుండా కేవలం కోరుకునే అదనపు సెక్షన్ల ప్రతిపాదనలను బోర్డు నేరుగా తిరస్కరిస్తుంది. ముందస్తు అనుమతి లేకుండా కొత్త సెక్షన్లు ప్రారంభించడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.
కళాశాలల్లో చేయాలనుకునే మార్పుల విషయంలో కూడా మండలి స్పష్టమైన గడువును విధించింది. కళాశాల పేరు మార్చడం, ఒకే మండలం పరిధిలో స్థలం మార్చడం లేదా కో-ఎడ్యుకేషన్‌కు సంబంధించిన మార్పులు చేయాలనుకునే వారు తమ అఫిలియేషన్ ప్రతిపాదనలతో పాటే ఏప్రిల్ 17లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కళాశాలైనా నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు, ఆ కళాశాల గుర్తింపును శాశ్వతంగా రద్దు చేసే అధికారం విద్యా మండలికి ఉంటుంది. ఈ నిబంధనలన్నీ విద్యార్థుల భద్రతను , విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి.
Breakfast Hack : పెనం లేకుండానే అదిరిపోయే ఆమ్లెట్.. ఎయిర్ ఫ్రైయర్ మ్యాజిక్ చూడండి.!
తాజావార్తలు
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
-
Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!