మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్, 10,000mAh బ్యాటరీతో Portronics Moji 10 స్పెసిఫికేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Portronics power bank: భారత ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ బ్రాండ్ పోర్ట్రానిక్స్ (Portronics) కొత్తగా Moji 10 పేరుతో 10,000mAh సామర్థ్యంతో కూడిన మాగ్నెటిక్ వైర్‌లెస్ పవర్ బ్యాంక్ ను విడుదల చేసింది. కాంపాక్ట్ డిజైన్‌తో రూపొందిన ఈ డివైస్ రోజువారీ వినియోగం, ప్రయాణ అవసరాలకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేశారు. Moji 10 పవర్ బ్యాంక్ బరువు కేవలం 160 గ్రాములు మాత్రమే.. ఇది జేబులో లేదా చేతిలో ఈజీగా పట్టుకునేలా ఉండటం విశేషం. ట్రావెల్ సమయంలో కూడా సులభంగా తీసుకెళ్లేలా దీన్ని రూపొందించారు.
Read Also: Supreme Court: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ.. తీర్పుపై ఉత్కంఠ
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్:
ఈ పవర్ బ్యాంక్ 15W వరకు మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ సమయంలో డివైస్ సరిగ్గా అలైన్ అయ్యేలా రీఫోర్స్‌డ్ మాగ్నెటిక్ హోల్డ్ అందించారు. దీంతో వైర్‌లెస్ చార్జింగ్‌కు అనుకూలమైన స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్‌ను కేబుల్ అవసరం లేకుండా చార్జ్ చేసుకోవచ్చు.
ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ సౌకర్యం
వైర్‌లెస్‌తో పాటు వైర్డ్ చార్జింగ్ కూడా అందుబాటులోకి కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో ఉన్న USB టైప్-C పోర్ట్ ద్వారా 20W పవర్ డెలివరీ (PD) ఫాస్ట్ చార్జింగ్ అందిస్తుంది. ఈ పోర్ట్ బై-డైరెక్షనల్ కావడంతో పవర్ బ్యాంక్‌ను రీచార్జ్ చేయడానికి, ఇతర డివైసులకు పవర్ ఇవ్వడానికి రెండింటికీ ఉపయోగించొచ్చు.. అదనంగా, ఒక డిటాచబుల్ టైప్-C కేబుల్ కూడా బాక్స్‌లో అందిస్తున్నారు.
Read Also: Varansi: ‘వారణాసి’ కోసం జక్కన్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాంకే..!
LED బ్యాటరీ ఇండికేటర్:
పవర్ బ్యాంక్‌లో మిగిలి ఉన్న బ్యాటరీ లెవల్‌ను చూపేందుకు LED ఇండికేటర్ ని పోర్ట్రానిక్స్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎప్పుడైనా బ్యాటరీ స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు.
స్పెసిఫికేషన్లు:
* బ్యాటరీ సామర్థ్యం: 10,000mAh
* వైర్‌లెస్ చార్జింగ్: 15W వరకు మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్
* మాగ్నెటిక్ హోల్డ్: రీఫోర్స్‌డ్ అలైన్‌మెంట్ సపోర్ట్
* వైర్డ్ చార్జింగ్: 20W USB టైప్-C పవర్ డెలివరీ
* పోర్ట్: బై-డైరెక్షనల్ USB టైప్-C (ఇన్‌పుట్ / అవుట్‌పుట్)
* కేబుల్: డిటాచబుల్ USB టైప్-C కేబుల్
* ఇండికేటర్: LED బ్యాటరీ లెవల్ ఇండికేటర్
* బరువు: 160 గ్రాములు
* రంగులు: వైట్, మోకా
* వారంటీ: 1 సంవత్సరం
ధర:
పోర్ట్రానిక్స్ Moji 10 పవర్ బ్యాంక్ ధర రూ. 1,549గా నిర్ణయించారు. ఇది వైట్, మోకా రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ డివైస్‌ను Portronics అధికారిక వెబ్‌సైట్, Amazon.in, ఇతర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లు, అలాగే అధికారిక రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!