Deputy CM Pawan Kalyan: మనం కర్మకు వదిలేసి వెళ్లిపోతున్నాం.. ఇది మారాల్సిందే.. పవన్ కీలక వ్యాఖ్యలు..
- ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉండాలి ..
- హిందూ దేవుళ్లను అవమానించినా, మన ధర్మాన్ని ఎగతాళి చేసినా..
- మనం లోపలే బాధపడి, కర్మకు వదిలేసి, ముందుకు వెళ్లిపోతున్నాం..
- ఇది మారాల్సిందే-పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉండాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దేవుడిపై భయం, ధర్మంపై గౌరవం ఉన్న సాధారణ హిందూ మనస్తత్వంలోని నిద్రావస్థ నుంచి, సౌకర్య భావన నుంచి మనం బయటకు రావాలి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ, ఎవరు మన హిందూ దేవుళ్లను అవమానించినా, మన ధర్మాన్ని ఎగతాళి చేసినా, మనం లోపలే బాధపడి, కర్మకు వదిలేసి, ముందుకు వెళ్లిపోతున్నాం అన్నారు. అయితే, ఇది మారాల్సిందే అని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్.. కులం, మతం, ప్రాంతం, భాషలతో మనం విభజించబడి ఉన్నా, మన ధర్మం ఒక్కటే.. దేవుళ్లు కూడా ఒక్కటే.. మన ధర్మాన్ని, విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినప్పుడు, మన బాధను గొంతెత్తి చెప్పడం మన బాధ్యత అన్నారు పవన్.. అలాంటి సందర్భాల్లో మౌనం సమిష్టి మనస్సాక్షిని బలహీనపరుస్తుంది అన్నారు..భక్తులుగా మాత్రమే కాకుండా, మన విశ్వాసానికి జాగ్రత్తగా కాపలాదారులుగా కూడా మనం వ్యవహరించాలి అని పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు. అది కేవలం మన ధర్మాన్ని మనమే రక్షించుకోవడమే అంటూ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్..
ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది…!
Also Read
ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ…
— Pawan Kalyan (@PawanKalyan) February 6, 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!