సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీ ప్రపంచంలోని తొలితరం సూపర్ స్టార్స్ శకం ముగిసింది. 

ఎన్టీఆర్, శోభన్ బాబు, ఏఎన్నార్, కృష్ణంరాజు, కృష్ణ అలా అనంతలోకాల్లో ఈ పాటికే కలిసుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. 

 వెండితెరపై వెలుగు వెలిగిన సినీ దిగ్గజం కృష్ణ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో అభిమానలోకం దిగ్భ్రాంతికి గురైంది. 

ఇక తమ అల్లూరి రారని, జేమ్స్‌బాండ్ తిరిగిరారని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో సినిమా లోకంలో తొలిశకం ముగిసింది. 

తెలుగు తెరకు హీరోయిజాన్ని పరిచయం చేసిన స్టార్స్ ఏఎన్నార్, ఎన్టీఆర్. వీరిద్దరి స్ఫూర్తితో నటులుగా మారిన వారెందరో..

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ తర్వాత స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరో సూపర్ స్టార్‌ కృష్ణ.

కృష్ణ అనంతరం శోభన్‌బాబు, కృష్ణంరాజు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో స్టార్స్ అయ్యారు. 

వెండితెరతో వెలుగు వెలిగిన ఎన్టీఆర్‌ సినిమాలతో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్.. 1996 జనవరి 18న గుండెపోటుతో మృతి చెందారు. 

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు రొమాంటిక్ హీరోగా తనదైన ముద్రవేశారు. 2014 జనవరి 22న ఈ లోకాన్ని విడిచారు.

ఫ్యామిలీ చిత్రాలతో పాటు ఆయన అందంతో అమ్మాయిల మనస్సు దోచుకున్న హీరోగా శోభన్‌బాబు నిలిచారు. 2008 మార్చి 20న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 

మాస్‌ అలాగే పవర్‌ఫుల్ రోల్స్‌కు పెట్టింది పేరు రెబల్‌ స్టార్ కృష్ణంరాజు. ఇటీవల 2022 సెప్టెంబర్ 11న కన్నుమూశారు.