Vishnu Vinyasam Review : విష్ణు విన్యాసం రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Sree Vishnu, Nayana Sarika, Satya, Brahmaji, Praveen, Murali Sharma, Srikanth Iyyengar, Satyam Rajesh, Srinivasa Reddy, Goparaju Ramana and others
- DIRECTOR: Yadunaath Maruthi Rao
- MUSIC: Radhan
- PRODUCER: Sumanth Naidu G
శ్రీవిష్ణు హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా రూపొందిన తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. అనూహ్యంగా ఫిబ్రవరి 27వ తేదీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్న ఈ సినిమా, ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. మారుతీ రావు అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమాని, ‘హరోం హర’ నిర్మాతలు నిర్మించారు. మరి, ప్రమోషన్స్‌తో ప్రేక్షకులలోకి వెళ్ళిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
విష్ణు విన్యాసం కథ:
విష్ణు (శ్రీవిష్ణు) ఒంగోలులోని ఒక జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తూ ఉంటాడు. జాతకాలను విపరీతంగా నమ్మే అతను, అదే కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న జున్ను (నయన్ సారిక)తో ముందు గొడవపడి, తర్వాత ప్రేమలో పడతాడు. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆమె జాతకం గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆమెను పెళ్లి చేసుకున్న మొదటి భర్త ఆరు నెలల్లోనే చనిపోతాడని తెలియడంతో, విష్ణు ఆమెను చేసుకునేందుకు వెనుకాడతాడు. కానీ, ఆమె మీద ఉన్న ప్రేమతో మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటాడు. మొత్తం మీద వీరిద్దరి పెళ్లి జరుగుతుంది. మరి ఆమె జాతకంలో ఉన్నట్టు విష్ణు ఆరు నెలలలోపు చనిపోయాడా? అసలు జాతకాలను విపరీతంగా నమ్మే విష్ణు, తాను చనిపోతానని తెలిసి కూడా పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? చివరికి ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
సాధారణంగా శ్రీవిష్ణు సినిమాలు అనగానే అతని మార్క్ ‘వన్ లైనర్స్’ ఆశించి సినిమాకి వెళ్తారు ప్రేక్షకులు. ఈ సినిమాలో కూడా శ్రీవిష్ణు మార్క్ ఏమాత్రం తగ్గలేదు. ట్రెండీ డైలాగ్స్‌తో, మీమ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎక్కడెక్కడ ఎంగేజ్ చేయొచ్చు అనే విషయాన్ని దర్శకుడు గట్టిగా పట్టుకున్నాడు. ముఖ్యంగా శ్రీవిష్ణు మార్కు వన్ లైనర్స్ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్.
నిజానికి జాతకాలను ఆధారంగా చేసుకుని గతంలో ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే, ఈ సినిమాని మాత్రం చాలా పెక్యూలియర్‌గా, అమ్మాయి జాతకానికి ఇబ్బందులు పెట్టి ఆసక్తికరంగా కథ రాసుకున్నాడు దర్శకుడు. అయితే, కథను ఎంత ఆసక్తికరంగా రాసుకున్నాడో, అంత ఆసక్తికరంగా తెరమీదకు తీసుకొచ్చే విషయంలో మాత్రం తడబడ్డాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందే ఈ జాతకం ఎపిసోడ్ రివీల్ చేయడం సెకండ్ హాఫ్ మీద కాస్త అంచనాలు పెంచింది. కానీ, అలా చేయకుండా సెకండ్ హాఫ్‌లోనే పాయింట్ రివీల్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే, జాతకం చుట్టూ కథ రాసుకున్నా సరే, నేటి యువత ఎంగేజ్ అయ్యేలా ఎక్కువగా మీమ్ కంటెంట్‌తో బండి నడిపించాడు దర్శకుడు. ఎన్నో చోట్ల శ్రీవిష్ణు మార్కు వన్ లైనర్స్‌తో కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేశారు. కథపై ఇంకా ఫోకస్ పెట్టి, సెకండ్ హాఫ్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే రిజల్ట్ వేరే లెవల్‌లో ఉండేదని చెప్పక తప్పదు.
నటీనటులు & సాంకేతిక నిపుణులు:
నటీనటుల విషయానికి వస్తే, శ్రీవిష్ణు ఎప్పటిలాగే తనదైన శైలిలో వన్ లైనర్స్‌తో దూసుకుపోయాడు. ఎక్కడా తగ్గకుండా కామెడీ పండించే ప్రయత్నం చేసి, దాదాపుగా సక్సెస్ అయ్యాడు. అయాన్ సారిక, శ్రీవిష్ణు పక్కన చాలా క్యూట్‌గా ఉంది. ఆమె కూడా తనదైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక గోపరాజు రమణ, మురళీ శర్మ, సత్య వంటి వాళ్ళు తమ పాత్రలకు పూర్తిస్థాయి న్యాయం చేశారు. మిగతా పాత్రధారులు పరిధి మేరకు నటించారు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, రధన్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు, టైటిల్ సాంగ్ ఒక్కటే క్యాచీగా ఉంది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్‌గా ఉండి, సినిమా మూడ్‌ను క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. సినిమా నిడివి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ వర్డిక్ట్: ‘విష్ణు విన్యాసం’ – శ్రీవిష్ణు మార్క్ వన్ లైనర్స్‌తో సాగే ఒక కామెడీ ఫీస్ట్!
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!