Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Tollywood Producers Crisis Dil Rajus Shocking Comments On Producer Struggles And Industry Reality

Tollywood Excusive: సినిమా హిట్ అయితే హీరో హీరోయిన్లకు నేము, ఫేము.. మరి ప్లాప్ అయితే!

Published Date :February 23, 2026 , 5:49 pm
By Kothuru Ram Kumar
Tollywood Excusive: సినిమా హిట్ అయితే హీరో హీరోయిన్లకు నేము, ఫేము.. మరి ప్లాప్ అయితే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tollywood Excusive: సినిమా రంగుల ప్రపంచం. ఓ సినిమా హిట్ అయితే హీరో హీరోయిన్లకు నేము, ఫేము. అదే సినిమా రిజల్ట్ తేడా కొడితే నిర్మాత మాత్రమే నిండా మునిగిపోతాడు. కోట్లు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్ ఆఖరికి నష్టాల్లో కూరుకుపోతాడు. అసలు ఇండస్ట్రీలో నిర్మాతల పరిస్థితి ఏంటి? ప్రొడ్యూసర్స్ పై దిల్ రాజు కామెంట్లు ఎందుకు ఇంత హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో నిర్మాతకు విలువ లేదా? శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి పడిపోతున్నాడా? ప్రొడ్యూసర్ ఎందుకు జీరో అయిపోయాడు? హీరోల డేట్లకు మాత్రమే నిర్మాత పరిమితమైపోయాడా? ప్రొడ్యూసర్స్ బిర్యానీ ప్యాకెట్లు మోసేవాళ్ళుగా మిగిలిపోయారా? సెట్లోకి అడుగుపెట్టే ధైర్యం కూడా చేయలేకపోతున్నారా?

100 మంది ప్రొడ్యూసర్స్ లో అసలు బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది దిల్ రాజు చేసిన కామెంట్స్ దేనికి సంకేతం. కొన్ని సందర్భాల్లో నిర్మాతల్ని ప్రీ రిలీజ్ లాంటి సినిమా ఫంక్షన్ లో కనీసం స్టేజ్ మీదకి కూడా రానివ్వడం లేదు. డైరెక్టర్ 90 రోజుల షూటింగ్ అని మొదలుపెట్టి ఏకంగా సంవత్సరం పాటు సాగతీస్తాడు. షూటింగ్ మొదలయ్యాక హీరో టిఫిన్ ఖర్చులు, ఫారిన్ టూర్లు, చివరికి ఫ్యామిలీ ఖర్చులు కూడా నిర్మాతలే భరించాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల సినిమా బడ్జెట్ తడిసి మోపిడవుతుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే వడ్డీలు, ఫైనాన్షియల్ వేదింపులు, మరీ దారుణమైపోతున్నాయి.

Quick Sooji Chilla Recipe: కేవలం 10 నిమిషాల్లో టేస్టీ, హెల్దీ బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ

అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో సినిమా ఫలితం కొంచెం అటు ఇటు అయితే.. ఆ భారం మొత్తం నిర్మాతలే మోయాల్సి వస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మూవీ బోల్తా కొడితే నిర్మాతలు పట్టించుకునే దిక్కు కూడా ఉండదు. పెద్ద హీరోలు అయితే సినిమా నిర్మాణంలో తమ పుత్రులు పుత్రికా రత్నాలకు వాటాలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సిచువేషన్ లో అసలు ఎందుకు సినిమాలు నిర్మిస్తున్నారో తెలియని పరిస్థితి. ఇండస్ట్రీలో 100 మంది నిర్మాతలు ఉంటే అందులో బాగుపడ్డవారు ఐదారుగురే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇది వరకు నాగిరెడ్డి, చక్రపాణి, రామానాయుడు, కేఎస్ రామారావు లాంటి నిర్మాతలు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు సినీ పరిశ్రమలో ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా దొరకరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆఖరికి బిర్యానీ ప్యాకెట్లను మోసే వాళ్ళుగా నిర్మాతలు మిగిలిపోతున్నారనే ఆవేదన ఉంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణలు లైట్ బాయ్స్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళను దేవుళ్లుగా భావించేవారు.

ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రముఖ సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కూర్గ్ లో నిర్మించిన రిసార్ట్స్ ను ప్రారంభించేందుకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తర్లి వెళ్ళారు. వాళ్ళలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నారు. ఈ సందర్భంలోనే దిల్ రాజు నిర్మాతలకు విలువ లేదంటూ చేదు నిజాన్ని చెప్పుకొచ్చారు.

Last Words Before D*eath: ప్రాణాలు విడిచే ముందు ప్రజలు చెప్పే చివరి మాటలు ఇవే..!

నిజానికి దిల్ రాజు నిన్న, మొన్న వచ్చిన ప్రొడ్యూసర్ ఏం కాదు. చాలా కింది నుంచి వచ్చి సక్సెస్ఫుల్ అయిన నిర్మాత. అలాంటి వ్యక్తి కూడా ఇండస్ట్రీలో తమకు విలువ లేదు అనడం ఇప్పుడు బిగ్ డిబేటబుల్ పాయింట్ గా మారింది. పరిశ్రమలో స్టార్లు డైరెక్టర్లకు భయపడే రోజులు వచ్చాయి అంటున్నారు. వందల కోట్లు పెడుతున్న పుచ్చుకునే వాళ్ళదే పైచే అంటున్నారు రాజు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏన్ఆర్ లాంటి అగ్రనటులు కొన్ని సందర్భాల్లో కింద కూర్చుంటే కొందరు ప్రొడ్యూసర్లు వాళ్ళ ముందే కుర్చీల్లో దర్జాగా కూర్చునేవాళ్ళు.

అప్పట్లో నిర్మాతలకు అంతటి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సినిమా పరిశ్రమలో స్నేహం, ప్రేమ, అభిమానం, బంధుత్వం ఎక్కువ రోజులు నిలవవు అని అందరూ అంటూ ఉంటారు. కొంతమంది పెదవి చివర ఇవి ఉంటే మరి కొందరికి అసలు ఆ పట్టింపే ఉండదు అని చెబుతుంటారు. అందుకనేమో అప్పుడప్పుడు మన సినిమా జనాలు ఇండస్ట్రీ అసలు రంగు ఇది అంటూ తమ పాత స్నేహాలు, ప్రేమలు, అభిమానాలు, బంధుత్వాలు వదిలేసి మాట్లాడుతూంటారు. ఆ క్రమంలో బయటకవచ్చే మనసులో మాట చాలా హార్ష్ గా ఉంటుంది. ఇచ్చేవాడి చేయి పైన తీసుకునే వాడి చేయి కింద ఉండడం సహజమే.

కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇచ్చేవారి చేయి కంటే పుచ్చుకునే వారి చేయి పై చేయి అంటున్నారు దిల్ రాజు. ఒకప్పుడు నిర్మాతలు అందరినీ శాసించే వాళ్ళని.. కానీ ఇప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్లే ఇచ్చిన వాళ్ళను శాసించే స్టేజ్ కి వచ్చేసామని ఆవేదన వ్యక్తం చేశారు. సింపుల్ గా చెప్పిన ఆయన మాటల్లో నిగూడార్థం ఉందంటున్నారు సినీ పండితులు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య రేస్ నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు కామెంట్లపై ఇండస్ట్రీలో డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. వినడానికి కాస్త చేదుగా ఉన్నా ఆయన ఉన్న మాటే అన్నారని అంటున్నారు సినీ పరిశీలకులు.

WhatsAppలో కొత్త ఫీచర్.. గ్రూప్‌లో చేరిన వెంటనే “గ్రూప్ మెసేజ్ హిస్టరీ”!

పాన్ ఇండియా బడ్జెట్లో ప్రొడ్యూసర్స్ ఎలా నలిగిపోతున్నారు? అప్పులు అధిక వడ్డీలు ఎలా కొంగదీస్తున్నాయి? నిర్మాత మాత్రమే సినిమా నష్టాలు ఎందుకు తన భుజాలపై మొయాల్సి వస్తుంది. టాలీవుడ్ లో నిర్మాతలు ఇప్పుడు స్టార్ నటులు పెద్ద దర్శకులకు భయపడే రోజులు వచ్చాయి. వందల కోట్లు పెట్టుబడి పెడుతున్న ఎంత అగ్ర నిర్మాత అయినా సరే నటులు సాంకేతిక నిపుణల మాటను జవదాటలేని పరిస్థితి వచ్చింది. పాన్ ఇండియా మార్కెట్ లో నిర్మాతలు నలిగిపోతున్నారు. డబ్బులు పెద్ద మొత్తంలో ఖర్చువుతున్న అనుకున్న సమయానికి సినిమా పూర్తఅవ్వడం లేదు. విడుదల కూడా కావడం లేదు. ఇక ఇండస్ట్రీలో అందరూ లాభాలు ఆశిస్తారు. కానీ నష్టాలను మోసేది మాత్రం నిర్మాత ఒక్కడే.

తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిన దిల్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఒక ఆసక్తికర ఘటనను పంచుకున్నారు. తాను నిర్మాతగా మారిన మొదట్లో అట్లూరి పూర్ణచంద్రరావుకు ఒక మాట ఇచ్చానున్నారు. దిల్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటే ఆ సినిమా రైట్స్ ఆయనకు ఉచితంగా ఇస్తానని చెప్పానన్నారు. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద మార్కెట్ ఉన్న బాలీవుడ్ కంటే ఎక్కువ సినిమాలు తీస్తున్న టాలీవుడ్ నిర్మాతలకు కష్ట నష్టాలు తప్పడం లేదు. డిజిటల్ యుగంలో ఒక హీరో మార్కెట్ విలువను థియేటర్ల కంటే ఎక్కువగా ఓటిటి సంస్థలే నిర్ణయిస్తున్నాయి.

ఈ క్రమంలో ఓ వింత పరిస్థితి నెలకుంది. ఒకే స్టార్ నటుడు నటించిన రెండు సినిమాలకు ఓటిటి సంస్థలు ఇచ్చే రేట్లు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడాతో ఉంటున్నాయి. దీనివల్ల నిర్మాతలు నిలువున మునిగిపోతుంటే హీరోలు మాత్రం తమ రెమ్యునిరేషన్ తగ్గించే ప్రసక్తి లేదని భీష్మించుకొని కూర్చుంటున్నారు. అసలు ఓటిటి సంస్థలు చేస్తున్న ఈ పార్షియాలిటీ వెనుక ఉన్న రహస్యం ఏంటి? గతంలో సినిమా విడుదల తేదీలను నిర్మాతలు నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు ఓటిటి సంస్థలు తమ స్ట్రీమింగ్ డేట్స్ ప్రకారం థియేటర్ రిలీజ్ డేట్లను కూడా శాసిస్తున్నాయి. ఇప్పుడు కేవలం తేదీలే కాదు హీరోల రెమునరేషన్లు కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లే డిసైడ్ చేస్తున్నాయనే కొత్త పాయింట్ తెరపైకి వచ్చింది. ఒక హీరో సినిమాకు ఓటిటి నుండి వచ్చే డీల్ విలువను బట్టే ఆ హీరో తన తర్వాత సినిమా పారితోషకాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు.

T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!

ఈ డిజిటల్ డీల్స్ గందరగోళం వల్ల టాలీవుడ్ లో ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి నలుకుంది. కంటెంట్ ను నమ్మి సినిమా తీసే నిర్మాతలకు ఓటిటీల నుండి సరైన మద్దతు లభించకపోవడం ఇండస్ట్రీ భవిష్యత్తుకు ఆందోళన కలిగించే విషయం. హీరోలు కూడా కేవలం పారితోషకం మీద కాకుండా సినిమా నిర్మాణ వ్యయం ఓటిటి బిజినెస్ మీద అవగాహన పెంచుకుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. తెలుగు చలనచిత్ర సీమకు దక్షిణాదిన భారీ మార్కెట్ ఉంది. పైగా ఇండియాలో ఎక్కువ సినిమాలు తీస్తుంది మనమే. భారీ బడ్జెట్ సినిమాలు తక్కువేమి కాదు కానీ ఇరుగు పొరుగు చిత్రసీమల్లో లేని విధంగా మనకు మాత్రం భారీ నష్టాలు తప్పడం లేదు. ఇందులో తప్పుఎవరిది ఎవరు దీనికి కారణం టాలీవుడ్ కు ఎందుకు అన్ని కష్టాలు వచ్చాయి.

తెలుగు సినీ పరిశ్రమకు సౌత్ ఇండియాలో అతి పెద్ద మార్కెట్ ఉంది. తమిళ, కన్నడ ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్ కెపాసిటీ చాలా ఎక్కువ. ఇక సినిమాల సంఖ్యలో బాలీవుడ్ నే మించిపోతుంది. భారీ బడ్జెట్ సినిమాలు తక్కువేమీ కాదు. తెలుగు సినిమాకు ఇంత సీన్ ఉన్నా మన నిర్మాతలకు మాత్రం నష్టాలు తప్పడం లేదు. పొరుగునే ఉన్న కోలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కొత్తవాళ్ళతోనూ ఎన్నో సినిమాలు తీస్తుంటారు. కానీ అక్కడ నిర్మాతలకు వచ్చే నష్టాల శాతం చాలా తక్కువ. సినిమా నిర్మాణంలో ఖచ్చితమైన రూల్స్ పాటించడం వల్లే తమిళ నిర్మాతలు లాభాలు సాధించగలుగుతున్నారు.

Story Board : ఉచితాలపై పార్టీలు ఎందుకు మోజు పడుతున్నాయి..?

కానీ తెలుగు సినిమాల బడ్జెట్ కంట్రోల్ లో ఉండడం లేదు. దీనికి ముఖ్య కారణం చుక్కల్ని తాకుతున్న హీరో హీరోయిన్ల రెమునరేషన్లు. నిర్మాతలు ఒకరితో ఒకరు పోటీ పడి రెమునరేషన్లు పెంచేయడం అసలుకే ఎసరు తెచ్చిపెడుతుంది. సినిమా బడ్జెట్ పెంచే మరో ముఖ్య కారణం అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ కాకపోవడం అవసరం ఉన్నా లేకపోయినా భారీ వ్యయంతో సెట్లు వేయడం ఇలాంటి వాటితో సినిమా పూర్తయ్యేసరికి ఖర్చు పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు నిర్మాతలు బడ్జెట్ కంట్రోల్ పై సీరియస్ గా దృష్టి పెట్టారు. నిజానికి తెలుగు సినిమాలపై లాభాలు తక్కువేనని ఇండస్ట్రీ టాక్ సినిమా బంపర్ హిట్ అయితేనే నిర్మాతలకు చెప్పుకోదగిన స్థాయిలో లాభాలు వస్తున్నాయి. మిగిలిన వాళ్ళకి మాత్రం సినిమా కష్టాలు మిగులుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయట పడడానికి బడ్జెట్ విషయంలో కఠినంగా ఉండాలని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • actor remuneration Tollywood
  • Dil Raju comments producers
  • film budget issues India
  • OTT impact on Telugu cinema
  • Pan India movie budgets

తాజావార్తలు

  • Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

  • LPG Crisis: భారత్‌కు గుడ్‌ న్యూస్.. హార్ముజ్ నుంచి బయలుదేరిన LPG నౌకలు..

  • Mother Daughter Suicide: పెళ్లి ఇంట్లో చావు కేకలు! వరుడి నిందలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆమె తల్లి బలి..

  • Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!

  • Robbery: యశోద ఆసుపత్రిలో బంగారు ఆభరణాలు చోరీ.. కిలేడీ చేసిన పనికి అంతా షాక్..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions