360° స్పేషల్ ఆడియో, బోస్ సౌండ్ టెక్నాలజీతో ప్రీమియం ఆడియో అనుభవం.. Noise Master Buds 2 లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noise Master Buds 2: భారతీయ ఆడియో బ్రాండ్ నాయిస్ (Noise) తన మాస్టర్ సిరీస్‌లో భాగంగా కొత్తగా నాయిస్ మాస్టర్ బడ్స్ 2ను భారత మార్కెట్లో తీసుకవస్తుంది. ఈ ఇయర్ బడ్స్ ను ముందుగా CES 2026 లో ప్రదర్శించగా.. ఇప్పుడు అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించింది. ఇవి గతంలో వచ్చిన మాస్టర్ బడ్స్‌కు సక్సెసర్‌గా వస్తున్నాయి.
నాయిస్ మాస్టర్ బడ్స్ 2లో “Sound by Bose” టెక్నాలజీని అందించారు. దీని వల్ల మంచి బాస్, స్పష్టమైన మిడ్స్, క్లియర్ హైస్‌తో సమతుల్యమైన ఆడియో అవుట్‌పుట్ లభిస్తుంది. మ్యూజిక్ వినడం, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ వంటి వినియోగాలకు ఇవి అనుకూలంగా రూపొందించబడ్డాయి. ఈ డివైస్‌లో రీడిజైన్ చేసిన ఇంటర్నల్ క్యావిటీ స్ట్రక్చర్‌తో కూడిన అప్‌డేటెడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సిస్టమ్ అందించారు. ఇది బయటి శబ్దాన్ని సమర్థంగా తగ్గిస్తూ, అన్ని వాతావరణాల్లోనూ స్పష్టమైన సౌండ్‌ను అందిస్తుంది.
Also Read
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
Pakistan Afghanistan War: “సూసైడ్ స్వ్కాడ్” సిద్ధం చేసిన తాలిబాన్లు.. పాకిస్తాన్‌కు మూడినట్లే..
Noise Master Buds 2 ప్రధాన ఫీచర్లు:
* 360° స్పేషల్ ఆడియోతో ఇంటెలిజెంట్ హెడ్ ట్రాకింగ్.
* 6 మైక్రోఫోన్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సిస్టమ్.
* సౌండ్+ అల్గారిథమ్ ఆధారిత క్లియర్ కాల్ సపోర్ట్.
* “నాయిస్ ఆడియో” యాప్ ద్వారా AI వాయిస్ చాట్ అసిస్టెంట్.
* 6-యాక్సిస్ IMU సెన్సార్‌తో హెడ్ జెష్చర్ కంట్రోల్స్.
ఇవి మెటాలిక్ ఫినిష్, బ్రష్డ్ మెటల్ డిజైన్‌తో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటాయి. లైట్ వెయిట్, ఎర్గోనామిక్ డిజైన్ వల్ల ఇవి ఎక్కువసేపు ధరించినా సౌకర్యంగా ఉంటుంది. ఇందులో IPX5 వాటర్ రెసిస్టెన్స్, ఆడియో & కనెక్టివిటీ విషయంలో 10 మి.మీ డ్రైవర్, బ్లూటూత్ v6.1, 10 మీటర్ల రేంజ్, డ్యుయల్ డివైస్ పెయిరింగ్ సపోర్ట్, 30 గంటల వరకు ప్లేటైమ్, 10 నిమిషాల చార్జ్‌తో 6 గంటల వినియోగం ఉన్నాయి. ఇంకా ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, టచ్ కంట్రోల్స్, ఈక్వలైజర్ సపోర్ట్, ఫైండ్ మై డివైస్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ లభిస్తాయి.
నాయిస్ మాస్టర్ బడ్స్ 2 మార్చి 19న మధ్యాహ్నం 12 గంటలకు కార్బన్, ఔరమ్, మెర్క్యురీ కలర్ ఆప్షన్లలో లాంచ్ కానున్నాయి. వినియోగదారులు రూ. 999 చెల్లించి ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ ఆఫర్లలో భాగంగా రూ. 1,999 ఇన్‌స్టంట్ కూపన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులతో అదనంగా రూ. 600 డిస్కౌంట్ అన్ని ఆఫర్లు వర్తించిన తరువాత ధర రూ. 6,399 గా ఉంటుంది. డెలివరీ అనంతరం కూడా కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి. ఇవి gonoise.com, ఇతర రిటైల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!