Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Israel Iran War Live Updates Airstrikes 36 Students Dead

Israel – Iran War Live Updates : కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..

Published Date :March 2, 2026 , 11:37 am
By Chandra Shekhar Pamena
  • అమెరికా వార్నింగ్‌కు ఇరాన్ కౌంటర్
  • ఖమేనీ చూపిన బాటలోనే నడుస్తామన్న ఇరాన్
  • అమెరికా, ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ స్పీకర్
  • అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ విధ్వంసకర దాడులు
Israel – Iran War Live Updates : కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Israel – Iran War Live Updates : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకి క్రమంగా పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌లోని పలు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీగా దాడులు చేసింది. దీంతో ప్రతీకార చర్యలకు దిగింది టెహ్రాన్. తాజాగా పలు గల్భ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేస్తుంది.. ఈ యుద్ధానికి సంబంధించిన మరింత సమాచారం కోసం చూస్తునే ఉండిండి ఎన్టీవీ లైవ్ అప్డేట్స్…

The liveblog has ended.
  • 02 Mar 2026 03:13 PM (IST)

      ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు..

      ఇరాన్‌లోని నంతాజ్ అణు కేంద్రంపై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు.. అణు కేంద్రంలో లీక్ అవుతున్న రేడియేషన్.. రేడియేషన్ లీకేజీ కొనసాగితే ఇరాన్‌లోని చాలా నగరాలను ఖాళీ చేయించకతప్పదన్న IAEA.. కొన్నాళ్లుగా న్యూక్లియర్ ఆయుధాల తయారీలో బిజీగా ఉన్న ఇరాన్..

  • 02 Mar 2026 03:08 PM (IST)

    ఇరాన్ గాంధీ ఆసుపత్రి దాడిపై WHO రియాక్షన్..

    ఇజ్రాయెల్ దాడుల్లో గాంధీ ఆస్పత్రి ధ్వంసమైంది.. ఇరాన్ అధికారులు పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. గాంధీ ఆస్పత్రి దాడిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదానోమ్ ఘెబ్రేయెసస్ స్పందించారు.. ఆస్పత్రుల్లో దాడులు ఆందోళనకరమని డైరెక్టర్‌ తెలిపారు.. మరో మూడు ఇతర హాస్పిటల్స్‌పై ఇజ్రాయెల్ ఎటాక్ చేసింది.. గతంలోనూ టెహ్రాన్ లోని గాంధీ ఆస్పత్రిపైనా దాడి జరిపినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. “తహ్రాన్‌లో గాంధీ హాస్పిటల్ పై బంబింగ్ వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనను నిర్ధారించేందుకు WHO కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ వార్తలు మనకు ఒక గుర్తింపుగా ఉండాలి.. కొనసాగుతున్న ఘర్షణలో ఆరోగ్య సౌకర్యాలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి.” అని పోస్ట్‌లో పేర్కొన్నారు. అవుపాత్రి, అంతర్జాతీయ మానవత్వ చట్టం ప్రకారం.. వైద్య సౌకర్యాలు రక్షణలో ఉండాలని తెలిపారు.

  • 02 Mar 2026 03:00 PM (IST)

    జెరూసలేంపైనా ఇరాన్‌ తాజా దాడులు..

    జెరూసలేంపైనా ఇరాన్‌ తాజా దాడులు.. దుబాయి, అబుదాబీ సిటీలపైనా ఆగని ఇరాన్‌ దాడులు.. దుబాయి - ఇరాన్‌ మధ్య ఉన్న హార్మోజ్‌ జలసంధి ద్వారా క్రూడాయిల్‌ రవాణా నౌకలు వెళ్లకుండా ఆపేసిన ఇరాన్‌

  • 02 Mar 2026 01:58 PM (IST)

    గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయులు..

    8 UAE దేశాల్లో సుమారు కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు.. ఎప్పుడేం జరుగుతుందనే భయంలో ప్రవాస భారతీయులు.. ఖతార్, దుబాయ్, కువైట్, అబుదాబిలో క్షణ క్షణం భయం.. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వేల మంది ప్రయాణికులు..

  • 02 Mar 2026 01:36 PM (IST)

    ఆదాయ మూలాలను టార్గెట్ చేసిన ఇరాన్..

    గల్ఫ్ ఆదాయ మూలాలను టార్గెట్ చేసిన ఇరాన్.. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం..

  • 02 Mar 2026 01:36 PM (IST)

    వ్యూహం మార్చిన ఇరాన్..

    వ్యూహం మార్చిన ఇరాన్.. ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్.. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్ లో ఉన్న ఇరానేతరుల నివాసాలే టార్గెట్ గా ఇరాన్ దాడి.. హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి వెళ్లిపోతున్న జనం..

  • 02 Mar 2026 12:42 PM (IST)

    తెలంగాణ పౌరుల కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:

    గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులకు ఢిల్లీలో కంట్రోల్ రూమ్.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కంట్రలో రూమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

    కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
    +91 9871999044,
    +91 9958322143,
    9910014749,
    +91 9643723157,

    UAE:
    80046342,+971543090571

    Oman:
    80071234,+96898292270

    Bahrain:
    0097339418071

    Iran:
    +98 9128109115,+98 9128109109

    Israel:
    +972 547520711

    Saudi:
    00966 114884697,00966542126748

    Kuwait:
    +96565501946

    Qatar:
    0097455647502

    Jordan:
    00962 770422276

    Egypt:
    +201211299905

  • 02 Mar 2026 12:16 PM (IST)

    మిసైల్స్ వర్షం..

    గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు.. ఖతార్ రాజధాని దోహా, కువైట్, బెహ్రయిన్, అబుదాబిలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మిసైల్స్ వర్షం.. యూఎస్ ఎంబసీలే లక్ష్యంగా ఎటాక్స్.. ఎర్బిల్ టు మనామా, దుబాయ్ టు టెల్ అవీవ్ లపై దాడులు.. ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4 పేరుతో రెండో రోజు దాడులు.. వందలాది డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్ దాడులు..

  • 02 Mar 2026 12:11 PM (IST)

    హిజ్బుల్లా- ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు

    సెంట్రల్ టెహరాన్‌లో శనివారం ఉన్నతాధికారులతో ఖమేనీ మీటింగ్ పెడుతున్నాడని, కొన్ని గంటల ముందే తెలుసుకున్న ఇజ్రాయెల్, అమెరికా.. ఇరాన్‌తో పాటు దాడులు ప్రారంభించిన హిజ్బుల్లా.. లెబనాన్‌లో హిజ్బుల్లా- ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మొదలు..

  • 02 Mar 2026 12:05 PM (IST)

    జెరూసలెంలో మోగుతున్న సైరన్లు..

    జెరూసలెంలో మోగుతున్న సైరన్లు.. ఖమేనీ బాటలోనే వెళ్తామంటున్న ఇరాన్.. గల్ఫ్ లోని అమెరికా మిత్రపక్ష దేశాలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం.. ఖమేనీపై గత నెలలుగా గురి పెట్టిన అమెరికా, ఇజ్రాయెల్.. సెంట్రల్ టెహరాన్ లో శనివారం ఉన్నతాధికారులతో.. మీటింగ్ పెడుతున్నాడని కొన్ని గంటల ముందే తెల్సుకున్న ఇజ్రాయెల్, అమెరికా.. ఇరాన్ తో పాటు దాడులు ప్రారంభించిన హిజ్బుల్లా.. లెబనాన్ లో హిజ్బుల్లా- ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మొదలు..

  • 02 Mar 2026 11:27 AM (IST)

    కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..

    కువైట్ లో కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్.. కుప్పకూలిన ఎఫ్-15 స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ పైలెట్.. పొరపాటున ఇజ్రాయెల్ కూల్చినట్లు అనుమానం.. తామే కూల్చామని ప్రకటించుకున్న ఇరాన్..

  • 02 Mar 2026 11:25 AM (IST)

    అమెరికా- ఇరాన్ దాడులతో కేంద్రం అలర్ట్

    ఇజ్రాయెల్, అమెరికా- ఇరాన్ దాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ.. రాష్ట్రాల పోలీస్ శాఖలకు ఇంటెలిజెన్స్ అలర్ట్.. రాష్ట్రాలకు అప్రమత్తం చేసిన కేంద్రం.. ఉద్రిక్తతలు పెంచే ప్రసంగాలపై నిఘా పెట్టాలని ఆదేశం.. సోషల్ మీడియా విద్వేష ప్రచారాలపై నిఘా పెట్టాలన్న కేంద్రం.. ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..

  • 02 Mar 2026 11:18 AM (IST)

    ఇజ్రాయెల్, జెరుసలెంపై ఇరాన్ దాడి..

    ఇజ్రాయెల్, జెరుసలెంపై ఇరాన్ దాడి.. ఇరాన్ దాడిలో దెబ్బ తిన్న భవనం.. 20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.. బేత్ పమేష్ పట్టణంపైనా ఇరాన్ దాడి.. 9 మంది మృతి, పలువురికి గాయాలు.. ఇజ్రాయెల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఆయుధ తయారీ కేంద్రంగా దాడి..

  • 02 Mar 2026 11:07 AM (IST)

    తీవ్రవాదులే లక్ష్యంగా ఎటాక్..

    సౌత్ లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదులే లక్ష్యంగా ఎటాక్.. 2024లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. ఖమేనీ మృతి తర్వాత మళ్లీ మొదలైన దాడులు..

  • 02 Mar 2026 10:59 AM (IST)

    యుద్ధంలోకి లెబనాన్..

    ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి లెబనాన్.. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై హిజ్జుల్లా గ్రూప్ దాడి.. నార్త్ ఇజ్రాయెల్లోని హైఫా టార్గెట్గా హిజ్బుల్లా తీవ్రవాదుల ఎటాక్.. ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడి..

  • 02 Mar 2026 10:52 AM (IST)

    ట్రంప్ భ్రమలో ఉన్నాడు..

    ట్రంప్ భ్రమల్లో, ఊహా లోకంలో ఉంటారు.. అమెరికాతో చర్చించాలని అనుకోవడం లేదు.. ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఉదయం ప్రకటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి..

  • 02 Mar 2026 10:37 AM (IST)

    ఇరాన్ యూటర్న్..

    అమెరికాతో చర్చలపై ఇరాన్ యూటర్న్.. విదేశాంగ మంత్రి ప్రకటనపై ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ యూటర్న్.. అమెరికాతో చర్చల్లేవ్.. దౌత్య పరమైన వ్యవహారాల్లో అమెరికాది చెత్త రికార్డు..

  • 02 Mar 2026 09:53 AM (IST)

    ట్రంప్ కి ఇరాన్ వార్నింగ్..

    ట్రంప్ వార్నింగ్కు ఇరాన్ విదేశాంగ మంత్రి కౌంటర్.. మా దేశాన్ని కాపాడుకునేందుకు లిమిట్స్ లేవు.. మిమ్మల్ని రక్షించుకునే హక్కు మాకు ఉంది.. మాకు హక్కు లేదని చెప్పే అధికారం ఎవరికీ లేదు.. ఇరాన్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం.. అమెరికాది దాడి.. మాది రక్షణ: ఇరాన్ విదేశాంగ మంత్రి

  • 02 Mar 2026 09:40 AM (IST)

    ఇరాన్ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయి..

    9 ఇరాన్ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయి.. ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ ను ధ్వంసం చేశాం.. మిగిలిన నౌకల వేట కూడా కొనసాగుతుంది.. ఇరాన్ నౌక దళం మొత్తం నాశనం అయింది.. ఇరాన్ మాతో చర్చలు కోరుకుంటుంది: ట్రంప్

  • 02 Mar 2026 09:34 AM (IST)

    అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ దాడి..

    UAEలోని అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ దాడి.. ఇరాన్ దాడిలో భారీగా దెబ్బతిన్న UAE డేటా సెంటర్.. కువైట్ పై 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడి చేసిన ఇరాన్..

  • 02 Mar 2026 09:32 AM (IST)

    యూఎస్ స్థావరాలపై ఇరాన్ దాడులు..

    పశ్చిమాసియాలోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ దాడులు.. 390 క్షిపణులతో, 830 డ్రోన్లతో దాడులు చేసిన ఇరాన్.. UAEపై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్.. UAEపై 541 డ్రోన్లు, 165 క్షిపణులతో ఇరాన్ దాడులు.. 506 డ్రోన్లు, 152 క్షిపణులను కూల్చేశామన్న UAE..

  • 01 Mar 2026 11:15 PM (IST)

    అంతా మంచే జరుగుతుంది.. ఆందోళన వద్దు -ట్రంప్‌

    యూఎస్‌ దాడిలో 48 మంది ఇరాన్‌ నేతలు మృతి చెందారు. చమురు ధరలపై ఆందోళన చెందొద్దు. అంతా మంచే జరుగుతుంది.. ఆందోళన వద్దు. ప్రస్తుతం ఏది సరైనదో అదే చేస్తున్నా. -ట్రంప్‌

  • 01 Mar 2026 10:48 PM (IST)

    ఖమేనీ మృతిపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన

    ఖమేనీ మృతిపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని అంతం చేశాం. మా దాడిలో ఖమేనీతో పాటు డజన్ల మంది ఇరాన్‌ నేతలు మృతి. -నెతన్యాహు

  • 01 Mar 2026 09:30 PM (IST)

    యూఎస్‌ దాడిలో 48 మంది ఇరానియన్‌ నేతలు మృతి చెందారు. -ట్రంప్‌

    యూఎస్‌ దాడిలో 48 మంది ఇరానియన్‌ నేతలు మృతి చెందారు. -ట్రంప్‌

  • 01 Mar 2026 09:07 PM (IST)

    ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు మహమూద్‌ అహ్మదీనేజాద్‌ మృతి

    ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు మహమూద్‌ అహ్మదీనేజాద్‌ మృతి. అమెరికా-ఇజ్రాయెల్‌ జరిపిన క్షిపణి దాడుల్లో అహ్మదీనేజాద్‌ మృతి.

  • 01 Mar 2026 07:23 PM (IST)

    దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు

    దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌. రఫాలోని హమద్‌ టౌన్‌లో ఇరాన్‌ డ్రోన్ల దాడి. ఇరాన్‌ దాడులతో తెలుగు కుటుంబాల ఆందోళన. దుబాయి గ్లోబల్‌ విలేజ్‌ మూసివేసిన ప్రభుత్వం.

  • 01 Mar 2026 06:15 PM (IST)

    గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలుగువారికి సీఎం రేవంత్‌ సూచన

    గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలుగువారికి సీఎం రేవంత్‌ సూచన. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరిన సీఎం రేవంత్‌. ఇండియన్‌ ఎంబసీల సూచనలు, ఆదేశాలను పాటించాలి. తెలంగాణ వాసుల పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం. సురక్షితంగా ఇక్కడకు రప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. -సీఎం రేవంత్‌

  • 01 Mar 2026 06:09 PM (IST)

    ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్స్‌లో 225 విమానాలు రద్దు

    ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్స్‌లో 225 విమానాలు రద్దు. మధ్య ఆసియాలో పరిస్థితులతో విమాన సర్వీసులు నిలిపివేత.

  • 01 Mar 2026 05:29 PM (IST)

    ఇరాన్‌పై దాడులకు ఖండించిన చైనా, రష్యా

    ఇరాన్‌పై దాడులకు ఖండించిన చైనా, రష్యా. చర్చలు కొనసాగుతున్నప్పుడు దాడులు చేయడం కరెక్ట్‌ కాదు. చర్చలకు తిరిగి రావాలని కోరుతున్నాం. ఇరాన్‌లో పాలనను మార్చాలనుకోవడం సరైనది కాదు. దాడులను వెంటనే ఆపాలి. -చైనా

  • 01 Mar 2026 05:13 PM (IST)

    సైప్రస్‌పై ఇరాన్‌ మిసైళ్ల దాడి

    సైప్రస్‌పై ఇరాన్‌ మిసైళ్ల దాడి. సైప్రస్‌లోని యూకే స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ దాడులు. ఇరాన్‌ మిస్సైల్‌ ప్రయోగాన్ని ధృవీకరించిన యూకే. ఇరాన్‌ 2 మిస్సైల్స్‌ను సైప్రస్‌ మీద ప్రయోగించింది. బహ్రెయిన్‌లోని మా స్థావరాలపై ఇరాన్‌ దాడి చేసింది. -యూకే

  • 01 Mar 2026 04:24 PM (IST)

    రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంతాపం

    ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంతాపం.

  • 01 Mar 2026 04:06 PM (IST)

    ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 100కు పైగా విమానాలు రద్దు.

    ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 100కు పైగా విమానాలు రద్దు. ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 60, ఢిల్లీకి రావాల్సిన 40 విమానాలు రద్దు. మధ్య ఆసియాలో పరిస్థితులతో విమాన సర్వీసులు నిలిపివేత.

  • 01 Mar 2026 03:25 PM (IST)

    ఒమన్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌లపై ఇరాన్‌ దాడులు

    ఒమన్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌లపై ఇరాన్‌ దాడులు. ఇరాన్‌ దాడి సమయంలో ఆయిల్‌ ట్యాంకర్‌లో ఉన్న ఇండియన్స్‌. ఇరాన్‌ దాడిలో నలుగురికి తీవ్రగాయాలు. హర్‌మూజ్‌ జలసంధిలో ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి.

  • 01 Mar 2026 03:06 PM (IST)

    ఇరాన్‌కి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వార్నింగ్‌

    ఇరాన్‌కి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వార్నింగ్‌. ఇరాన్‌లో ఉన్న అన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తాం. నిరంకుశ పాలన నుంచి ఇరాన్‌ ప్రజలకు ఫ్రీడమ్‌ కల్పిస్తాం. -నెతన్యాహు

  • 01 Mar 2026 02:10 PM (IST)

    దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో 84 మంది పూణే విద్యార్థులు:

    దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో 84 మంది పూణే విద్యార్థులు. పూణే నుంచి ఇంటర్నేషనల్ స్టడీ టూర్‌కు వెళ్లిన ఎంబీఏ స్టూడెంట్స్. ప్రాజెక్ట్ వర్క్ పూర్తవ్వడంతో నిన్న ఎయిర్‌పోర్టుకు వెళ్లిన విద్యార్థులు. దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేయడంతో పడిగాపులు.

  • 01 Mar 2026 02:09 PM (IST)

    సురక్షితంగానే ఉన్నాను: పీవీ సింధూ

    ఇరాన్ యుద్ధం వల్ల దుబాయ్‌లో చిక్కుకుపోయిన పీవీ సింధు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోటల్‌కు తరలింపు. హోటల్‌లో సురక్షింతంగా పీవీ సింధు. యూకేలో జరుగుతున్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-2026కు వెళ్తుండగా నిలిచిపోయిన విమాన సర్వీసులు. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితుల్లో నిలిచిపోయిన విమాన సర్వీసులు. దుబాయ్ విమానాశ్రయంలో నిలిచిపోయిన అన్ని విమాన సర్వీసులు. సురక్షితంగానే ఉన్నామంటూ ఇన్‌స్టాలో పీవీ సింధూ పోస్ట్.

  • 01 Mar 2026 01:35 PM (IST)

    అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ విధ్వంసకర దాడులు..

    అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ విధ్వంసకర దాడులు.. అమెరికా, ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు.. క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్.. ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్‌లలో సైరన్ల మోత

  • 01 Mar 2026 12:26 PM (IST)

    ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మృతి..

    అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించిన తర్వాత, మరో ప్రముఖ నాయకుడు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీమ్ మౌసావి మరణించినట్లు ఇరాన్ టీవీ తాజాగా పేర్కొంది.

  • 01 Mar 2026 12:15 PM (IST)

    అమెరికా వార్నింగ్‌కు ఇరాన్ కౌంటర్..

    అమెరికా వార్నింగ్‌కు ఇరాన్ కౌంటర్. ఖమేనీ చూపిన బాటలోనే నడుస్తామన్న ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ స్పీకర్. మేం దాడులు చేస్తే శత్రువులు బెంబెలెత్తిపోవాల్సిందే. మా జవాబు చూసి శత్రువులు ఏడ్వాల్సిందే, వేడుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ అమెరికా వార్నింగ్‌కు కౌంటర్ ఇచ్చిన ఇరాన్.

  • 01 Mar 2026 11:53 AM (IST)

    అమెరికా హద్దు మీరింది: ఇరాన్

    అమెరికా హద్దు మీరింది. మూల్యం చెల్లించుకోక తప్పదన్న ఇరాన్. యూఎస్‌పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసిన ఇరాన్.

  • 01 Mar 2026 11:53 AM (IST)

    ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్..

    ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్. ప్రతీకారానికి దిగకపోవడం ఇరాన్‌కు మంచింది. ప్రతిదాడులు చేస్తే మరింత తీవ్రపరిణామాలు తప్పవన్న ట్రంప్.

  • 01 Mar 2026 10:48 AM (IST)

    యూఎస్, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

    యూఎస్, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్. యూఎస్ స్థావరాలపై కనీవిని ఎరుగని రీతిలో దాడులు చేస్తాం. ఖమేనీ మృతితో ప్రతీకారానికి తెగబడుతున్న ఇరాన్. జెరుసలెంపై ఇరాన్ ఎటాక్. ఇరాన్ దాడుల్లో ఒకరు మృతి, మరికొందరికి గాయాలు. తాజాగా ఇరాక్, బెహ్రయిన్ టార్గెట్‌గా మిస్సైల్స్ ఎటాక్. ఇరాక్ ఎయిర్‌పోర్టు సమీపంలోని యూఎస్ ఎయిర్‌బేస్‌పై దాడి. బెహ్రయిన్‌లో ఓ హోటల్‌పైనా దాడి చేసిన ఇరాన్.

  • 01 Mar 2026 10:47 AM (IST)

    ఖమేనీ కాంపౌండ్‌పై 7 మిస్సైళ్లతో దాడులు:

    శనివారం టాప్ అధికారులతో ఖమేనీ మీటింగ్. ఐఆర్‌జీసీ కమాండర్ పక్పూర్, డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నసిర్, సీనియర్ అడ్వైజర్ అలీ షమ్ఖానీతో సహా 30 మందితో సమావేశం. మీటింగ్ జరుగుతుండగా దాడులు. లోకేషన్ గుర్తించిన 15 నిమిషాల్లోనే ఎటాక్. ఖమేనీ కాంపౌండ్‌పై కనీసం 7 మిస్సైళ్లతో దాడులు. కుప్పకూలిన ఫోర్టిఫైడ్ కాంపౌండ్. కూలిన భవనంలోనే ఖమేనీ మృతదేహం లభ్యం. ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు మృతి. ఆపరేషన్ కిల్ ఖమేనీపై వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం.

  • 01 Mar 2026 10:46 AM (IST)

    ఆపరేషన్ కిల్ ఖమేనీకి సౌదీ, గల్ఫ్ దేశాల మద్దతు:

    గత కొన్నినెలలుగా ఖమేనీపై ఫోకస్. నెలలపాటు ప్లాన్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్. ఆపరేషన్ కిల్ ఖమేనీకి మద్దతు తెలిపిన సౌదీ, గల్ఫ్ దేశాలు. రెండు వారాల ముందే ఆపరేషన్ లాంచ్ డేట్ ఫిక్స్. ఖమేనీ పక్కా సమాచారం సేకరించిన సీఐఏ, మొసాద్. శాటిలైట్ ద్వారా ఖమేనీ లోకేషన్ గుర్తింపు. ట్రెహాన్‌లోని ఖమేనీ ఆఫీసులో ఉన్నట్లు నిర్ధారణ.

  • 01 Mar 2026 10:45 AM (IST)

    ఖమేనీ లక్ష్యంగా 30 బాంబు దాడులు..

    ఆపరేషన్ కిల్ ఖమేనీపై వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచనల కథనం.. ఖమేనీ లక్ష్యంగా 30 బాంబు దాడులు. శనివారం ఉదయం ఆపరేషన్ ఖమేనీ షురూ. శనివారం ఉదయం 1:15 AM మొదలు. ఫొర్టిఫైడ్ కాంపౌండ్‌లోనే ఖమేనీ ఇల్లు, ఆఫీస్. ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించిన ఇజ్రాయెల్. తొమహాక్ మిస్సైళ్లతో అమెరికా ఎటాక్.

  • 01 Mar 2026 10:04 AM (IST)

    గగనతలాలను మూసేసిన పలు దేశాలు..

    పశ్చిమాసియాలోని గగనతలాలను మూసేసిన పలు దేశాలు.. గగనతలాలను మూసేసిన ఇరాన్, ఇజ్రాయెల్, యూఏఈ, ఖతార్. మధ్య ప్రాచ్య గగనతలంలో 700 ఫ్లైట్లు రద్దు. తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్, కేఎల్ఎం, వర్జిన్ అట్లాంటిక్.. దుబాయ్‌లోనే ఏకంగా 700కు పైగా విమానాలు రద్దు. పశ్చిమాసియాకు విమాన సర్వీసులను తాత్కిలికంగా రద్దు చేసిన ఇండిగో. గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసిన ఎయిరిండియా. నిన్న ఒక్కరోజే 400లకు పైగా విమానసర్వీసులు రద్దు.

  • 01 Mar 2026 09:31 AM (IST)

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు..

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు మొజ్తబా ఖమేనీ. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చీఫ్ మహమ్మద్ పక్ పౌర్ మృతి. IRGC గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్‌గా వ్యవహరించిన మహమ్మద్ పక్‌పౌర్. కొత్త IRGC చీఫ్‌గా అహ్మద్ వహిదీ.

  • 01 Mar 2026 09:26 AM (IST)

    ఖమేనీ సహా 40 మంది ఇరాన్ ఉన్నతాధికారులు మృతి:

    ఖమేనీ సహా 40 మంది ఇరాన్ ఉన్నతాధికారులు మృతి చెందినట్లు టెహరాన్ ప్రకటించింది. దక్షిణ ఇరాన్‌పై దాడుల్లో 160 మంది స్కూలు బాలికలు, టీచర్లు మృతి. మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్ యూనివర్సిటీ సమీపంలోనే ఖమేనీ కాంపౌండ్. ఆ కాంపౌండ్‌లోని అన్ని భవనాలూ, అమెరికా - ఇజ్రాయెల్ దాడుల్లో నేలమట్టం. ఖమేనీ మరణించిన 20-24 గంటల తర్వాత అధికారిక ధ్రువీకరణ. ఖమేనీ వారసుడు ఎవరన్నది నిర్ణయించనున్న మత ప్రచారకుల మండలి. ఆ అత్యున్నత మండలిలో 88 మంది సభ్యులు.

  • 01 Mar 2026 09:20 AM (IST)

    ఖమేనీ మృతితో వ్యతిరేక వర్గాల్లో సంబరాలు..

    ఖమేనీ మృతితో వ్యతిరేక వర్గాల్లో సంబరాలు. ఇరాన్‌లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఖమేనీ వ్యతిరేక వర్గాలు. నియంత శకం ముగిసిందంటూ ఆనందోత్సాహాలు.

  • 01 Mar 2026 09:18 AM (IST)

    ఖమేనీ మరణవార్తను చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్..

    ఖమేనీ మరణవార్తను చదువుతూ ఇరాన్ మీడియా యాంకర్ కన్నీళ్లు.. శత్రుమూక దాడిలో సుప్రీం లీడర్ చనిపోయాడంటూ కన్నీళ్లు. లైవ్‌లోనే కన్నీళ్లు పెడుతూ న్యూస్ చదివిన యాంకర్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Donald Trump statement
  • Israel-Iran War
  • middle east conflict
  • Tehran Airstrikes

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions