Be Alert: కుబేరా సీన్ రిపీట్.. బిచ్చగాళ్ల పేర్లతో అకౌంట్స్.. ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ తో వెలుగులోకి
- సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు 'ఆపరేషన్ క్రాక్‌డౌన్'
- బిచ్చగాళ్లు, చిన్న చిన్న పనులు చేసుకునే వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు ఓపెన్
- పోలీసులకు ఏ మాత్రం డౌట్ రాకుండా సైబర్ నేరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల తెలుగులో వచ్చిన కుబేరా సినిమా చూశారు కదా!! సేమ్ టు సేమ్ అదే తరహాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బిచ్చగాళ్లు, చిన్న చిన్న పనులు చేసుకునే వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయిస్తున్నారు. పోలీసులకు ఏ మాత్రం డౌట్ రాకుండా సైబర్ నేరాలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కానీ ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సైబర్ నేరగాళ్ల భరతం పట్టారు. ఏకంగా 500 మందిని అరెస్ట్ చేశారు.
Also Read:Ravi Shastri Honored: రవిశాస్త్రికి అరుదైన గౌరవం.. వాంఖడే స్టేడియంలో ఇక ‘శాస్త్రి’ స్టాండ్!
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
తెలంగాణలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు ఎక్కడో ఉండి.. ఇక్కడి వారిని మోసం చేస్తున్నారు. దర్జాగా తమ అకౌంట్లకు డబ్బులు బదిలీ చేసుకుంటున్నారు. ఆయా అకౌంట్లను ట్రాక్ చేసినా ఉపయోగం ఉండడం లేదు. దీంతో అలాంటి మ్యూల్ అకౌంట్లపై పోలీసులు దృష్టిసారించారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ స్టార్ట్ చేశారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా తొలి దశలో రాష్ట్రంలోని 16 జిల్లాలు/యూనిట్లలో మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. TGCSB నిర్వహించిన డేటా విశ్లేషణ ప్రకారం 2025 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 4,775 మ్యూల్ ఖాతాలు కార్యకలాపాలు నిర్వహించినట్లు గుర్తించారు. ఇందులో భాగంగా 137 బ్యాంకు శాఖల్లో తెరిచిన 1,888 అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను అధికారులు తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా నమోదైన 9,431 సైబర్ నేరాలతో ఈ ఖాతాలకు సంబంధాలు ఉన్నట్లు తేలింది. అందులో 782 కేసులు తెలంగాణకు చెందినవిగా గుర్తించారు పోలీసులు…
ఈ సంయుక్త తనిఖీల్లో 512 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కూడిన 137 బృందాలు పాల్గొన్నాయి. బ్యాంకు శాఖలను సందర్శించి అనుమానాస్పద ఖాతాదారుల KYC వివరాలను సేకరించి పరిశీలించారు. ప్రాథమిక తనిఖీల్లో కొన్ని శాఖల్లో వందల సంఖ్యలో మ్యూల్ ఖాతాలు ఉండటం గమనించడంతో బ్యాంకు సిబ్బంది సహకారం, సంఘటిత నెట్‌వర్క్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌కు చెందిన ఒకే బ్యాంక్ ఖాతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన 496 సైబర్ కేసులతో సంబంధం ఉన్నట్లు బయటపడింది.
Also Read:Koel Mallick: రాజ్యసభకు హీరోయిన్ కోయల్ మల్లిక్.. పెద్దల సభలో పెరుగుతున్న గ్లామర్ ఫీల్డ్
సూర్యాపేట జిల్లాలో 4 బ్యాంకు శాఖల్లో మొత్తం 298 ఖాతాలు అనేక నేరాలకు లింక్ ఉన్నట్లు గుర్తించారు. అవసరమైన చోట్ల కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్లకు అకౌంట్లో అందిస్తున్న దాదాపు 500 మంది పైచిలుకు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లంతా కొందరు తెలిసి సైబర్ నేరగాళ్లకు సాయం చేస్తే.. కొందరు తెలియకుండా సహాయం చేశారు. తెలిసి సహాయం చేసిన వాళ్లపైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తెలంగాణలో సైబర్ నేరాలను సమూలంగా అణచివేయడానికి ఈ ఆపరేషన్ కీలకంగా మారనుందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
-
Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
-
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
-
Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!