Nawab Cafe Review: నవాబ్ కేఫ్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2 / 5
- MAIN CAST: శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల తదితరులు
- DIRECTOR: ప్రమోద్ హర్ష
- MUSIC: ప్రశాంత్ ఆర్ విహారి
- PRODUCER: రాధా వి పాపుడిప్పు మరియు వెంకట్ ఆర్ పాపుడిప్పు
శివ కందుకూరి హీరోగా, రాజీవ్ కనకాల కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. మొదట ‘ఛాయ్ వాలా’ అనే టైటిల్‌తో వార్తల్లో నిలిచిన ఈ సినిమా, సెన్సార్ అభ్యంతరాల తర్వాత పేరు మార్చుకుని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ కేఫ్‌లో దొరికిన టీ ప్రేక్షకులకు ఎంతవరకు కిక్కు ఇచ్చిందో చూద్దాం.
నవాబ్ కేఫ్ కథ:
హైదరాబాద్ పాతబస్తీలోని ప్రసిద్ధ ‘నవాబ్ కేఫ్’కు 400 ఏళ్ల చరిత్ర ఉంటుంది. దీనిని రంగనాథ్ (రాజీవ్ కనకాల) ప్రాణప్రదంగా నిర్వహిస్తుంటాడు. అయితే అతని కొడుకు రాజ్ (శివ కందుకూరి)కి మాత్రం ఆ టీ కొట్టు నడపడం ఇష్టం ఉండదు. ఎలాగైనా అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనేది అతని కల. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. మరోవైపు రాజ్ పెదనాన్న కొడుకు కుమార్ (చైతన్య కృష్ణ) ఆ కేఫ్‌ని కూల్చేసి పెద్ద కాంప్లెక్స్ కట్టాలని ప్లాన్ చేస్తాడు. ఒక అనుకోని పరిస్థితుల్లో రంగనాథ్ మరణించగా, అప్పుడే రాజ్‌కి తన తండ్రి గొప్పతనం, కేఫ్ వెనకున్న ఎమోషన్ అర్థమవుతుంది. ఆ తర్వాత రాజ్ ఆ వారసత్వాన్ని ఎలా కాపాడాడు? అన్న కుమార్‌ని ఎలా అడ్డుకున్నాడు? అన్నదే మిగిలిన కథ.
Also Read
విశ్లేషణ?
సినిమా పాయింట్ పరంగా చూస్తే ఇది ఒక ఎమోషనల్ డ్రామా. టీ అనేది మనందరికీ ఒక ఎమోషన్ కాబట్టి, ఆ నేపథ్యం ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంది. అయితే కథనం పరంగా చూస్తే సినిమా కొంత రొటీన్‌గా సాగుతుంది. గతంలో వచ్చిన ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ లేదా ‘ఉస్తాద్ హోటల్’ వంటి చిత్రాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. మధ్యలో కీర్తి సురేష్ మిస్ ఇండియా కూడా గుర్తు వస్తుంది. ఫస్టాఫ్ ప్రారంభంలో హీరో క్యారెక్టరైజేషన్, రాజీవ్ కనకాలతో సాగే సన్నివేశాలు బాగున్నాయి. తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఘర్షణ ఇంటర్వెల్ కార్డు వరకు సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. సెకండాఫ్ కొంత స్లోగా సాగినప్పటికీ, హీరో తండ్రి ఆశయాన్ని నిలబెట్టే క్రమంలో వచ్చే ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. కామెడీ కోసం రాజ్ కుమార్ కసిరెడ్డిని వాడుకున్నా, అది అంతగా పేలలేదు. లవ్ స్టోరీ కూడా కథకు పెద్దగా సహాయపడలేదు. హిట్ సినిమాలు చూసి స్ఫూర్తి పొందడం తప్పు కాదు కానీ సన్నివేశాలు కూడా సరిగా రాసుకోకుండా తీయడం కరెక్ట్ కాదు. శివ కందుకూరి, రాజ్ కసిరెడ్డి మధ్య కామెడీ సీన్స్ , శివ కందుకూరి, తేజు అశ్విని మధ్య లవ్ ట్రాక్ సహా విలన్ రోల్ కూడా ఒక్కటి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. ఇంటర్వెల్ ముందు తండ్రి మరణం తర్వాత సన్నివేశం ఒక్కటే బాగా వచ్చినట్టు అనిపించింది. అలానే తండ్రీ కొడుకుల మధ్య ఇంటర్వెల్ ముందు వచ్చే వాగ్వాదం, ఎమోషనల్ సీన్స్ మాత్రమే బావున్నాయి. మిగతా సినిమా అంతా ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ఉంటుంది.
నటీనటుల పనితీరు:
శివ కందుకూరి గత సినిమాలతో పోలిస్తే నటనలో చాలా మెరుగయ్యాడు. ఎమోషనల్ సీన్స్‌లో పరిణతి చూపించాడు. రాజీవ్ కనకాల మరోసారి తన మార్క్ నటనతో కన్నీళ్లు పెట్టించాడు. తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. చైతన్య కృష్ణ విలన్‌గా మెప్పించినా, ఆయన పాత్రకు మరింత బలం ఉండాల్సింది. హీరోయిన్ తేజు అశ్విని అందంగా కనిపించినా, కథలో ఆమెకు పెద్దగా స్కోప్ లేదు. ఈ సినిమాకు ప్రధాన బలం ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం. పాటలు వినసొంపుగా ఉండటమే కాకుండా, నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ పాతబస్తీ వాతావరణాన్ని కలర్‌ఫుల్‌గా చూపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు ప్రమోద్ హర్ష ఒక మంచి ఎమోషనల్ పాయింట్‌ను ఎంచుకున్నాడు, కానీ స్క్రీన్ ప్లే మీద మరింత వర్క్ చేసి ఉంటే సినిమా మరో లెవల్‌లో ఉండేది.
ఫైనల్లీ: ‘నవాబ్ కేఫ్’ బోర్ కొట్టించే ఎమోషనల్ డ్రామా.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!