Darren Sammy: “2016 రిపీట్ అవ్వడం పక్కా.. భారత్‌ను చిత్తు చేస్తాం”.. టీమిండియాకు వెస్టిండీస్ కోచ్ సవాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darren Sammy: రేపు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్- వెస్టిండీస్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో సింపుల్ నినాదం ఒక్కటే.. గెలిచిన జట్టు సెమీస్‌కు, ఓడిన జట్టుకు ఇంటికి.. ఇది మాత్రం ఫిక్స్. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. స్టేడియంలో 80 వేల మందికి పైగా ప్రేక్షకులు, బయట 140 కోట్ల ప్రజల ఆశలు ఈ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ప్లేయర్స్‌పై ఒత్తిడి సైతం బాగానే ఉంది. ఈ తరుణంలో వెస్టిండీస్ కోచ్ మాత్రం చాలా కూల్‌గా కనిపిస్తున్నారు. ఆయన భారత్‌కు సవాళ్లు సైతం విసురుతున్నారు. “వరల్డ్ కప్ గెలవాలంటే ఎప్పుడో ఒకప్పుడు భారత్‌ను ఓడించాల్సిందే. ఆ రోజు రేపే” అని వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ అన్నారు. 2016 జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో భారత నేలపైనే విండీస్ సంచలనం సృష్టించింది. అదే ఊపును ఈ సారి సైతం తేవాలని చూస్తున్నారు. “ఇది డేవిడ్ వర్సెస్ గోలియత్ లా అనిపించవచ్చు. కానీ 2016లో డేవిడ్ గెలిచాడు. అదే సందేశం నా బాయ్స్‌కు ఇస్తున్నాను” అని సామీ నవ్వుతూ చెప్పారు. 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, భారత్‌ను టోర్నీ నుంచి నిష్క్రమింపజేసింది. ఈ మ్యాచ్‌ను ఉద్దేశించి సామీ ఈ వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
సాధారణంగా వెస్టిండీస్ అందరికీ రెండో ఫేవరెట్ టీమ్. కానీ ఈ మ్యాచ్‌లో భారత్‌కు శత్రువులుగా మారుతున్నారు. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి వచ్చినా సామీ ఆందోళన చెందడం లేదు. “ఒక ఓటమి మీ జట్టును నిర్వచించదు. భారత్ కూడా ఓటమి తర్వాత బలంగా తిరిగి వచ్చింది. ఇప్పుడు మేము స్పందించాలి. ఇది వర్చువల్ క్వార్టర్ ఫైనల్. అమలు ముఖ్యం,” అని అన్నారు. జట్టులో మార్పులపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. “నా సైనికులందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. టాస్ సమయంలో జట్టు తెలుస్తుంది. నా వద్ద 11 మంది డేంజర్ ఆటగాళ్లు ఉన్నారు. మేము ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నాం” అంటూ చిరునవ్వు చిందించారు. గత మ్యాచ్‌లో 83/7 స్థితిలోనూ 177 వరకు చేరిన జట్టు పోరాటస్ఫూర్తిని ప్రశంసించారు. “83 పరుగలకే ఏడు వికెట్లు కోల్పోతామని అనుకోలేదు. కానీ ఆ పార్ట్‌నర్‌షిప్ క్యారెక్టర్ చూపించింది” అని చెప్పారు. అదే ధైర్యం మళ్లీ కావాలని కోరారు. గెలిస్తే భారీ సెలబ్రేషన్ ఉంటుంది. 10 ఏళ్లుగా సెమీఫైనల్‌కు చేరలేదు. ఈసారి మైదానంపైనే డ్యాన్స్ చేయాలని ఆశిస్తున్నామని హాస్యంగా చెప్పారు.
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!