Hey Balwanth Review: హే బల్‌వంత్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Suhash, Shivani Nagaram
- DIRECTOR: Gopi Atchara
- MUSIC: Vivek Sagar
- PRODUCER: Narendra Reddy
వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో సుహాస్ ఎప్పుడూ ముందుంటాడు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ తర్వాత మళ్ళీ శివానీ నగరం – సుహాస్ జంటగా నటించిన సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రిలీజ్ కి రోజుల ముందు సెన్సార్ అభ్యంతరాల వల్ల ‘హే భగవాన్’ కాస్త ‘హే బల్‌వంత్’గా మారినా, సినిమాలో అసలు విషయం మాత్రం మారలేదు. మరి ఈ సినిమా ఏ మేరకు నవ్వించిందో చూద్దాం.
కథా నేపథ్యం:
రావు బల్‌వంత్ (సీనియర్ నరేష్) ఒక రహస్య వ్యాపారం చేస్తుంటాడు. ఆ బిజినెస్ ఏంటనేది తన కొడుకు కృష్ణ (సుహాస్)కు కూడా తెలియదు. ఎంబీఏ పూర్తి చేసిన కృష్ణ, తండ్రి వ్యాపారాన్ని తాను టేకప్ చేసి సత్తా చాటాలనుకుంటాడు. తీరా ఆ ‘బిజినెస్’ ఏంటో తెలిశాక కృష్ణ మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ వృత్తి వల్ల సమాజంలో ఎదురయ్యే అవమానాలు, కృష్ణ ప్రేమించిన మిత్ర (శివానీ నగరం) కుటుంబంతో వచ్చే చిక్కులు.. వీటన్నింటినీ దాటుకుని బల్‌వంత్ తన బిజినెస్‌ను ఎలా సమర్థించుకున్నాడు? తండ్రీకొడుకుల మధ్య ఈ గొడవ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.
Also Read
విశ్లేషణ:
నిజానికి దర్శకుడు గోపి ఎంచుకున్న పాయింట్ చాలా రిస్కీ. సమాజంలో ఒక వర్గం మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను, ఒక బోల్డ్ వృత్తి నేపథ్యాన్ని తీసుకుని దానికి కామెడీని అద్దడం కత్తి మీద సాము లాంటిదే. కానీ, ఆ గీత దాటకుండా ఎంటర్టైన్మెంట్ పండించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఇక సినిమా ప్రారంభం నుండి ఇంటర్వెల్ వరకు ఎక్కడా బ్రేక్ లేకుండా సాగిపోతుంది. ముఖ్యంగా తండ్రి చేసే ఆ ‘బిజినెస్’ ఏంటో రివీల్ అయ్యే వరకు సస్పెన్స్, ఆ తర్వాత వచ్చే కామెడీ సన్నివేశాలు థియేటర్‌లో నవ్వులు పూయిస్తాయి. సెకండాఫ్ లో కథ కొంత ప్రిడిక్టబుల్‌గా మారుతుంది. రొటీన్ ఫార్ములాలోకి వెళ్లడం వల్ల వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాను మళ్ళీ గాడిలో పెడతాయి. ముఖ్యంగా తండ్రీకొడుకుల సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. అలానే కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. వెన్నెల కిషోర్ మంతెన సత్యనారాయణరాజును గుర్తు చేసినప్పుడు.. సుదర్శన్‌కనిపించిన ప్రతిసారీ కామెడీ పీక్స్‌కు వెళ్తుంది. నరేష్ బిజినెస్ ఏంటి అనేది సినిమాలో ముందే రివీల్ చేసి.. చివరి వరకు కామెడీ పండించడం విశేషం. చివరికి ఈ బిజినెస్ ఎందుకు.. ఏ సందర్భంలో చేయాల్సి వచ్చిందో కన్విన్సింగ్‌గా చెప్పాడు దర్శకుడు గోపి. ఈ బిజినెస్ వలనే సెన్సార్ A సర్టిఫికేట్ ఇచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రం ఎక్కడా లోటు లేదు. ముఖ్యంగా.. నరేష్.. వెన్నెల కిషోర్.. సుదర్శన్ కామెడీ బాగా వర్కౌట్ అయింది.
నటీనటుల ప్రతిభ విషయానికి వస్తే సుహాస్ ఎప్పటిలాగే తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. డ్యాన్సుల విషయంలో ఈసారి మరింత కష్టపడినట్లు కనిపిస్తోంది. సీనియర్ నరేష్ సినిమాకు వెన్నెముక. అటు కామెడీని, ఇటు ఎమోషన్‌ను అద్భుతంగా పండించారు. అలానే ఈ సినిమాకు అసలైన ‘ఇంపాక్ట్ ప్లేయర్స్’ అంటే సుదర్శన్, వెన్నెల కిషోర్. సుదర్శన్ కనిపించిన ప్రతిసారీ కామెడీ పీక్స్‌లో ఉంటుంది. చాలా కాలం తర్వాత బాబు మోహన్ మార్క్ కామెడీ కూడా అలరిస్తుంది. శివానీ నగరం హీరోయిన్ పాత్రకు న్యాయం చేసింది, సుహాస్‌తో ఆమె కెమిస్ట్రీ బాగుంది.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే వివేక్ సాగర్ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. చిన్న సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.
ఫైనల్లీ ‘హే బల్‌వంత్’ ఒక పక్కా అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్. గీత దాటకుండా నవ్వులు గ్యారెంటీ
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!