Hong Kong Coffin Homes: జస్ట్ 16 స్క్వేర్ ఫీట్ రూమ్.. ఏకంగా రూ. 40 వేల అద్దె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hong Kong Coffin Homes: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటైన హాంకాంగ్ లో విలాసవంతమైన భవనాలు, కోట్ల రూపాయల ఆస్తులతో ప్రసిద్ధి చెందింది. కానీ ఈ మెరుపుల వెనుక దాగి ఉన్న వాస్తవం మాత్రం చాలా దారుణమైంది. వేలాది మంది అక్కడ కేవలం 16 చదరపు అడుగుల చిన్న బాక్స్‌లాంటి గదుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వీటినే “కాఫిన్ హోమ్స్” (Coffin Homes) అని పిలుస్తుంటారు.
Read Also: Pixel 10a India Launch: భారత్‌లో గూగుల్ ‘పిక్సెల్ 10ఏ’ విడుదల.. 5100mAh బ్యాటరీ, 48MP కెమెరా!
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
అత్యంత ఖరీదైన గృహ మార్కెట్..
గత 14 ఏళ్లుగా హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహ మార్కెట్‌గా కొనసాగుతోంది. ఒకవైపు ఆకాశాన్ని తాకే గాజు టవర్లు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు కనిపిస్తుంటే, మరోవైపు పేదలు, వృద్ధులు, తక్కువ ఆదాయ వర్గాల వారు తీవ్ర ఇబ్బందుల్లో జీవిస్తున్నారు. నగర సంపదలో అధిక భాగం కొద్దిమంది ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండిపోయింది.
నడిచేందుకు నో ఛాన్స్..
కాఫిన్ హోమ్స్ పరిమాణం సుమారు 16 చదరపు అడుగులు మాత్రమే.. అంటే 4 అడుగులు × 4 అడుగుల స్థలం.. అందులో ఒక చిన్న మంచం పెట్టిన తర్వాత ఇంకేమీ స్థలం ఉండదు.. నిలబడి ఉండటానికి కూడా అవకాశం ఉండదు. చేతులు చాచాలని చూసిన గోడలు తగులుతాయి. ఒక 800 చదరపు అడుగుల ఫ్లాట్‌ను 20 నుంచి 30 చిన్న గదులుగా విభజించి అద్దెకు ఇస్తున్నారు. ఆ ఒక్క గదిలోనే పడుకోవడం, తినడం, ఫోన్ ఉపయోగించుకోవడం, కొన్ని సందర్భాల్లో వంట చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
16 స్క్వేర్ ఫీట్ గదుల్లో 2.2 లక్షలు..
అంచనా ప్రకారం సుమారు 2 లక్షల నుంచి 2.2 లక్షల మంది వరకు ఇలాంటి 16 స్క్వేర్ ఫీట్ గదుల్లో జీవిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ గృహాల కోసం వేచి ఉండే సమయం సగటున ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ కఠిన పరిస్థితుల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ 16 చదరపు అడుగుల గదికే నెలకు 230 నుంచి 450 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.20,000 నుంచి రూ.45,000 వరకు) అద్దె చెల్లించాల్సి వస్తోందని అక్కడి ప్రజలు వాపోతున్నారు.
టాయిలెట్స్ పక్కనే వంట:
వేసవిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఇలాంటి చిన్న గదుల్లో గాలి సరిగ్గా రాకపోవడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. బెడ్ బగ్స్, చీమలు, కాక్రోచులు వంటి పురుగుల సమస్య కూడా హాంకాంగ్ లో అధికంగా ఉంటుంది. కొన్ని గదుల్లో ప్రత్యేక వంటగది అంటూ ఏమీ ఉండదు. టాయిలెట్ పక్కనే కూరగాయలు కడిగి వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా ప్రమాదకరమైనా, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బయట తినడం చాలా మందికి సాధ్యం కాదు.
75 మంది వద్దే 10 శాతం సంపద..
హాంకాంగ్‌లో కేవలం 75 మంది వ్యక్తులు నగర సంపదలో సుమారు 10 శాతం నియంత్రిస్తున్నారని తెలుస్తుంది. సాధారణ ప్రాంతాల్లో కూడా అపార్ట్‌మెంట్ల ధరలు మిలియన్ డాలర్లకు పైగా ఉంటాయి. ఒక సాధారణ ఒక బెడ్‌రూమ్ ఫ్లాట్ అద్దెనే నెలకు 4,000 డాలర్ల వరకు ఉంటుంది. దీంతో ఒకవైపు మెరుస్తున్న స్కైలైన్స్.. మరోవైపు 16 చదరపు అడుగుల బాక్స్‌ల్లో బతుకుతున్న ప్రజల జీవితాలు.. అభివృద్ధి, సంపద ఉన్నప్పటికీ, అసమానతల్లో ఎంత వ్యత్యాసం ఉందో హాంకాంగ్ నగరాన్ని చూస్తే తెలుస్తుంది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?