IPL 2026 : క్రికెట్ పండగకు ముహూర్తం ఖరారు.. కానీ చిన్న ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 19వ సీజన్) సందడి మొదలైంది. అయితే, షెడ్యూల్ విషయంలో బీసీసీఐ (BCCI) ఒక కీలక మార్పు చేసినట్లు సమాచారం. తొలుత మార్చి 26న ప్రారంభం కావాల్సిన ఈ ధనాధన్ టోర్నీ, ఇప్పుడు రెండు రోజులు ఆలస్యంగా అంటే మార్చి 28 (శనివారం) నుండి ప్రారంభం కానుందని సమాచారం. మే 31న గ్రాండ్ ఫైనల్ జరగనుందని టాక్. ఈ నేపథ్యంలో అసలు ఐపీఎల్ ఎందుకు ఆలస్యమవుతోంది? ఎన్నికల ఎఫెక్ట్ ఏయే జట్లపై పడనుంది? బీసీసీఐ ప్లాన్ ఏంటి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం తేదీలే కాదు, వేదికల విషయంలో కూడా ఈసారి అనూహ్య మార్పులు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి మ్యాచ్ ఆడాల్సి ఉన్నా, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ నిర్వహణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను బట్టి బీసీసీఐ (BCCI) ఐపీఎల్ పాక్షిక షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఐపీఎల్ 2026 గ్రాండ్ ఓపెనింగ్ మార్చి 26 అనుకున్నప్పటికీ, ఇప్పుడు రెండు రోజులు ఆలస్యంగా మార్చి 28న ప్రారంభం కానుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 31న జరగనుందని తెలుస్తుంది.
ఆలస్యం ఎందుకు..
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తేదీల ప్రకటన కోసం బీసీసీఐ వేచి చూస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా తేదీల్లో మ్యాచ్‌లు నిర్వహించడం కష్టం కాబట్టి, ఎన్నికల షెడ్యూల్ వచ్చాకే పూర్తి ఐపీఎల్ షెడ్యూల్ ఖరారవుతుందని సమాచారం. అలాగే మార్చి 8న ముగిసే టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత స్టేడియాలను ఐపీఎల్ కోసం సిద్ధం చేయడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది. ఈ ఐపీఎల్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇంకా అనుమతులు రాలేదు. ఒకవేళ అక్కడ సాధ్యం కాకపోతే, నవీ ముంబై, రాయ్‌పూర్ లేదా పూణేలలో ఏదో ఒక స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ అనుకున్న టైంలో రావచ్చని చెబుతున్నారు.
READ ALSO: Pakistan Cricket: పాక్ క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సర్జరీ.. ఈ స్టార్ల కెరీర్ ఇక ముగిసినట్టేనా?
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..