Imran Khan: ప్లే బాయ్.. హ్యాండ్‌సమ్.. క్రికెట్‌లో తోపు.. చివరకు జైలు గోడల మధ్య చిక్కుకుపోయాడు.. ఇమ్రాన్‌ఖాన్ గూస్‌బంప్స్ స్టోరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘The Cornered Tiger..’ ఈ పదం ఇమ్రాన్‌ఖాన్‌కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఒకప్పుడు క్రికెట్ గ్రౌండ్‌లో ప్రత్యర్థులను వణికించిన ఇమ్రాన్ ఖాన్.. ఈరోజు జైలు గోడల మధ్య దిక్కుతోచని స్థితిలో బతుకీడ్చుతున్నారు. ఒకప్పుడు బంతి చేతిలోకి తీసుకుంటే సామ్రాజ్యాలను కూల్చినట్టు ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను ఛిద్రం చేసిన ఆ మనిషి.. ఇప్పుడు పాకిస్థాన్ జైలు అధికారుల ప్రవర్తనకు లోలోపలే ఛిద్రమవుతున్నారు. ఇమ్రాన్ స్థితిని అర్థంచేసుకున్న సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు పాకిస్థాన్ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ఇమ్రాన్‌ఖాన్ పట్ల మానవీయ వైఖరిని చూపించాలని వేడుకుంటున్నారు.
ఇంతకీ ఇమ్రాన్‌కు ఈ దుస్థితి ఎలా వచ్చింది? ఒకప్పుడు మైదానంలో ప్రత్యర్థులను వణికించిన నాయకుడు, ఇప్పుడు అధికార వ్యవస్థల మధ్య ఒంటరిగా ఎందుకు నిలబడాల్సి వచ్చింది? ఇది కేవలం ఒక మాజీ ప్రధాని పరిస్థితి కాదు..ఇది ఒక యోధుడి పరిణామ గాధ. క్రికెట్ ప్రపంచంలో రారాజుగా వెలిగిన ఇమ్రాన్ ఖాన్.. జైలు గోడల మధ్య బందీగా ఎలా మారారో కచ్చితంగా తెలుసుకోని తీరాల్సిందే!
జెన్-Z, జెనరేషన్ ఆల్ఫా.. మీకు ఇమ్రాన్ ఖాన్ అంటే రాజకీయ వివాదాలు, అరెస్టులు, కోర్టు కేసులే గుర్తుకు వస్తాయమో కానీ.. మీకు తెలియని ఒక ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు.
Also Read
బౌలింగ్ రన్‌అప్‌లోకి అడుగుపెట్టగానే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ గుండెల్లో భయాన్ని నింపిన ఇమ్రాన్‌ఖాన్ గురించి ఈ జనరేషన్ వాళ్లలో చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు కానీ.. 1982లో భారత్‌పై ఒక్క సిరీస్‌లోనే 40 వికెట్లు తీసి ఇండియన్ బ్యాటింగ్ లైనప్‌ను ముక్కలు చేసిన ఇమ్రాన్ టాలెంట్‌ను మాత్రం తక్కువ చేసి ఎవరూ చూడరు. అతను కేవలం ఫాస్ట్ బౌలర్ కాదు. నాయకత్వం అంటే ఏంటో చూపించిన కెప్టెన్ కూడా. గ్రౌండ్‌లోకి దిగకముందే విజయాన్ని ప్రకటించగల ధైర్యం అతనిది. 1987లో బెంగళూరులో గవాస్కర్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఐదు గంటలకు పైగా పోరాడిన గవాస్కర్ 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ మ్యాచ్ తర్వాత గవాస్కర్ ఇమ్రాన్ బౌలింగ్‌ను ఎంతో మెచ్చుకున్నారు. సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాళ్లు కూడా ఇమ్రాన్ ఫిట్‌నెస్, ఆగ్రెషన్, నాయకత్వాన్ని ఒక ప్రమాణంగా తీసుకొనే ఎదిగారు.
ఇక అతని జీవితంలో పీక్ స్టేజీ మాత్రం 1992 ప్రపంచకప్. ఆ సమయంలో ఇమ్రాన్ వయసు 39. అందులో భుజం గాయం. జట్టులో అనుభవమున్న ఆటగాళ్లు తక్కువ. మొదటి మ్యాచుల్లో పరాజయాలు. మీడియా విమర్శలు. అప్పుడు అతను జట్టుకు చెప్పిన మాట ఒక్కటే. ‘The Cornered Tiger is the most dangerous..’ ఆ ఒక్క మాట జట్టును మార్చింది.
ఇంజమామ్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ లాంటి ఆటగాళ్లను అతను తీర్చిదిద్దిన విధానం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఫైనల్లో 72 పరుగులు చేసి ట్రోఫీని ఎత్తుకున్నప్పుడు అది కేవలం ఒక కప్ కాదు. అది ఒక జాతి ఆత్మగౌరవంగా నిలిచింది. అయితే క్రికెట్ గ్రౌండ్‌లో విజేతగా నిలిచిన వ్యక్తి రాజకీయాల్లో అదే ధైర్యాన్ని కొనసాగించినప్పుడు సమస్యలు మొదలయ్యాయి. 2018లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ ఖాన్ అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో అధికారంలోకి వచ్చారు. కానీ ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, విదేశీ అప్పులు, సైన్యంతో విభేదాలు అతని ప్రభుత్వాన్ని కుదిపేశాయి. 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయారు. తర్వాత నుంచి కేసుల వరద పారింది. అవినీతి, అధికార దుర్వినియోగం కేసుల్లో బుక్కయ్యారు.
పాకిస్థాన్‌లో సైన్యంపై విమర్శలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా అనే ప్రశ్న మళ్లి వినిపించింది. గతంలో జుల్ఫికార్ అలీ భుట్టో నుంచి నవాజ్ షరీఫ్ వరకు అనేక నాయకులు జైలు, ప్రవాసం, లేదా మరింత దారుణ పరిణామాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే చరిత్ర ఇమ్రాన్ ఖాన్ చుట్టూ తిరుగుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
జైలు పరిస్థితులపై ఆయన అనుచరులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆరోగ్య సదుపాయాలు సరిగా లేవని, ఒంటరిగా నిర్బంధిస్తున్నారని, రాజకీయ కార్యకలాపాలపై పూర్తిగా ఆంక్షలు విధించారని చెబుతున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా పాకిస్థాన్ జైళ్ల పరిస్థితులపై గతంలో అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలనే డిమాండ్ మళ్లీ వినిపిస్తోంది. ఇక ఓ ప్రపంచకప్ విజేత, ఒక ప్రజా నాయకుడు జైల్లో మానవీయ హక్కులు కోల్పోవడం మరో పెద్ద చర్చకు దారి తీస్తోంది.
అయితే ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తు ఏంటో కాలమే నిర్ణయిస్తుంది కానీ.. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రౌండ్‌లో అయినా, రాజకీయాల్లోనైనా తప్పొప్పులను పక్కనపెడితే ఇమ్రాన్ పేరును చరిత్ర నుంచి మాయం చేయడం సాధ్యం కాదు.. ఎందుకంటే ‘The Cornered Tiger’ కథ ఇంకా ముగిసిపోలేదు!
ALSO READ: న*గ్నంగా ఊరేగించాడు.. సొంత మామనే కుక్కలతో కరిపించి చంపాడు.. కిమ్ కిరాతకం!
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!