Hair Loss: బయోటిన్‌తో జట్టు రాలడానికి చెక్..! నిజమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hair Loss: జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అంటారు.. అయితే, ఇది కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన సామెతగా చూడాల్సిన పని లేదు.. ఎందుకంటే.. ఈ రోజుల్లో ఎంతో మంది జుట్టు రాలడం.. బట్ట తల వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. నలుగురిలో తలెత్తుకోలేక పోతున్నారు.. కొందరు యువతకు బట్టతల పెళ్లికి అడ్డంకిగా మారిపోతుందంటే అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి.. అయితే, జుట్టు రాలడాన్ని నివారించడంలో బయోటిన్ పాత్రపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి.. అసలు జట్టు రాలడాన్ని ఆపడంలో బయోటిన్ ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అనేదానిపై వైద్య నిపుణులు వివరణ ఇస్తున్నారు..
జుట్టు రాలడం పురుషులు, మహిళలు ఇద్దరికీ సాధారణ సమస్య. కాలుష్యం, ఒత్తిడి, జన్యు కారణాలు మాత్రమే కాదు, పోషకాహార లోపాలు కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో “బయోటిన్ సప్లిమెంట్లు జుట్టు రాలడాన్ని ఆపుతాయి” అనే ప్రచారం విస్తృతంగా వినిపిస్తోంది. అయితే, ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకుందాం.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
బయోటిన్ అంటే ఏమిటి?
బయోటిన్‌ను విటమిన్ B7 అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యానికి ఇది ఉపయోగకరమని చెబుతారు. బయోటిన్ నీటిలో కరిగే విటమిన్ కావడంతో శరీరం అదనపు పరిమాణాన్ని నిల్వ చేయదు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. అయితే, బయోటిన్ లోపం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే సరైన ఆహారం తీసుకోకపోవడం, జీర్ణ సమస్యలు లేదా కొన్ని మందుల దీర్ఘకాల వినియోగం వల్ల శరీరంలో బయోటిన్ శోషణ తగ్గవచ్చు అంటున్నారు.
రోజుకు ఎంత బయోటిన్ అవసరం?
– 6 నెలల లోపు శిశువులకు: 5 మైక్రోగ్రాములు
– 7–12 నెలలు: 6 మైక్రోగ్రాములు
– 1–3 సంవత్సరాలు: 8 మైక్రోగ్రాములు
– 4–8 సంవత్సరాలు: 12 మైక్రోగ్రాములు
– 9–13 సంవత్సరాలు: 20 మైక్రోగ్రాములు
– 14–18 సంవత్సరాలు: 25 మైక్రోగ్రాములు
– 19 సంవత్సరాలు పైబడినవారు: 30 మైక్రోగ్రాములు
– గర్భిణీలు: 30 మైక్రోగ్రాములు
– పాలిచ్చే తల్లులు: 35 మైక్రోగ్రాములు
బయోటిన్ నిజంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా?
2017లో ప్రచురితమైన సమీక్షలో బయోటిన్ తీసుకున్న 18 కేసులను పరిశీలించారు. అందులో జుట్టు లేదా గోళ్లు మెరుగుపడ్డాయి. అయితే, ఆ రోగుల్లో ఎక్కువ మందికి ముందే పోషక లోపాలు లేదా ఇతర వైద్య సమస్యలు ఉన్నాయి. సాధారణ వ్యక్తులపై బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. 2023లో ప్రచురితమైన “Biotin for Hair Loss: Teasing Out the Evidence” సమీక్షలో కూడా జుట్టు పెరుగుదలపై బయోటిన్ ప్రభావాన్ని నిరూపించే నాణ్యమైన, నియంత్రిత పరిశోధనలు లేవని తేలింది. అంటే, బయోటిన్ లోపం లేకపోతే సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు.
బయోటిన్ సహజంగా లభించే ఆహారాలు
అమెరికాలో నమోదైన డైటీషియన్ కోర్ట్నీ డెల్ప్రా ప్రకారం, ముందుగా ఆహారం ద్వారా పోషకాలు పొందడం ఉత్తమం.
బయోటిన్ లభించే ఆహారాలు:
– గుడ్లు
– సాల్మన్ చేప
– మాంసాహారం
– గింజలు
– విత్తనాలు
సప్లిమెంట్లకు బదులుగా సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది కాదు. అధిక మోతాదులో కొన్ని విటమిన్లు హానికరం కావచ్చు. నీటిలో కరిగే విటమిన్లు (B, C) ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. అయితే కొవ్వులో కరిగే విటమిన్లు (A, D, E, K) ఆహారంతో తీసుకోవాలని సూచన చేస్తున్నారు.. ఇక, అందరికీ సప్లిమెంట్లు అవసరం ఉండవు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి ఆధారంగా మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..