ONGC Share: ఇరాన్- ఇజ్రాయెల్ చమురు మంటలతో.. ONGC ఇన్వెస్టర్లకు పండగ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ONGC Share: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో విరుచుకుపడటం.. దానికి ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండగా, భారత స్టాక్ మార్కెట్‌లోని ఒక ప్రభుత్వ రంగ దిగ్గజానికి మాత్రం ఇది ‘కాసుల వర్షం’ కురిపించబోతోంది. ఇంతకీ ఆ షేర్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..
Also Read
యుద్ధ వాతావరణం వల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుంటే, చమురు అన్వేషణ, ఉత్పత్తి రంగంలో ఉన్న ONGC (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) షేర్లు మాత్రం రాకెట్ లాగా దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరిగినప్పుడు, చమురును భూమి, సముద్ర గర్భం నుండి వెలికితీసే కంపెనీలకు భారీ లాభాలు వస్తాయి. ఎందుకంటే ONGC తన ఉత్పత్తి ఖర్చులో పెద్దగా మార్పు లేకుండానే, వెలికితీసిన చమురును అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలకు విక్రయించగలుగుతుంది. దీనివల్ల కంపెనీ ఆదాయం, లాభ మార్జిన్లు గణనీయంగా పెరుగుతాయి. అందుకే సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే ఇన్వెస్టర్లు ONGC వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గత కొంతకాలంగా ONGC స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోందని అంటున్నారు. గత ఏడాది ఈ కంపెనీ వృద్ధి సుమారు 23.91% పెరుగుదల నమోదు చేసిందని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటికే 17.30% లాభాలను నమోదు చేసిందని వెల్లడించారు. స్టాక్ మార్కెట్‌లో ఈ కంపెనీ షేర్ ప్రస్తుత ధర రూ.279 వద్ద ఉండగా, త్వరలోనే తన 52 వారాల గరిష్ట స్థాయి రూ.282.50 ని దాటి కొత్త రికార్డులను సృష్టించే దిశగా పయనిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి చమురు ధరల పెరుగుదల అందరికీ శుభవార్త కాదని, స్టాక్ మార్కెట్లో కూడా దీని ప్రభావం రెండు రకాలుగా ఉంటుందని అంటున్నారు. చమురు ధరల వల్ల ONGC, ఆయిల్ ఇండియా వంటి చమురు ఉత్పత్తి కంపెనీలు లాభపడిన, IOCL, BPCL, HPCL వంటి కంపెనీలు నష్టపోతాయని చెప్పారు. ఎందుకంటే ఇవి ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేస్తాయి కాబట్టి, ముడి చమురు ధర పెరిగితే వీటి లాభాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!