Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Poori Recipe: ప్రతిరోజూ ఇడ్లీ లేదా దోశ తిని బోర్ కొడుతుందా..? బ్రేక్ ఫాస్ట్ లో ఏదైనా కొత్తగా, అదే సమయంలో హెల్దీగా ట్రై చేయాలనుకుంటున్నారా..? ఇంకెందుకు ఆలశ్యం.. ఓ సారి ‘రాగి పిండి పూరీ’ చేసేసి వావ్ అనిపించుకోండి. రాగుల్లో ఉండే క్యాల్షియం, ఐరన్ మన శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. చిన్న చిన్న టెక్నిక్స్‌తో రాగి పూరీలను మెత్తగా, పొంగేలా ఎలా చేయాలో.. వాటిలోకి అదిరిపోయే బంగాళదుంప చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సాధారణ పూరీల కంటే ఇవి చాలా రుచిగా ఉండటమే కాకుండా, నూనె తక్కువగా పీల్చుకుంటాయి. రాగి పిండితో పూరీలు చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే, ప్రతి పూరీ కూడా బంతిలా పొంగుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటో, తయారీ ప్రాసెస్ ఏంటో చూద్దాం..
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Roslin: దృశ్యం డైరెక్టర్ నుండి మరో థ్రిల్లర్.. ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మీనా ‘రోజలిన్’!
రాగి పూరీ పిండి కోసం:
* రాగి పిండి: 1 కప్పు
* గోధుమ పిండి: 1 కప్పు
* బొంబాయి రవ్వ (సూజి): 2-3 టీస్పూన్లు
* ఉప్పు: రుచికి సరిపడా
* నూనె: 1 టీస్పూన్ (పిండి కలపడానికి), వేయించడానికి సరిపడా
* నీళ్లు: తగినన్ని (పిండి కలపడానికి)
పూరీ చట్నీ / కర్రీ కోసం:
* బంగాళదుంపలు: 2 (ఉడికించినవి)
* ఉల్లిపాయలు: 1 పెద్దది (పొడవుగా కట్ చేసినవి)
* పచ్చిమిర్చి: 4 (కారం తగ్గట్టుగా)
* అల్లం: చిన్న ముక్క (సన్నగా తరిగినవి)
* శనగపిండి: 2 టేబుల్ స్పూన్లు (చిక్కదనం కోసం)
* కరివేపాకు, కొత్తిమీర
* నిమ్మరసం: అర చెక్క
* పసుపు: పావు టీస్పూన్
* ఉప్పు: రుచికి సరిపడా
తాలింపు కోసం:
* నూనె: 2 టీస్పూన్లు
* ఆవాలు: అర టీస్పూన్
* జీలకర్ర: అర టీస్పూన్
* శనగపప్పు: 1 టీస్పూన్
* మినప్పప్పు: 1 టీస్పూన్
పూరీల కోసం పిండి తయారీ:
ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని జల్లెడ పట్టాలి. గోధుమ పిండి కలపడం వల్ల పూరీలకు మంచి టేస్ట్, టెక్స్చర్ వస్తాయి. పూరీలు పొంగిన తర్వాత మెత్తబడకుండా ఉండాలంటే.. అందులో రెండు మూడు టీస్పూన్ల బొంబాయి రవ్వ (సూజి), తగినంత ఉప్పు కలపాలి. ఇందులో నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ పిండిని మరీ మెత్తగా కాకుండా.. కొంచెం గట్టిగా (సెమీ సాఫ్ట్) కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పూరీలు నూనెను తక్కువగా పీల్చుకుంటాయి. చివరగా కొంచెం నూనె రాసి, 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి. దీనివల్ల రవ్వ బాగా నాని పిండి సెట్ అవుతుంది.
VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!
పూరీ చట్నీ (కర్రీ) తయారీ:
హోటల్‌లో ఇచ్చే కమ్మని పూరీ చట్నీని సులభంగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం మొదట ఓ బాణలిలో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. అందులోనే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఇందులో ఉడికించిన రెండు బంగాళదుంపలను చేత్తో మెదిపి వేసి, పసుపు, ఉప్పు కలిపి రెండు నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత సుమారు రెండు గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగించాలి.
అలా చేసిన తర్వాత రెండు స్పూన్ల శనగపిండిని నీళ్లలో కలిపి, ఉండలు లేకుండా ఈ కర్రీలో పోస్తూ కలపాలి. ఇది చిక్కబడే వరకు 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం కలిపితే కమ్మని చట్నీ సిద్ధం.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!