Exclusive : మహేశ్ బాబు – సందీప్ రెడ్డి వంగా సినిమా ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7 విడుదల కానుంది. రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మహేశ్ సినిమా ఏంటనే టాపిక్ అటు ఫ్యాన్స్ లోను ఇటు ట్రేడ్ వర్గాలలోను ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ లోని బడా నిర్మాతలు మహేశ్ తో సినిమా చేసేందుకు ఇటీవల ఆయనను కలిసి చర్చలు జరిపారు.
Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంతో డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ
Also Read
విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేశ్ నెక్ట్స్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత క్రేజీ కాంబినేషన్ లోనే ఫిక్స్ అయింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు- సందీప్ రెడ్డి వంగా కలయికలో సినిమా ఫిక్స్ అయింది. టాలీవుడ్ బడా నిర్మాత ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు ముగిశాయని ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వారణాసి ముగిసిన వెంటనే సందీప్ రెడ్డి వంగా సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సందీప్ ఇప్పటికే మహేశ్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, ఇది మహేశ్ మునుపెన్నడూ చేయని ఒక మాస్ అండ్ ఇంటెన్స్ రోల్ అని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో హీరోలను చూపించే విధానం అత్యంత వైల్డ్ గా ఉంటుంది. మరోవైపు మహేశ్ బాబు క్లాస్ మరియు మాస్ అప్పీల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, మహేశ్ బాబు మధ్య ఉన్న వ్యాపార అనుబంధం (AMB సినిమాస్) ఈ ప్రాజెక్ట్ వేగంగా ఓకే అవ్వడానికి ఒక ప్రధాన కారణమని సమాచారం.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?