Flaxseed Podi: బరువు తగ్గాలా? జుట్టు ఒత్తుగా పెరగాలా? అయితే రోజుకో ముద్ద ఈ పొడి తినాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flaxseed Podi: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. దీనివల్ల స్థూలకాయం, జుట్టు రాలడం వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. అయితే, పూర్వీకుల కాలం నాటి కొన్ని ఆహార పదార్థాలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వాటిలో ‘అవిస గింజలు’ (Flaxseeds) అగ్రస్థానంలో నిలుస్తాయి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ ‘అవిస గింజల కారప్పొడి’ విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PAK vs SL: చరిత్ర సృష్టించిన పాక్ స్టార్ బ్యాటర్.. విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డ్ బద్ధలు..
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
పోషకాల గని..
అవిస గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ప్రోటీన్ శాతం అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో తెలివితేటలు, ఎముకల బలానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. కేవలం ఆరోగ్యమే కాదు, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అమృతంగా ఉండే ఈ కారప్పొడిని సులభంగా తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం..
ముందుగా ఒక కప్పు అవిస గింజలను సన్నటి సెగ మీద చిటపటలాడే వరకు కమ్మటి వాసన వచ్చేలా వేయించుకోవాలి. ఆ తర్వాత అర కప్పు నువ్వులు, పావు కప్పు ధనియాలు, ఒక గుప్పెడు కరివేపాకును వేర్వేరుగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. కారానికి తగినట్లుగా 20-25 ఎండుమిర్చిని తుంచి వేయించుకోవాలి. ఆపై రెండు టేబుల్ స్పూన్ల చొప్పున పచ్చి శెనగపప్పు, మినప్పప్పు వేయించి, చివరగా కొంచెం జీలకర్ర, అర టీస్పూన్ మెంతులు, కొద్దిగా చింతపండు వేసి వేడి చేయాలి. వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకుని.. తగినంత ఉప్పు, పావు టీస్పూన్ ఇంగువ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి పూర్తయ్యాక 15 వరకు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా వేసి పల్స్ మోడ్‌లో ఒక్కసారి తిప్పితే గుమగుమలాడే అవిస పొడి సిద్ధమవుతుంది.
ఈ పొడిని గాలి చొరబడని సీసాలో భద్రపరిస్తే రెండు నెలల వరకు తాజాగా ఉంటుంది. రోజువారీ భోజనంలో మొదటి రెండు మూడు ముద్దలు ఈ పొడితో తింటే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా, వయస్సు పైబడకుండా (Anti-aging) కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం? వంటింటినే వైద్యశాలగా మార్చుకుంటూ, ఈ రుచికరమైన ఆరోగ్య పొడిని మీరు కూడా ప్రయత్నించండి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు