Israel vs Iran: ఇరాన్ క్షిపణి వర్షానికి ఇజ్రాయెల్ అజేయ రక్షణ కవచం తట్టుకుంటుందా? యుద్ధంలో ఎవరి బలమెంత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel vs Iran: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఆందోళనకు దారితీస్తున్నాయి. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు, దానికి ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణి వర్షం కురిపించడంతో ‘ప్రాంతీయ యుద్ధం’ ముంగిట ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల సైనిక బలబలాలు, ఆయుధ సంపత్తి ఎంత అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో సంచలనం.. కెప్టెన్‌పై వేటు.. బాబర్‌కు బైబై.. జట్టులో ఊచకోతలు!
Also Read
- Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్..
ప్రస్తుత యుద్ధ రంగంలో ఇజ్రాయెల్ ‘వాయు ఆధిపత్యం, అత్యాధునిక సాంకేతికత’పై ఆధారపడుతుంటే, ఇరాన్ తన ‘అపారమైన క్షిపణి నిల్వలు, మానవశక్తి’ని నమ్ముకుంది. 2026 గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ ప్రకారం.. ఇజ్రాయెల్ 15వ స్థానంలో, ఇరాన్ 16వ స్థానంలో ఉన్నాయి. 88 మిలియన్ల జనాభా కలిగిన ఇరాన్‌కు దాదాపు 6.1 లక్షల మంది యాక్టివ్ సైనికులు, 2.2 లక్షల పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు. కేవలం 9.4 మిలియన్ల జనాభా ఉన్నప్పటికీ, 1.7 లక్షల మంది యాక్టివ్ సైనికులతో పాటు 4.6 లక్షల మంది సుశిక్షితులైన రిజర్వ్ ఫోర్స్ ఇజ్రాయెల్ సొంతం.
రక్షణ వ్యయం & భౌగోళిక వ్యూహం..
ఇజ్రాయెల్ తన రక్షణ కోసం ఏటా $34.6 బిలియన్లు ఖర్చు చేస్తుండగా, ఇరాన్ కేవలం $9.23 బిలియన్లు మాత్రమే వెచ్చిస్తోంది. ఈ నిధుల అంతరమే ఇజ్రాయెల్‌ను టెక్నాలజీలో ముందుంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ 1.6 మిలియన్ చ.కి.మీ విస్తీర్ణంతో పెద్ద దేశం కావడం వల్ల ఆస్తులను సురక్షితంగా దాచుకునే వీలుంది. ఇజ్రాయెల్ చిన్న దేశం (22,000 చ.కి.మీ) కావడంతో, క్షిపణి రక్షణ వ్యవస్థలే దాని ప్రాణవాయువు అని చెబుతున్నారు.
స్టెల్త్ జెట్స్ వర్సెస్ పాత తరం విమానాలు..
ఇజ్రాయెల్ వద్ద F-35I ‘అడిర్’ వంటి అత్యాధునిక స్టెల్త్ ఫైటర్లు ఉన్నాయి, ఇవి రాడార్లకు చిక్కకుండా దాడి చేయగలవు. గాలిలోనే ఇంధనం నింపే వ్యవస్థ ఉండటంతో సుదూర లక్ష్యాలను ఇజ్రాయెల్ వాయుసేన సులభంగా ఛేదించగలదు. ఆంక్షల వల్ల ఇరాన్ వద్ద పాతకాలపు సోవియట్ లేదా US విమానాలే ఉన్నాయి. అందుకే ఇరాన్ తన వాయుశక్తి లోటును డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల ద్వారా భర్తీ చేస్తోంది. ఇరాన్ అమ్ములపొదిలో 3,000 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. షహాబ్-3, ఖేబర్ షెకాన్, ఫట్టా-1 (హైపర్‌సోనిక్) వంటి క్షిపణులు 2,000 కి.మీ దూరంలోని లక్ష్యాలను తాకగలవు. వీటి పరిధిలోకి ఇజ్రాయెల్‌తో పాటు యూరోపియన్ దేశాలు కూడా వస్తాయి. అలాగే ఇజ్రాయెల్ వద్ద ఉన్న జెరిఖో-3 క్షిపణి అత్యంత శక్తివంతమైనది. అంతేకాకుండా, సుమారు 90 అణ్వాయుధాలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నట్లు అంతర్జాతీయ సమాజం భావిస్తోంది.
ఇదే సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ త్రిస్థాయి రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతం. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఐరన్ డోమ్ అనేది స్వల్ప శ్రేణి రాకెట్ల కోసం అత్యున్నత ఆయుధంగా పని చేస్తుంది. డేవిడ్స్ స్లింగ్.. ఇది మధ్యస్థ క్షిపణుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. యారో (Arrow).. ఇది సుదూర బాలిస్టిక్ క్షిపణుల కోసం తయారు చేశారు. ఇరాన్ విషయానికి వస్తే.. ఈ దేశం రష్యా నుంచి పొందిన S-300, స్వదేశీ తయారీ క్షిపణి రక్షణ వ్యవస్థలను నిర్వహిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే.. ఇరాన్ ప్రధాన బలం దాని ‘సంఖ్యా బలం, విస్తారమైన క్షిపణి నిల్వలు’. ఇజ్రాయెల్ బలం దాని ‘ప్రెసిషన్ (కచ్చితత్వ) దాడులు, అజేయమైన రక్షణ వ్యవస్థ’. ఈ రెండు శక్తుల మధ్య పోరు ఏ దశకు చేరుతుందనేది ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించనుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Ajit Pawar Plame crash: అజిత్ పవార్ విమానం ఎలా కుప్పకూలింది.? AAIB సంచలన నివేదిక..
తాజావార్తలు
-
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!