Viral Video: ఛీ.. ఛీ.. ఇంత గలీజుగా ఉన్నారేంట్రా.. సె*క్స్ చేస్తావా అంటూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో కొన్ని వందల రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము. ఇందులో చాలావరకు అవసరం లేని విషయాలు కనబడుతుంటాయి. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే అవసరం అయ్యే విషయాలపై వీడియోలు కనిపిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక క్యాబ్ డ్రైవర్ సంబంధించిన వీడియో హల్చల్ చేస్తుంది. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో క్యాబ్ డ్రైవర్‌కు కస్టమర్ పంపిన అసభ్య మెసేజ్ నెటిజన్లను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ఇంతకీ అంతలా ఆ వీడియోలో ఏమున్నదనే కదా మీ అనుమానం.. అసలు ఏం జరిగిందంటే.. విశాల్ అనే క్యాబ్ డ్రైవర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం ఒక కస్టమర్ ఆలయానికి వెళ్లడానికి క్యాబ్ రైడ్ బుక్ చేశారు. రైడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ కస్టమర్ డ్రైవర్‌కు వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడడం వీడియోలో కనిపిస్తోంది. రైడ్ బుక్ చేసిన ఆ కస్టమర్ డ్రైవర్ కు మెసేజ్ చేస్తూ.. “హలో బ్రో.. సె*క్స్ చేస్తావా..? ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నంబర్ షేర్ చెయ్” అంటూ సిగ్గులేకుండా మెసేజ్ చేయడం కనపడుతుంది.
అయితే క్యాబ్ డ్రైవర్ ఆ అభ్యర్థనను తిరస్కరించగా.. కస్టమర్ వెంటనే రైడ్‌ను క్యాన్సిల్ చేసేశాడు. ఈ ఘటనపై డ్రైవర్ ఆవేదన చెందాడు. ఇంతకుముందు ఇలాంటివి కేవలం బైక్ టాక్సీ డ్రైవర్లకే ఎదురయ్యేవని, కానీ ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లకు కూడా తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయం ఒకవేళ డ్రైవర్ ప్యాసింజర్కు పంపి ఉంటే కంపెనీ వెంటనే చర్యలు తీసుకుంటుందని, కానీ డ్రైవర్లకు ఇలాంటివి ఎదురైతే కంపెనీలు పట్టించుకోవడం లేదంటూ తన బాధను వెల్లడించాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను చూసినవారు డ్రైవర్లతో ఇలాంటి అనుచిత ప్రవర్తన చేయడం తప్పని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో కస్టమర్ల భద్రత మాత్రమే కాకుండా.. క్యాబ్ డ్రైవర్ల భద్రత, కస్టమర్ల ప్రవర్తన వంటి అంశాలను కూడా చర్చకు దారితీసింది.
What is happening these days? It's a new type of scam or our society is misusing the technology
An Uber driver in Gurugram has shared a video alleging that he received an inappropriate message from a passenger during a ride.
Screenshots shown in the clip include a disturbing… pic.twitter.com/nxSbTcIDOO— Karnataka Portfolio (@karnatakaportf) February 13, 2026
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?