Diabetes Test : షుగర్ టెస్ట్ మోసమా? లాన్సెట్ అధ్యయనంలో నమ్మలేని నిజాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశాన్ని పట్టిపీడిస్తోన్న సమస్యల్లో డయాబెటిస్ వ్యాది ఒకటి. దాదాపు 9 కోట్ల మంది డయాబెటిస్‌తో జీవిస్తున్న దేశం ఇది. ప్రతి పరీక్షలో, ప్రతి హెల్త్ క్యాంప్‌లో, ప్రతి రిపోర్ట్‌లో ఒకే టెస్ట్ పేరు కనిపిస్తుంది. అదే HbA1c. అయితే లాన్సెట్ రీజినల్ హెల్త్‌లో ఫిబ్రవరి 9న ప్రచురితమైన అధ్యయనం ఒక హెచ్చరిక జారీ చేసింది. భారత్ లాంటి దేశాల్లో రక్తహీనత, జన్యుపరమైన రక్తవ్యాధులు ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం HbA1c టెస్ట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమట. ఇంతకీ HbA1c టెస్ట్‌లో సమస్య ఎక్కడుంది? భారతీయుల విషయంలో ఈ టెస్ట్ ఎందుకు ప్రశ్నార్థకంగా మారింది?
రెండు నుంచి మూడు నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయిని కొలిచే పరీక్షను HbA1c అంటారు. రక్తంలోని హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్‌పై గ్లూకోజ్ ఎంత శాతం అంటుకుందో సే పరీక్ష ఇది.
సాధారణంగా 5.7శాతం కంటే తక్కువ ఉంటే నార్మల్‌గా భావిస్తారు. 5.7 నుంచి 6.4 శాతం మధ్య ఉంటే ప్రీడయాబెటిస్‌గా, 6.5 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్‌గా నిర్ధారిస్తారు. సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఈ పరీక్ష పూర్తిగా హీమోగ్లోబిన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే రక్తహీనత బాధితులు ఎక్కువగా ఉన్న దేశం ఇండియా. కొన్ని ప్రాంతాల జనాభాలో సగానికి పైగా మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హీమోగ్లోబిన్ పరిమాణం లేదా దాని జీవితకాలం మారిపోతే HbA1c రీడింగ్ తప్పుగా రికార్డయ్యే అవకాశం ఉంటుంది.
Also Read
లాన్సెట్ రీజినల్ హెల్త్‌లో ప్రచురితమైన ఈ రివ్యూకు ప్రొఫెసర్ అనూప్ మిశ్రా నేతృత్వం వహించారు. ఆయన ప్రకారం కేవలం HbA1c ఆధారంగా డయాబెటిస్ నిర్ధారణ చేస్తే కొంతమంది రీడింగ్ తప్పుగా రావొచ్చు. మరికొందరికి అసలు షూగర్ లేకపోయినా డయాబెటిస్‌గా ట్యాగ్ పడే ప్రమాదం ఉంది. ఇది చికిత్స ప్రారంభంలోనే గందరగోళం సృష్టిస్తుంది.
ఇక హీమోగ్లోబిన్ నిర్మాణాన్ని ప్రభావితం చేసే జన్యుపరమైన వ్యాధులు కూడా భారత్‌లో కనిపిస్తాయి. థలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, జీ6పిడీ లోపం లాంటి పరిస్థితుల్లో ఎర్ర రక్త కణాల జీవితం తక్కువగా ఉండొచ్చు లేదా వాటి నిర్మాణం మారిపోవచ్చు. అప్పుడు HbA1c విలువలు నిజమైన చక్కెర స్థాయిని కొలవకపోవచ్చు. లెక్కల ప్రకారం భారత్‌లో సుమారు 9 కోట్ల మంది డయాబెటిస్‌తో జీవిస్తున్నారు. అదే సమయంలో కోట్లాది మంది రక్తహీనతతో కూడా బాధపడుతున్నారు. ఈ రెండు పరిస్థితులు కలిసినప్పుడు HbA1c మీద మాత్రమే ఆధారపడటం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరొక అంశం ల్యాబ్ నాణ్యత. దేశవ్యాప్తంగా అన్ని ప్రయోగశాలల్లో ఒకే స్థాయి ప్రమాణాలు ఉండవు. క్వాలిటీ కంట్రోల్ లోపిస్తే HbA1c విలువల్లో తేడాలు రావచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఓవరాల్‌గా చూస్తే HbA1cతో పాటు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ లాంటివి చేయడం తప్పనిసరి అని ఈ అధ్యయనం చెబుతోంది.
ALSO READ: మంచు కొండల నుంచి కారుతున్న రక్తం.. ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రకృతి రహస్యం!
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు