Heroines: స్టార్‌డమ్ ఇచ్చిన తెలుగు సినిమా అంటే హీరోయిన్లకు ఎందుకంత లోకువ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్.. రంగుల ప్రపంచం, ఇక్కడ ఒక్క సినిమా హిట్ అయితే చాలు, రాత్రికి రాత్రే స్టార్లు అయిపోవచ్చు. కోట్లాది మంది అభిమానం, అంతకు మించిన ఆదాయం, గౌరవం అన్నీ ఇక్కడ దక్కుతాయి. ముఖ్యంగా ఇతర భాషల నుంచి వచ్చే హీరోయిన్లకు తెలుగు పరిశ్రమ అండగా నిలిచి, వారిని గ్లామర్ క్వీన్లుగా మారుస్తుంది. కానీ, తీరా ఇక్కడ స్టార్‌డమ్ వచ్చాక, బాలీవుడ్‌కు వెళ్లగానే కొందరు భామలకు ‘ఏరు దాటాక తెప్ప తగలేయడం’ అలవాటుగా మారింది. అన్నం పెట్టిన ఇండస్ట్రీపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝమ్మందినాదం’తో వెండితెరకు పరిచయమైంది తాప్సీ. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈమె, బాలీవుడ్ వెళ్ళాక ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. తన నాభిపై టెంకాయ విసిరిన సీన్ గురించి ఎగతాళిగా మాట్లాడటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత వివరణ ఇచ్చుకుని సారీ చెప్పినప్పటికీ, ఇటీవల ‘ప్యాడెడ్ బ్రా’ ధరించమని సౌత్ మేకర్స్ ఒత్తిడి చేసేవారంటూ మరోసారి నెగిటివ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
Also Read:The Kerala Story 2: రేపు “కేరళ స్టోరీ 2″ని చూడనున్న హైకోర్టు.. ఆ తర్వాతే నిర్ణయం..
అయితే హిందీ సినిమాలతోనే నటిగా అడుగుపెట్టినా, రాధికా ఆప్టేకు బ్రేక్ ఇచ్చింది మాత్రం వర్మ తీసిన ‘రక్తచరిత్ర’. బాలయ్యతో ‘లెజెండ్’, రజనీకాంత్ సరసన ‘కబాలి’ వంటి భారీ చిత్రాల్లో నటించి పేరు సంపాదించుకుంది. కానీ, స్టార్‌డమ్ వచ్చాక మాత్రం సౌత్ హీరోల బాడీ లాంగ్వేజ్‌పై, ఇక్కడి పద్ధతులపై ఆమె చేసిన విమర్శలు హాట్ టాపిక్‌గా మారాయి. కేవలం ఆర్థిక పరిస్థితి బాగోకనే కెరీర్ మొదట్లో సౌత్ సినిమాలు చేశానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రేక్షకులను నొచ్చుకునేలా చేశాయి.
టాలీవుడ్‌లో ‘బుట్టబొమ్మ’గా వెలిగిపోయిన పూజా హెగ్డే కూడా ఒకానొక సమయంలో దక్షిణాది ప్రేక్షకుల ఆసక్తి కేవలం నాభి, నడుముపైనే ఉంటుందంటూ కామెంట్స్ చేసి విమర్శల పాలైంది. ఇక గోవా బ్యూటీ ఇలియానా కథ అయితే మరీ విచిత్రం. తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్‌గా రికార్డు సృష్టించిన ఈమె, బాలీవుడ్ వెళ్ళాక నడుము అందాలు చూపించలేకే తెలుగు సినిమాలకు దూరమయ్యానంటూ వ్యాఖ్యానించింది. మరి బాలీవుడ్‌లో అంతకంటే ఎక్కువ గ్లామర్ ప్రదర్శించడంపై నెటిజన్లు ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.
Also Read:Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘స్పిరిట్’లో డాన్ లీ క్యామియో? మార్చి 1న అప్‌డేట్ వస్తోందా!
పేరు, హోదా ఇచ్చిన ఇండస్ట్రీని చులకన చేయడంపై సినీ విశ్లేషకులు మండిపడుతున్నారు. కోట్లు కుమ్మరించిన టాలీవుడ్‌ను కించపరచడం హీరోయిన్ల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు విమర్శలు రావడం సహజం. కానీ, ఏ పరిశ్రమ అయితే లైఫ్ ఇచ్చిందో, ఏ ప్రేక్షకులయితే నెత్తిన పెట్టుకుని చూసుకున్నారో.. వారిని తక్కువ చేసి మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఏరు దాటాక తెప్ప తగలేయడమనే సామెతను నిజం చేస్తున్న ఈ భామలు, ఇప్పటికైనా తమ ధోరణి మార్చుకుంటారేమో చూడాలి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!