Ragi Barfi Recipe: రుచితో పాటు పోషకాలు.. హోమ్ మేడ్ ‘రాగి బర్ఫీ’ ఎలా చేయాలంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Barfi Recipe : రాగి అనేది మన సంప్రదాయ ఆహారాలలో ఎంతో ప్రాధాన్యం కలిగింది. శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే రాగి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు తీసుకుంటే ఎముకలు బలపడటానికి, రక్తహీనత తగ్గడానికి సహాయపడుతుంది. ఇలాంటి పోషక విలువలతో కూడిన రాగిని రుచికరమైన స్వీట్‌గా తయారు చేస్తే మరింత ఇష్టంగా తినవచ్చు. బెల్లంతో చేసిన రాగి బర్ఫీ నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ, ఆరోగ్యంతో పాటు రుచిని కూడా అందిస్తుంది. ఇంట్లో సులభంగా.. తక్కువ పదార్థాలతో తయారుచేసుకునే ఈ రాగి బర్ఫీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
TVS Apache RTR 200 vs Bajaj Pulsar NS200: పవర్, స్టైల్, బడ్జెట్.. ఏది బెస్ట్?
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
రాగి బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు:
* రాగి పిండి – 1 కప్పు
* బెల్లం తురుము – 1 కప్పు
* నెయ్యి – అర కప్పు (అవసరాన్ని బట్టి)
* యాలకుల పొడి – అర టీస్పూన్
* నీళ్లు – 2 కప్పులు
* డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం) – తగినన్ని
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక ఒక కప్పు రాగి పిండిని వేసి పచ్చివాసన పోయే వరకు, మంచి సువాసన వచ్చేలా తక్కువ మంటపై 5 నుండి 8 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరో పక్కన ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం తురుము, రెండు కప్పుల నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు మరిగించాలి. దీనికి ముదురు పాకం అవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
Ayesha Meera: శ్మశాన వాటికలో ఆయేషా మీరా అవశేషాల ఖననం.!
వేయించిన రాగి పిండిలో సిద్ధం చేసుకున్న బెల్లం నీటిని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. మంటను సిమ్ లోనే ఉంచి ఈ మిశ్రమం దగ్గరపడే వరకు ఉడికించాలి. మిశ్రమం ఉడుకుతున్నప్పుడు మధ్యమధ్యలో నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉండాలి. దీనివల్ల బర్ఫీకి మంచి రుచి వస్తుంది. మిశ్రమం పాన్ నుండి వేరుపడుతున్న సమయంలో యాలకుల పొడిని వేసి కలపాలి. ఒక ప్లేట్ కు నెయ్యి రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. రాగి మిశ్రమం చిక్కబడి ముద్దలా తయారైనప్పుడు, ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమానంగా సర్దాలి. పైన గార్నిషింగ్ కోసం వేయించిన జీడిపప్పు లేదా బాదం పలుకులను చల్లుకోవచ్చు. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి బర్ఫీ సిద్ధం. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో మేలు చేస్తుంది.
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!