Vishnu Vinyasam: విష్ణు విన్యాసం లీక్.. బిగ్ మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘విష్ణు విన్యాసం’ సినిమా గురించిన చర్చలే నడుస్తున్నాయి, అయితే ఇది సినిమా విజయం గురించి కాదు, దాని వెనుక జరిగిన కొన్ని దిగ్భ్రాంతికరమైన పరిణామాల గురించి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం విడుదలకు ముందు చిత్ర యూనిట్ ఊహించని విపత్తును ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ హాఫ్ మొత్తం లీక్ అయ్యిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది, చిత్ర యూనిట్‌కు చెందిన ఒక వ్యక్తి ద్వారానే ఈ ఫుటేజ్ బయటకు వెళ్లినట్లు సమాచారం. ఈ వీడియోను దక్కించుకున్న చెన్నైకి చెందిన కొందరు బ్లాక్‌మెయిలర్లు, గత ఫిబ్రవరి వరకు నిర్మాతలను భారీ స్థాయిలో డబ్బుల కోసం వేధించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ లీకు వ్యవహారం బయటకు వస్తే సినిమా బిజినెస్ దెబ్బతింటుందని భావించిన నిర్మాతలు, ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.
Also Read : Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి మోహన్ బాబు లుక్ వైరల్!
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
బ్లాక్‌మెయిలర్ల బెదిరింపులు ఒకవైపు, లీకైన కంటెంట్ సోషల్ మీడియాలోకి వస్తుందనే భయం మరోవైపు ఉండటంతో.. చిత్ర యూనిట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన టీమ్, మిగిలి ఉన్న 20 రోజుల షూటింగ్‌ను కేవలం 7 రోజుల్లోనే పూర్తి చేసిందట. సాధారణంగా ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఉంటే ఖచ్చితంగా గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. కానీ ‘విష్ణు విన్యాసం’ విషయంలో మాత్రం మేకర్స్ మరో ఆలోచన లేకుండా శ్రీవిష్ణు నటించిన మరో సినిమా మృత్యుంజయ్ తో పోటీ పడి మరీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దీనికి ప్రధాన కారణం లీక్ అయిన ఫుటేజ్ బయటకు రాకముందే థియేటర్లలో సినిమాను ప్రదర్శించాలనే ఆరాటమేనని తాజా వ్యాఖ్యలతో వెల్లడైంది. ఈ గందరగోళం వల్లే బాక్సాఫీస్ వద్ద అనవసరమైన క్లాష్ ఏర్పడిందని సమాచారం. మొత్తానికి, వెండితెరపై విన్యాసాలు చేయాల్సిన ఈ సినిమా, తెర వెనుక ఇన్ని కష్టాలను దాటుకుని రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!