Kakinada Fire Accident: 20 మంది సజీవ దహనం.. పేలుడు ధాటికి చెల్లాచెదురుగా మృతదేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada Fire Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో 20 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేట్లపాలెంలోని ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సుమారు 35 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. మంటలు క్షణాల్లోనే యూనిట్ అంతటా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటివరకు 20 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతుండగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ శబ్దంతో జరిగిన ఈ పేలుడు వల్ల భవనం పూర్తిగా ధ్వంసమైంది.
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ యూనిట్‌కు భారీగా బాణసంచా ఆర్డర్లు వచ్చాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు నిర్వాహకులు సాధారణం కంటే ఎక్కువ మంది కార్మికులను పెట్టి పనులు చేయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో రసాయనాలను నిల్వ ఉంచడం లేదా తయారీ సమయంలో జరిగిన అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో వేట్లపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!