Pakistan vs Sri Lanka: టాస్ గెలిచిన శ్రీలంక.. బాబర్ ఔట్.. పాకిస్థాన్ జట్టులో ఊహించని మార్పులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs Sri Lanka: టీ20 ప్రపంచ కప్ సూపర్-8 గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. డూ ఆర్ డై మ్యాచ్‌లో పాక్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. శ్రీలంక సొంత గడ్డ పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించాలి. ఈ మ్యాచ్‌లో ఒక వేళ శ్రీలంక గెలిస్తే నెట్‌రన్‌రేట్‌తో సంబంధం లేకుండా న్యూజిలాండ్ డైరెక్ట్‌గా సెమీస్‌కు చేరనుంది.
READ MORE: Dubai Airport: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్‌పోర్ట్ షట్ డౌన్..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
అయితే.. పాకిస్థాన్ జట్టులో ఊహించని మార్పులు చేసింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను జట్టులో నుంచి తప్పించడం పెద్ద సంచలనంగా మారింది. ఇటీవల బాబర్ ఫామ్‌పై విమర్శలు వస్తుండగా, మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. బాబర్‌తో పాటు సైమ్ అయూబ్, సల్మాన్ మిర్జాను సైతం లేపేసింది. వారి స్థానాల్లో నసీమ్ షా, ఖ్వాజా నఫాయ్, అబ్రార్ అహ్మద్‌లకు అవకాశం ఇచ్చింది. ఈ కీలక మ్యాచ్ ముందు భారీ మార్పులు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు.. శ్రీలంక సైతం రెండు మార్పులు చేసింది. కుశల్ మెండిస్, దుశాన్ హెమంతలకు విశ్రాంతి ఇచ్చి కమిల్ మిశారా, జనిత్ లియనేజ్‌లకు అవకాశం కల్పించింది. క ప్టెన్ దసున్ షనాకా సారథ్యంలో లంక జట్టు సమతూకంగా కనిపిస్తోంది.
పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్: సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), ఖ్వాజా నఫాయ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ ఆఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.
శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్: పతుం నిస్సంక, కమిల్ మిశారా (వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనాకా (కెప్టెన్), జనిత్ లియనేజ్, దునిత్ వెల్లాలగే, మహీష్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మదుశంక.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!