Stocks India 2026: అదృష్టం అంటే ఇదే.. రూ.8 షేరు.. రూ.2,887 కు జంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stocks India 2026: స్టాక్ మార్కెట్‌లో కొన్ని షేర్లు ఇన్వెస్టర్ల తలరాతను పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణమే సిటీ పల్స్ మల్టీవెంచర్స్ లిమిటెడ్. గత ఐదేళ్లలో ఈ స్టాక్ అందించిన రాబడి చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. అయితే, భారీ లాభాలతో పాటు ఇందులో రిస్క్ కూడా పొంచి ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం.. ఏ దేశం ఏ వైపు..
Also Read
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
లక్ష పెట్టుబడి.. రూ.3.5 కోట్ల లాభం!
2021 ఏప్రిల్ సమయంలో ఈ కంపెనీ షేరు ధర కేవలం రూ.8 వద్ద ఉండేది. అప్పట్లో ఎవరైనా ఒక రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు (ఫిబ్రవరి 2026 నాటికి) దాని విలువ సుమారు రూ.3.50 కోట్లుగా మారేది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.2,887 వద్ద ట్రేడవుతోంది. అంటే కేవలం ఐదేళ్లలోనే దాదాపు 31,900 శాతం పెరుగుదలను నమోదు చేసి, అసలైన మల్టీబ్యాగ్గర్‌గా నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా రూ.3,000 కోట్లు దాటడం విశేషం.
వినోద రంగం నుంచి డిజిటల్ వైపు..
2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ తొలుత గుజరాత్‌లో ‘WOW సినీ పల్స్’ బ్రాండ్ కింద మల్టీప్లెక్స్‌లు, సినిమా పంపిణీ, నిర్మాణ రంగంలో రాణించింది. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా తన వ్యాపార శైలిని మార్చుకుంటోంది. స్వంతంగా WOWPLEX అనే OTT యాప్‌ను నిర్వహిస్తోంది. థియేటర్ల నుంచి ఆన్‌లైన్ కంటెంట్, డిజిటల్ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారిస్తోంది. సిటీ పల్స్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. తన వ్యాపారాన్ని విభిన్న రంగాలకు విస్తరించింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్వహణ, డిజిటల్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, ప్రతిష్టాత్మక గిఫ్ట్ సిటీ ప్రాజెక్టులలో భాగస్వామ్యం వంటి వాటికి తన రంగాలను విస్తరించింది.
మార్చి 7న కీలక నిర్ణయం..
ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు మరో శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మార్చి 7, 2026న బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ (వాటాల విభజన) గురించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రకటన వస్తే స్టాక్‌లో మరింత కదలిక వచ్చే అవకాశం ఉంది.భారీ లాభాలు కనిపిస్తున్నా, కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలని విశ్లేషకులు చెబుతున్నారు. 2024 మార్చిలో 38.52% గా ఉన్న ప్రమోటర్ల వాటా, 2025 సెప్టెంబర్ నాటికి 11.98% కి పడిపోయింది. సాధారణ ఇన్వెస్టర్ల వాటా 88.01% కి పెరిగింది. సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs/DIIs) ఇందులో చాలా తక్కువగా ఉన్నారు.
డిస్క్లైమర్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.
READ ALSO: IPL 2026 : క్రికెట్ పండగకు ముహూర్తం ఖరారు.. కానీ చిన్న ట్విస్ట్!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!