VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VFX vs AI: ప్రస్తుత కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోలు నిజామా? లేక VFX ఆ? లేక ఏఐ ఆ? అని తెలుసుకొనేందుకు చాలా కష్టమైంది. ఎందుకంటే తెచ్మోలోజి ఆ రేంజ్ లో పెరిగింది. ఈ టెక్నాలజీ పెరగడం మేకర్స్‌కు ఎంత ప్లస్ అయ్యిందో.. ఇప్పుడు అంతే తలనొప్పిగా మారుతోంది. ఒకప్పుడు తెరపై విజువల్స్ అదిరిపోతే “VFX బాగా చేశారు” అనేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
Adulterated Milk: కల్తీ పాల ఘటనలో 11 మంది పరిస్థితి విషమం.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
సినిమాలో ఏ చిన్న విజువల్ అద్భుతం కనిపించినా.. “ఏముందిలే.. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడేసి ఉంటారు” అని ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. దీంతో మన దర్శకులు, హీరోలు “బాబోయ్.. ఇది AI మాయ కాదు, మా కష్టం” అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించిన ఒక ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేసింది. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఫ్యాన్స్‌కు కనువిందుగా అనిపించినా, నెటిజన్లు మాత్రం ఇది పక్కా AI మాయాజాలమని ఫిక్స్ అయిపోయారు. ఈ వీడియో కామెంట్స్ సెక్షన్‌లో వస్తున్న నెగిటివిటీ చూసి టెన్షన్ పడిన మేకర్స్, వెంటనే రంగంలోకి దిగారు. అది నిజంగానే షూట్ చేశామని నిరూపించడానికి ఏకంగా ‘మేకింగ్ వీడియో’ను కూడా విడుదల చేయాల్సి వచ్చిందంటే నమ్మండి. అప్పుడు కానీ జనాలకు క్లారిటీ రాలేదు.
టెక్నాలజీని వాడుకోవడంలో దిట్ట అయిన టాలీవుడ్ జక్కన్నకు కూడా ఈ ఏఐ సెగ తగిలిందనే చెప్పాలి. ‘వారణాసి’ టీజర్ విషయంలో వస్తున్న పుకార్లపై రాజమౌళి కూడా స్వయంగా స్పందించారు. అందులో కనిపించే విజువల్స్ అన్నీ పక్కా ప్లానింగ్ తో చేసిన గ్రాఫిక్ వర్క్ అని క్లారిటీ ఇచ్చారు. అది ఏఐ వర్క్ అంటే.. ఏడదిన్నర పాటు తమ టీమ్ పడిన కష్టాన్ని అవమానించినట్లే అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
MS Dhoni: ధోనికి ఝలక్.. 15 రోజుల్లోగా స్పందించాలంటూ నోటీసులు పంపిన జార్ఖండ్ ప్రభుత్వం!
ఇదే వరుసలో యువ హీరో నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభూ’ సినిమా విషయంలోనూ ఈ చర్చ నడిచింది. దీనిపై నిఖిల్ స్పందిస్తూ.. తమ సినిమా కోసం ఎక్కడా షార్ట్ కట్స్ వెతకలేదని, ఏఐ వాడలేదని తేల్చి చెప్పారు. ప్రతి ఫ్రేమ్ వెనుక వందలాది మంది టెక్నీషియన్ల రక్తం, చెమట ఉన్నాయని, నిజమైన కష్టాన్ని గుర్తించాలని అన్నారు.
తాజావార్తలు
-
OTR: నెల్లూరులో ప్రజారాజ్యం ఫార్ములా ఫాలో అవుతున్న జనసేన..?
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!