ViRosh Wedding: విజయ్-రష్మిక పెళ్లిలో ‘‘పంది కర్రీ’’ ఎందుకు ముఖ్యం.. ఈ సంప్రదాయం ఎలా వచ్చింది.?
- అంగరంగ వైభవంగా విజయ్ దేవరకొండ-రష్మికా మందన్న వివాహం..
- మ్యారేజ్ మెనూలో స్పెషల్ అట్రాక్షన్‌గా ‘‘పంది కర్రీ’’..
- కొడవ సంప్రదాయంతో విడదీయలేని సంబంధం..
- అసలేంటి ఈ కొడవ కల్చర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ViRosh Wedding: టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ కపుల్ పెళ్లి చేసుకున్నారు. బుధవారం ఉదయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. బుధవారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లి హిందూ సంప్రదాయంలోని రెండు పద్ధతుల ప్రకారం జరిగింది. తెలుగు సంప్రదాయంతో పాటు రష్మిక స్వస్థలమైన కొడుకు సంప్రదాయంలో వివాహం జరిగింది.
కొడవ సంప్రదాయంలో భాగం:
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
అయితే, ఈ వివాహ వేడుకల్లో ‘‘పంది కర్రీ(పోర్క్ కర్రీ’’ ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. సాధారణంగా మన వివాహాల్లో ఇలాంటి కర్రీలను మెనూలో పెట్టరు. కానీ విరోష్ పెళ్లిలో మాత్రం ఇది ప్రత్యేకంగా కనిపించింది. దీనికి కారణం ‘‘కొడవ(కూర్గ్) సంప్రదాయం’’. కొడవ సంస్కృతి కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉండే కూర్గ్(కొడగు) జిల్లాలో కేంద్రీకృతమైంది. కొడవ ఒక ప్రత్యేక సంస్కృతి. ఈ జాతికి చెందిన వారు యుద్ధ కళలకు ప్రసిద్ధి. ఇప్పటికీ కొడవ ప్రజలు తమ ఇళ్లలో తుపాకీ, కత్తి ఉండటాన్ని గౌరవంగా భావిస్తారు.
కొడగు ప్రజలు అనాది కాలం నుంచి వేట, వీరత్వానికి ప్రసిద్ధి చెందిన వారు. భారత సైన్యంలో కూడా వీరి పాత్ర ఉంది. భారతదేశ మొదటి ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్పది కూడా కొడుగు జిల్లానే వీరు ప్రతీ ఏటా తమ ఆయుధాలకు పూజ చేస్తారు.
కొడవ సంప్రదాయంలో ‘‘పంది కర్రీ’’/ కూర్గ్ పోర్క్ కర్రీకి ప్రత్యేక చరిత్ర ఉంది. ఇది కేవలం వంటకంగా మాత్రమే కాకుండా, కొడవ సంప్రదాయంతో విడదీయలేని బంధం ఉంది. వివాహ వేడుకల్లో, పుత్తరి(కోత పండగ) వంటి సమయాల్లో పంది కర్రీని చేసకుంటారు. అతిథులకు ఈ కర్రీని వడ్డించడాన్ని గౌరవంగా భావిస్తారు.
భౌగోళిక, చారిత్రక కారణాలు:
కొడవ సంప్రదాయంలో పందికర్రీకి ప్రాధాన్యత ఏర్పడటానికి ఆ ప్రాంత భౌగోళిక స్వరూపం, చారిత్రక , సాంస్కృతిక కారణాలఉ న్నాయి. కూర్గ్ పశ్చిమ కనుమల్లో చల్లని ప్రాంతం. ఈ ప్రాంతం వారికి పంది మాంసంలో ఉండే కొవ్వులు, మసాలా ఘాటు శరీరంలో వేడిని ఇస్తుంది. కొడవ యోధులు పూర్వం అడవుల్లో వేటకు వెళ్లి పందిని తీసుకువచ్చేవారు. వేటాడిని మాంసాన్ని వండుకోవడం ఆచారంగా అప్పటి నుంచి వస్తోంది.
కూర్గ్ ప్రాంతం కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఈ తోటల్లో పనిచేసే వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. హై ప్రొటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా ఒక కారణంగా మారింది.
తయారీ విధానంతో కూడా ప్రత్యేకతనే:
పంది కర్రీని టిపికల్ కొడవ స్టైల్‌లో చేస్తారు. దీనికి కాంచంపులి అనే ఒక ప్రత్యేకమైన వెనిగర్‌ను వాడుతారు. ఇది పాత కాలంలో, అంటే ఫ్రిజ్ లేని సమయంలో మాంసం ఎక్కువ రోజులు ఉండేందుకు సహాయపడేది. ఇది మాంసానికి పుల్లని రుచిని ఇచ్చి, వారం రోజుల పాటు పాడవకుండా ఉంచుతుంది. ఇప్పటికీ దీనిని పంది కర్రీలో వాడుతారు.
ఈ కర్రీలో వేసే మసాలాకు కూడా ప్రత్యేకత ఉంది. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, మెంతులు, చెక్క, లవంగాలు వేయించి వీటిని మాంసానికి కలుపుతారు. దీని వల్ల పంది కర్రీకి నలుపు రంగు వస్తుంది. మసాలా ఎంత నల్లగా ఉంటే, కర్రీకి అంత టేస్ట్ వస్తుందని చెబుతుంతారు. దీనిని సంప్రదాయంగా ‘కదంబట్టు’( ఆవిరిపై ఉడికించిన బియ్యం పిండితో చేసిన ఉండలు)తో తింటారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్‌లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు