100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei Mate 80 Pro Launch: హువాయి (Huawei) నుండి సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ హువాయి మేట్ 80 ప్రో (Huawei Mate 80 Pro) ను అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మాడ్రిడ్ లో జరిగిన “Now is Your Run” కార్యక్రమంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. చైనా వేరియంట్‌తో పోలిస్తే గ్లోబల్ వేరియంట్ లో కొన్ని మార్పులు ఉన్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో చూసేద్దామా..
హువాయి మేట్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. చైనాలో విడుదలైన మోడల్ ‘హార్మొనీ ఓఎస్’ (HarmonyOS 6.0) తో పనిచేస్తుండగా.. అంతర్జాతీయ వెర్షన్ మాత్రం EMUI 15.0 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, గోల్డ్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ప్రస్తుతానికి 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్‌ను మాత్రమే పరిచయం చేసింది.
Also Read
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
Vivo & iQoo Price Hike: భారీగా పెరగనున్న వివో,ఐకూ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు..!
ఈ స్మార్ట్‌ఫోన్ 6.75-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2832 × 1280 పిక్సెల్ రిజల్యూషన్, 460ppi పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. దీని డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1440Hz PWM డిమ్మింగ్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫోన్ వెనుక భాగంలో మూడు శక్తివంతమైన కెమెరాలు ఉన్నాయి.

ఇందులో ప్రధాన కెమెరా 50MP సెన్సార్‌తో కూడిన వేరియబుల్ అపెర్చర్ (f/1.4 నుండి f/4.0), ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సదుపాయం ఉంది. దీనితోపాటు 40MP సెన్సార్ అల్ట్రా-వైడ్ కెమెరా, 48MP మాక్రో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 MP వైడ్ యాంగిల్ ఆటో ఫోకస్ కెమెరాను అమర్చారు. ఇందులో 5,750mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది.
ఈ ఫోన్ దుమ్ము మరియు నీటి నుండి రక్షణ కోసం IP68+IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఇందులో Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, NavIC సపోర్ట్ ఉన్నాయి. గ్లోబల్ మోడల్‌లో ఏ చిప్‌సెట్ వాడారనేది హువాయి అధికారికంగా వెల్లడించలేదు. కానీ చైనా మోడల్‌లో మాత్రం కిరిన్ 9030 ప్రో (Kirin 9030 Pro) చిప్‌సెట్ ఉంది. ప్రస్తుతానికి దీని ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే వివిధ దేశాల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో హువాయి వాచ్ GT రన్నర్ 2, వాచ్ అల్టిమేట్ 2, మేట్ ప్యాడ్ మినీ వంటి ఇతర గ్యాడ్జెట్లను కూడా లాంచ్ చేసింది.

తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!