ఆహారంలో మీరు సెనగపిండి ఎక్కువగా వాడుతున్నారా? అయితే, డయాబెటిస్ నుంచి మీకు రక్షణ లభిస్తున్నట్టే! పరిశోధకులు చెప్పినమాట ఇది.

గోధుమపిండి స్థానంలో సెనగపిండిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కడుపు నిండిన భావనకలుగుతుందట.

రక్తంలో ఇన్సులిన్, టైప్-2 డయాబెటిస్ బారినపడకుండా తప్పించుకోవచ్చని తాజా పరిశోధనలో రుజువైంది.

అధిక బరువుతో పాటు టైప్-2 డయాబెటిస్ బారినపకుండా కూడా సెనగపిండి రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు తెలిపారు.

30 శాతం కొమ్ము శనగపిండి కలిపి గోధుమ పిండితో తయారుచేసిన రొట్టె ఉత్తమట.

సాధారణ రొట్టె తినడంతో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు 40 శాతం తగ్గినట్టు గుర్తించారు.

ఇందులో ఉండే పిండిపదార్థం అరుగుదల స్థాయిని నెమ్మదింపచేయడమే అందుకు కారణమని పరిశోధనలో తేలింది.

షుగర్‌తో బాధపడుతున్నవారు ఈ రొట్టె ట్రై చేయడం మంచిదట.